వికీపీడియా చర్చ:మొలకల జాబితా

తాజా వ్యాఖ్య: మొలక పరిమాణం టాపిక్‌లో 3 నెలల క్రితం. రాసినది: వైజాసత్య

గ్రామాల వ్యాసాలు, సినిమాల వ్యాసాలు, సంవత్సరాల పేజీలు కాకుండా తెలుగు వికీపీడియాలో దాదాపు 3400 మొలకలు ఉన్నాయి. మొత్తం 61% వ్యాసాలు మొలకలు. అత్యంత మొలకలు ఉన్న వికీపీడియాల్లో తెలుగు వికీపీడియా 17వ స్థానములో ఉంది. అందువళ్ళ ఈ జాబితాలోని మొలకలను విస్తరించి తెలుగు వికీపీడియా నాణ్యతను పెంపొందించేందుకు సహకరించండి --వైజాసత్య 20:48, 4 డిసెంబర్ 2007 (UTC)

పై వ్యాఖ్యను చేసినప్పటికీ ఇప్పటికి మొలకలు ఒక 9 శాతం దాకా తగ్గాయి. ప్రస్తుతం మొత్తం 52.8% మొలకలున్నాయి. అత్యంత మొలకలు ఉన్న వికీపీడియాల్లో తెలుగు వికీపీడియా 28వ స్థానములో ఉంది. మనందరం కలిసి కృషిచేస్తే ఈ ఏడాది ఇంకో పదిశాతం దాకా మొలకలను తగ్గించవచ్చు. --వైజాసత్య 06:35, 25 నవంబర్ 2008 (UTC)
ఎటూ డిసెంబరు నెలను వ్యాసాల నాణ్యత పెంచడానికి కేటాయిస్తున్నాం కాబట్టి, ఈ నెలలో అందరికీ ఆమోదయోగ్యమైన టార్గెట్ పెట్టుకుందాం. కొత్తవ్యాసాలను పూర్తిగా ప్రారంభించడం మానేయకుండా, ఒకవేళ ప్రారంభిస్తే వాటిలో కనీస సమాచారం ఉండేలా జాగ్రత్తలు తీసుకుందాం. రవిచంద్ర(చర్చ) 06:48, 25 నవంబర్ 2008 (UTC)

గ్రామ వ్యాసాలు-మొలక

మార్చు

గ్రామాల వ్యాసాలు కాకుండా 3400 మొలకలు ఉన్నాయన్నారు కాని, మొలకల జాబితా పరిశీలించినట్లయితే, అనేక గ్రామాల పేర్లు ఉన్నాయి.

ఈ విషయంలో, నా ఉద్దేశ్యము:

  1. ఎవరయినా గ్రామము గురించి వ్యాసము, ఆ గ్రామ నివాసి కాని,ఆ గ్రామ ఇరుగు పొరుకు గ్రామ నివాసి కాని, ఆ గ్రామమునకు సంబధించి బాంధవ్యము(తాతయ్యగారి/అమ్మమ్మగారి/అత్తవారి ఊరు) కాని, ఆ గ్రామములో చదువుకోవటం, వ్యాపార/ఉద్యోగ రిత్యా ఆ గ్రాంలో కొంతకాలము నివసించిన వారు వ్రాయగలరు.
  2. ప్రతి సభ్యుడు, వారి వారి గ్రామము, తాతయ్య ,అమ్మమ్మల ఊర్లు, అత్తవారి ఊరు, వారు చదువుకున్న లేదా ఉద్యోగము/వ్యాపారము పూర్వములో చేసిన గ్రామము ల గురించి తప్పనిసరిగా వ్యాసాలు వ్రాస్తే చాలావరకు గ్రామ వ్యాసాలకు "మొలక" స్తాయి తొలగించవచ్చును.
  3. ఇక మిగిలిన గ్రామాల గురించి వ్యాసాలు, కొత్త సభ్యులు చేరినప్పుడు, లేదా ప్రస్తుత సభ్యులు, ఆ గ్రామమునకు సంబంధించిన వివరాలు సంపాయించగలిగినప్పుడు, విసరించవచ్చును.
  4. అన్ని గ్రామములకు విస్తారమయున వ్యాసాలు రావటానికి చాలా కాలము పట్టుతుంది.
  5. ప్రస్తుతము వివరాలు లేని గ్రామ వ్యాసల గురించి, అంధ్రప్రదేశ్ ప్రభుత్వ దృష్టికి తెచ్చి, వారి సంబంధిత శాఖ ద్వారా,ప్రభుత్వము ఏర్పరిచిన వెబ్ సైటు లో అటువంటి గ్రామాల గురించి వివరాలు (వికీ నిబంధనలను అనుసరించి, అవసరమయినంతవరకు , వారి ప్రచారలో భాగం కాని వివరాలు మాత్రమే)జత చేయించి, అటువంటి గ్రామ వ్యాసాలకు "ఎడిట్ చెయ్యవలసినవి" అని కొత్త మొలక ఏర్పరిచి, వికీ సభ్యులు, ప్రభుత్వము ఇచ్చిన వివరాలను ఎడిట్ చేసి ఆ వ్యాసాలను పూర్తి చెయ్యొచ్చు.

దయచేసి, పరిశీలంచగలరు.--SIVA 06:00, 20 ఏప్రిల్ 2008 (UTC)Reply

శివ గారూ, మీ సూచనలు బాగున్నాయి. గ్రామాల వ్యాసాల అభివృద్ధికి బాగా ఉపయోగపడతాయి. ఇక ఈ జాబితా విషయానికొస్తే ఈ జాబితా యాంత్రికంగా బాటుచే తయారుచేసినది. గ్రామాల వ్యాసాలు ఇందులో చేరకుండా వడపోసినా అక్కడక్కడ కొన్ని జాబితాలో చేరినట్టున్నాయి. అలాంటివి గమనిస్తే జాబితానుండి తొలగించగలరు. మరో విషయం జాబితాలో మండలాలు మరియు జిల్లాల వ్యాసాలను మినహాయించలేదు --వైజాసత్య 06:30, 25 నవంబర్ 2008 (UTC)

సామెతలకు మొలక స్తాయి అవసరమా?

మార్చు

సామెతలకు మొలక స్తాయిని తొలగించమని నా విన్నపము. ఎందుకంటే, సామెతలు, సామాన్యంగా చూడంగానె అర్థమవుతాయి. వాటిగురించి పెద్దగా వ్రాయవలసిన విషయం ఉండదు. కాబట్టి సామెతల గురించిన వ్యాసాలన్నిటికి "మొలక" స్తాయిని తొలగించి ఆవ్యాసములో సామెత పూర్వాపరాలు, కథలు, పూర్వ సంఘటనలు అని సబ్ హెడింగ్స్(sub headings)ఉంచి ఒక కామన్ సందేశము ఈ కింది విధముగా ఊంచవచ్చు:

"సభ్యులు ఈ సామెత గురించి మరింత వివరణ తగిన సబ్ హెడింగ్స్ కింద వ్రాయమని కోరటమయినది" (ఈ సందేశమును తొలగించటానికి వీల్లేకుండా (READ ONLY)చేస్తే ఇంకా మంచిది)

సామెతలన్నిటికీ పూర్తి స్తాయి వ్యాసాలు వ్రాయగలమనుకోవటము కొంత అత్యాశ అవుతుంది. అలా అనుకొని, సామెతల వ్యాసాలన్నిటికి "మొలక" స్తాయి కొనసాగించినట్లయితే, మొలకల సంఖ్య తగ్గించటము (సామెతలవరకు) దాదాపు అసాధ్యమవుతుందని నా ఉద్దేశ్యము. దయచేసి పరిశీలించండి.--SIVA 05:41, 20 ఏప్రిల్ 2008 (UTC)Reply

చాలామటుకు సామెతలు ఎన్నిటికీ వ్యాసాలు రూపొందవు కనుక సామెతలు విక్షనరీలో ఉండాలి. కానీ మొదట్లో పెద్దగా ఆలోచన చేయక చాలా సామెతలకు విడివిడి పేజీలు సృష్టించాము. కానీ బాగా అభివృద్ధి చెందిన బహుకొద్ది సామెతల పేజీలు తప్ప మిగిలిన సామెతల పేజీలన్నీ విక్షనరీకి తరలించాలి --వైజాసత్య 06:26, 25 నవంబర్ 2008 (UTC)

మొలకల తగ్గింపు కృషి (5560 -- > 4775)

మార్చు

2008 నవంబరు 25న ఈ జాబితాలో 5560 వ్యాసాలున్నాయి. ఈ రోజు (2009 జనవరి 2న) ఇందులో 4775 వ్యాసాలు మాత్రం ఉన్నాయి. మొలకలను తగ్గించడంలో సభ్యుల కృషికి అభినందనలు. మీ కృషిలో ప్రతి నెలా ఒక వారం రోజులపాటు "మొలకల తగ్గింపు" అనే పనిపై దృష్టి పెట్టమని కోరుతున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:24, 2 జనవరి 2009 (UTC)Reply

చాలా మంచి ప్రతిపాదన. మొలకలను తగ్గించడానికి నా కృషి ఎల్లప్పుడూ ఉంటుంది. అంతే కాదు. కొత్త వ్యాసం సృష్టించేటపుడు దానిని విస్తరించిన తరువాతే మరో కొత్త వ్యాసం మొదలుపెట్టాలని కొత్త సంవత్సరం సందర్భంగా నిర్ణయించుకున్నా. :-) రవిచంద్ర(చర్చ) 06:59, 2 జనవరి 2009 (UTC)Reply

నవీకరణ

మార్చు

ఈ జాబితాలో పేర్కొన్న కొన్ని వ్యాసాలను సభ్యులందరం సమిష్టి కృషితో విస్తరించాము. దీన్ని ఒకసారి రిఫ్రెష్ చేస్తే విస్తరించిన వ్యాసాలు వదిలేసి,. కేవలం అతి చిన్న వ్యాసాల మీదనే దృష్టి పెట్టవచ్చు. రవిచంద్ర(చర్చ) 11:57, 16 ఫిబ్రవరి 2009 (UTC)Reply

తగ్గిన మొలకలు

మార్చు

ఇదివరకటి కంటె మొలకలు తగ్గడం శుభసూచకం. తాజా జాబితాలో (03-04-2013నాటికి) 4054 మొలకలు మాత్రమే ఉన్నాయి. ఇందులో పాతవి ఎన్ని, కొత్తవి ఎన్ని అనేది తెలియదు కాని కొత్తవాటితో కలుపుకొని కూడా ఈ సంఖ్య తగ్గిందని చెప్పవచ్చు. ఈ జాబితాలోని వ్యాసాలలో మండల వ్యాసాలెన్ని? నియోజకవర్గాల వ్యాసాలెన్ని? వ్యక్తుల వ్యాసాలెన్ని? ఇలా చేయడానికి సాధ్యమైతే ఆ పనికూడా చేయడం బాగుంటుంది. రిఫ్రెష్ చేసినప్పుడు తగ్గిన వ్యాసాలలో ఏవి ఎంత తగ్గాయి, సభ్యులు ఎలాంటి మొలక వ్యాసాల విస్తరణకు కృషిచేస్తున్నారో తెలుస్తుంది. వర్గాలు సరిగ్గా ఉంటే బాటు ద్వారా వైజాసత్యగారు ఈ పనిచేయగలరనుకుంటా. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:18, 3 ఏప్రిల్ 2013 (UTC)Reply

ఇది తాజా జాబితా కాదు. తొలి విడతగా ఈ జాబితాలో ఉన్న వాటిలో మొలకస్థాయి దాటినవి తొలగించాను. పూర్తిస్థాయి తాజా మొలకల జాబితా ఇంకొద్ది సేపట్లతో బాటు ఎక్కిస్తుంది. మండలాలు, నియోజకవర్గాలు, వ్యక్తుల వ్యాసాల మొలకల తరువాత ఉపపేజీలు చేయగలను. ఇది వరకు సినిమా వ్యాసాల మొలకలకు ఒక జాబితా చేసినట్టు గుర్తు --వైజాసత్య (చర్చ) 10:14, 4 ఏప్రిల్ 2013 (UTC)Reply
మొత్తం వ్యాసాలలో (గ్రామాలు, సినిమాలు కూడా) ఈ చర్చాపేజీలోని నా మొదటి వ్యాఖ్య ఆధారంగా 2007 డిసెంబర్లో 61% శాతం మొలకలుంటే ఇప్పుడు తెవికీ మొలకల శాతం 42.6%.[1] --వైజాసత్య (చర్చ) 10:20, 4 ఏప్రిల్ 2013 (UTC)Reply
అందరూ సంతోషించ వలసిన విషయము. మొలకల శాతం గురించిన ప్రస్తావన ఈ [2]వ్యాసములో ఉన్నది. దీనిలో కూడా సరిదిద్ద వలసిన అవసరము ఉంది. మనము ఆ పని ఎప్పుడు చేయవలనో తెలియజేయగలరు. ఎవరు చేసినా మంచిదే. సభ్యులు స్పందించగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 11:31, 4 ఏప్రిల్ 2013 (UTC)Reply

మొలక పరిమాణం

మార్చు

@వైజాసత్య గారూ, ఈ జాబితాలో కొన్నిటిని చూసాను. వాటిలో కొన్నిటి పరిమాణం 2 కె.బి. (2048 బైట్ల) కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, వాటిని ఈ బాట్ మొలకలుగా చూపిస్తోంది. ఉదా: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ (2964 బైట్లు), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ (4226), స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా (2574), స్నేహితుడు (సినిమా) (3058), స్ప్రింగ్ త్రాసు (2137), స్టాప్ మోషన్ యానిమేషన్ (3266). ఈ బాట్‌కు మొలక పరిమాణంలో పరిమితి 2 కె.బి. ల కంటే ఎక్కువ పెట్టారా? __ చదువరి (చర్చరచనలు) 00:33, 30 సెప్టెంబరు 2024 (UTC)Reply

@చదువరి గారూ, బాటు మెలక పరిమాణంలో పరిమితి పెంచలేదండి. నేను పాపప్ పరికరంతో (దీని పేరు మరచిపోయాను) మీరు చెప్పిన లింకులను చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ (1.3 కేబి), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ (2 కేబి), స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా (1 కేబీ)గా సూచిస్తుంది. అంటే బాటు పరిమాణంగా అంచనా వేసే సంఖ్యకు, పేజీ చరిత్రలో చూపిస్తున్న సంఖ్యకు పొసగట్లేదు. పేజీ చరిత్రలో సంఖ్య, మూసలు వగైరా గట్లాను కూడ వ్యాసపరిమాణంలోకి కలిపేస్తున్నదని నా అనుమానం. దీని గురించి మరింత ఆరాతీస్తా --వైజాసత్య (చర్చ) 00:55, 30 సెప్టెంబరు 2024 (UTC)Reply
Return to the project page "మొలకల జాబితా".