వికీపీడియా చర్చ:వ్యక్తుల పేర్లు

వ్యక్తుల పేర్లు గురించి ఇతర స్థలాలలో జరిగిన చర్చను ఇక్కడికి కాపీ చేస్తున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:14, 5 సెప్టెంబర్ 2008 (UTC)


వికీ చిట్కాలులో

మార్చు
వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబర్ 7 లో ఇలా వ్రాయబడింది.
వ్యాసాల పేర్లతో ఇబ్బంది

ఎన్.టీ.ఆర్., యన్టీయార్, ఎన్.టి.రామారావు, ఎన్.టీ.రామారావు, ఎన్.టి. రామారావు, నందమూరి తారక రామారావు, నందమూరి తారకరామారావు, పద్మశ్రీ ఎన్టీయార్, ఎన్టీవోడు - ఇలా ఎన్నో విధాలుగా వ్యాసాలకు పేర్లు పెట్టవచ్చును. ఏది సరైనది - అన్న విషయంలో మీకే ఒక నిర్ణయానికి రావడం కష్టం కావచ్చును. లేదా మీకు సమంజసమైనది ఇతరులకు అసమంజసం కావచ్చును. వీటిలో కొన్నింటికి దారిమళ్ళింపులు ఉండవచ్చును. కాని అన్నింటికీ సాధ్యం కాదు. పేర్లు పెట్టడానికి కొన్ని మార్గదర్శకాలు వికీపీడియా:శైలిలో ఉన్నాయి. వీటిని ఇంకా అభివృద్ధి చేయాలి.


పేరు ఏదైనా, అందులో వివాదం ఉన్నా - అందుగురించి ఆంగ్ల వికీలో మార్గదర్శకంగా ఉన్న క్రింది వాక్యాలు గమనించండి. -

the current title of a page does not imply either a preference for that name, or that any alternative name is discouraged in the text of articles. Generally, an article's title should not be used as a precedent for the naming of any other articles. Editors are strongly discouraged from editing for the sole purpose of changing one controversial name to another. .. Especially when there is no other basis for a decision, the name given the article by its creator should prevail. Any proposal to change between names should be examined on a case-by-case basis, ... debating controversial names is often unproductive, and there are many other ways to help improve Wikipedia. [1]


అందుకు స్పందన ఇలా ఉంది.

చర్చించాలి అని వేచి ఉండడం దేనికి అని ఇక్కడే చర్చ ప్రారంభిస్తున్నాను. ఈ చర్చ కేవలం తెలుగు వికీలో వ్యక్తుల పేర్లకు సంబంధించిన చర్చగా సభ్యులు గుర్తించండి.

ఈ చిట్కాలో మీరు సూచించిన ఆంగ్లవికీ ఆధారంపై నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. సంబంధిత వాక్యాలు కేవలం వ్యక్తుల పేర్లకు కాకుండా అన్ని వ్యాసాల పేర్లకు సంబంధించి వ్రాసినవిగా ఉన్నాయి. ఆంగ్లవికీలో కూడా చూస్తే కేవలం భారతీయుల పేర్లలోనే ఇలా అబ్రివియేషన్స్ వాడబడి ఉంటాయి(ఒకటి రెండు ఇతర పేర్లు కూడా ఉండవచ్చు). వ్యక్తి పూర్తి పేరు వాడాలన్నది నా ఉద్దేశ్యం. ఇందులో ముందు ఇంటి పేరా లేక వ్యక్తి పేరా అనేది నా ఉద్దేశ్యంలో సంబంధిత వ్యక్తులు వాడిన విధంగా ఉంటే బాగుంటుంది. వాడుక పేరు ఉంటే ఆ పేరుకు దారిమార్పు ఇవ్వవచ్చు. సభ్యులు సానుకూలతతో చర్చించి, పేర్ల విషయంలో ఒక నిర్ణయానికి రావాలన్నది నా ఉద్దేశ్యం. δευ దేవా 13:13, 5 సెప్టెంబర్ 2008 (UTC)

వాడుక పేర్లే వ్యాసపు ప్రధాన పేర్లుగా ఉండాలనేది నా అభిప్రాయం. ఇక వ్యక్తుల పేర్లతో ఉన్న వ్యాసాల విషయానికి వస్తే ఆ వ్యక్తి ఎలా (అంటే ఏ పేరుతో/ఏ విధంగా) ప్రసిద్ధి చెందినాడో ఆ పేరే వ్యాసం పేరుగా ఉండాలి. కొందరు పూర్తి పేర్లతో ప్రసిద్ధి చెందితే మరి కొందరు పొట్టిపేర్లతో అభివృద్ధి చెందుతారు.(దాన్ని మనం మార్చలేము) ఉదా. నీలం సంజీవరెడ్డి పూర్తి పేరుతో ప్రసిద్ధి చెందినాడు, సి.డి.దేశ్‌ముఖ్ మాత్రం సి.డి.పొట్టి పేరుతోనే ప్రసిద్ధి చెందినాడు. అంతేకాని చింతామణి ద్వారకనాథ్............. అని వ్యాసం పేరు ఉంటే బాగుండదు. ఒక వేళ వ్యక్తులు పూర్తి పేరుతో ప్రసిద్ధి చెందితే పూర్తి పేరే వ్యాసం పేరుగా ఉండాలి, అంతేకాని పూర్తి పేరా, పొట్టి పేరా అనేది ప్రధానం కాదు. ఒక పేరుతో ప్రసిద్ధి చెందిన వ్యక్తుల పేర్ల విధానాన్ని మార్చే హక్కు మనకు లేదనుకుంటాను. -- C.Chandra Kanth Rao(చర్చ) 17:46, 5 సెప్టెంబర్ 2008 (UTC)

శైలి చర్చలో- ఆంగ్ల పొడి అక్షరాలు

మార్చు

ప్రస్తుతం ఉన్న శైలి ప్రకారం పొడి అక్షరాల మధ్య ఖాళి ఉండకూడదని ఉంది. ఎందుకని? ఇంగ్లీషులో వ్రాసేటపుడు ఖాళి వదిలే వ్రాస్తాము కదా. ఉదాహరణ en:N. T. Rama Rao సాయీ(చర్చ) 11:03, 20 మార్చి 2008 (UTC)Reply

తెలుగులో సాధారణంగా రెండు రకాలుగా పొడి అక్షరాలను రాస్తూంటారు. మొదటిది ఆంగ్ల పొడక్షరాలనే తెలుగులో రాయటం (ఉదా: ఎన్.టీ.ఆర్), రెండవది పొడక్షరాలకు తెలుగు పదాలనే వాడటం (ఉదా: రావి శాస్త్రి). ఇలా రెండవ రకంగా తెలుగులో పొడి అక్షరాలను రాస్తున్నప్పుడు ఖాళీలను వదలటం నేను ఎక్కడా చూడలేదు. __మాకినేని ప్రదీపు (+/-మా) 11:15, 20 మార్చి 2008 (UTC)Reply
నాకు అర్థం కాలేదు ప్రదీపు గారు. సాయీ(చర్చ) 11:18, 20 మార్చి 2008 (UTC)Reply
రావిశాస్త్రి = రాచకొండ విశ్వనాధ శాస్త్రి. ఇంతకీ మీకే భాగం అర్థంకాలేదు, నేను చెప్పిందేదీ అర్థంకాకపోతే ఇంకొరు వచ్చిచెప్పేదాకా వేచి చూడండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 11:37, 20 మార్చి 2008 (UTC)Reply
ఇప్పుడర్థమైంది. ఇంతకీ మీరేమంటారు? ఖాళి ఉండాలా ఉండకూడదా? సాయీ(చర్చ) 11:40, 20 మార్చి 2008 (UTC)Reply

చర్చ ముందుకెళ్ళట్లేదు సాయీ(చర్చ) 16:49, 24 మార్చి 2008 (UTC)Reply

ఖాళీ ఉన్నా లేకున్నా పెద్ద కొంపమునిగేదేం లేదు. తెలుగు భాషకు ఈ విరామసంకేతాలు కొత్త..వీటిని ఎలా వ్రాయాలని ఒక ప్రామాణిక శైలి మాన్యువల్ తెలుగులో ఇప్పటికీ ఉన్నట్టు లేదు. కాబట్టి ఎలా వ్రాసినా ఒకే నిర్ధిష్ట విధానములో వ్రాస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో అలా ఒక నియమం పెట్టడం జరిగింది. ప్రదీపన్నట్టు తెలుగులో విరామియ్యటమే ఒక పెద్ద ఖాళీ మళ్ళీ ఖాళీ ఎందుకనే అభిప్రాయమున్నది. ఈ విషయాల్లో నేను నిపుణున్ని కాను..ఎవరైనా భాషావేత్తను సంప్రదిస్తే బాగుంటుంది --వైజాసత్య 19:18, 24 మార్చి 2008 (UTC)Reply


మూడు విధాల పరిశీలన

సాయీ ఈ విషయం లేవనెత్తాక నేను కొన్ని పాత పేపర్లు, పుస్తకాలు తిరగేశాను. మూడు విధాల గురించి క్లుప్తంగా ..

ఎ.కె.టి.వెంకట రామకృష్ణ - (అసలు ఖాళీలు లేకుండా): ప్రస్తుతం తెలుగు వికీలో మనం ఈ విధానం వాడుతున్నాము. కాని వ్యాకరణ పరంగా ఇది సరి కాదు. ఇక్కడ "ఎ.కె.టి.వెంకట" అనేది ఒక పదంగాను, "రామకృష్ణ" అనేది మరొక పదంగాను పరిగణించబడుతాయి. ఇది హేతుబద్ధం కాదు.
ఎ. కె. టి. వెంకట రామకృష్ణ - ప్రతి పొడి అక్షరానికీ ఖాళీలు ఉంచడం. - ఆంగ్లంలో వాడుక పద్ధతి (ఆంగ్ల వికీపీడియా గురించి కాదు) ప్రకారం ఇది సరైనది అనుకోవచ్చును . కాని అక్షరాలు విరజల్లినట్లుంటాయి. అంతే గాకుండా ఇంగ్లీషువాళ్ళకు ఇలాంటి రూలు ఏమీ లేదు. వాళ్ళకిష్టమైనప్పుడు ఇంకో విధం మొదలుపెట్టి ఇది ఫలానా స్టైలు అని ఒక క్రొత్త పేరు కూడా పెట్టేసుకొంటారు. సిలబస్‌లో చేర్చేస్తారు. (Look at the sample paper to see how the authors' first names are listed. You will note that only the initials are given, and that multiple initials are separated by a full stop without spaces. So in the Initials box, select the option A.B. making sure to choose the option without spaces between the initials.[2]. --- Do not insert a space between two initials: W.R. [3]). కనుక మనం వారిని అనుసరించవలసిన పని లేదు. అంతే కాకుండా "ఎన్.టి.ఆర్.", "వై.ఎస్.ఆర్." ఇలా పొడి అక్షరాలను పేర్లుగా వాడే పద్ధతి మనకున్నది. కనుక అక్షరాల మధ్య ఖాళీలుంటే అసంబద్ధంగా ఉంటుంది.
ఎ.కె.టి. వెంకట రామకృష్ణ - పొడి అక్షరాల మధ్య ఖాళీలు లేవు. కాని చివరి పొడి అక్షరం తరువాత చుక్క తరువాత, పదం మొదలయ్యేముందు ఒక ఖాళీ ఉంది. నేను పరిశీలించిన పుస్తకాలు, పేపర్లలో కూడా ఇదే చూశాను. కనుక ఇది సరైన విధం అనిపిస్తున్నది.
--కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:27, 24 మార్చి 2008 (UTC)Reply
నాకు కూడా మూడవదే సరైనదనిపిస్తుంది. సాయీ(చర్చ) 06:01, 26 మార్చి 2008 (UTC)Reply



రచ్చబండ ప్రతిపాదనలలో- పేర్లు, ఇంటిపేర్లు

మార్చు

వ్యక్తుల పేర్ల మీద వ్యాసాలు వ్రాసే వ్రాసేటపుడు వారి ఇంటి పేరు గురించి క్రొత్త విధానం ఉచితమని నాకు అనిపిస్తున్నది. ఉదాహరణకు

నా ప్రతిపాదన ఏమంటే ప్రధాన వ్యాసం పేర్లు సూదిని జైపాల్ రెడ్డి, సామర్లకోట వెంకట రంగారావు గా ఉండాలి. ఎస్.జైపాల్ రెడ్డి, ఎస్.వి. రంగారావు వంటి పొడి అక్షరాల పేర్లు దారి మళ్ళింపు పేజీలుగా ఉండాలి. మీ అభిప్రాయాలు తెలుప గలరు. సభ్యుల అభిప్రాయాలను బట్టి వికీపీడియా:శైలి లో తగు మార్గదర్శకాలు వ్రాయవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:18, 28 జూలై 2008 (UTC)Reply

కాసుబాబు గారూ! మీరు చెప్పింది కరక్టే, నేను చాలా సార్లు ఈ విషయం గురించి చర్చిద్దామనుకున్నాను. ఇంకో సమస్య ఏంటంటే ఒకే పేరుతో ఇంటి పేర్లు వేరు వేరుగా ఉన్నా ఆంగ్లంలో అబ్రివియేట్ చేస్తే అయోమయం రావచ్చు. δευ దేవా 19:36, 28 జూలై 2008 (UTC)Reply
పూర్తి పేర్లతో వ్యాసాలు రాయడమే సరైన మార్గమని నా అభిప్రాయం. ఒకవేళ పొడి పేర్లు ప్రాచుర్యంలో ఉంటే వాటికి దారి మార్పు పేజీలు సృష్టించవచ్చు. రవిచంద్ర(చర్చ) 04:02, 29 జూలై 2008 (UTC)Reply
కాసుబాబు చెప్పింది చాలా సరైనది. పూర్తి పేరులతోనే ప్రధాన వ్యాసాలు ఉండడం సబబు. అదేవిధంగా చేద్దాం.Rajasekhar1961 13:39, 31 జూలై 2008 (UTC)Reply

పూర్తి పేర్లు, పొట్టి పేర్లు

మార్చు

పాతచర్చలన్నింటిని సంగ్రహించి ఒకచోట చేర్చినందుకు కాసుబాబు గారికి ధన్యవాదాలు. ఆంగ్ల భాషలో పేర్ల గురించి పైన ఒక వివరణ ఉన్నది. వారు ఎప్పుడు కావాలంటే అలా పేర్లు మార్చుతారని. ఇలా పేర్లను కుదించడం సాధారణంగా ప్రచురణలల్లో జరగవచ్చు. రెఫరెన్సులను ఇచ్చేటప్పుడు ఒక నిర్దిష్టమైన పద్దతిని వాడి ఆయా ప్రచురణలకు అనుకూలంగా మార్చుకుంటారు. మనం కూడా ఒక పద్దతిని అంగీకరించి ఎందుకు పాటించ కూడదు. ఓ రకంగా చెప్పాలంటే తెలుగులో ఈ అబ్రివియేషన్లను వాడడం కూడా ఆంగ్ల భాష ప్రభావం వల్లే అని చెప్పాలి. వ్యక్తి పేర్లను మనము ఏ రకంగానూ మార్చడానికి ప్రయత్నించడం లేదు. పూర్తి పేరు వారికే చెందుతుంది. అబ్రివియేట్ చేయబడ్డ పేర్లను వాడడం వల్ల అయోమయం వస్తుందనేది నా అభిప్రాయం. ఇలా పూర్తి పేర్లు వాడడం వల్ల వికీపీడియాలో వాడే పేర్లలో ఒక సారూప్యత ఉంటుంది. మరియు పేరుకు ముందు కొంతమంది ప్రముఖుల్లో డా., కల్నల్, వంటి పదాలుంటాయి. కానీ అవి వారి పేర్లలోని భాగాలు కాదు, గౌరవ సూచకాలు మాత్రమే. వాడుక పేర్లు వాడడం వల్ల ఇదొక సమస్య. ఇంకో విషయం అబ్రివియేషన్లు తెలుగు భాషకు సంబంధం లేకుండా ఆంగ్లంలోనే ఉంటాయి. δευ దేవా 22:24, 5 సెప్టెంబర్ 2008 (UTC)

నా అభిప్రాయాలు
  1. )డా., కల్నల్ లాంటి పదాలు పేర్లతో వాడడానికి నేను కూడా వ్యతిరేకిస్తాను. ఎందుకంటే అవి పేర్లలో భాగంకావు. అయితే దీనికి కొన్నిమినహాయింపులు ఉన్నాయనుకోండి. మహాత్మా గాంధీ దీనికి మంచి ఉదాహరణ. మహాత్మా అనేది పేరులో భాగం కాదు అయినా ఆ పేరుతోనే ప్రసిద్ధి చెందినాడు. కాబట్టి మనం దాన్ని అనుసరించవచ్చు.
  2. )అబ్రివియేషన్ చేయబడ్డ పేర్ల వల్ల ఎలాంటి అయోమయం వస్తుందో తెలియదు. ఒకవేళ అయోమయం వచ్చిననూ మనం దాన్ని అధికమించాలి అంతేకాని పదిమందికి మార్గదర్శకంగా నిలవాల్సిన వికీపీడియాను మనకు అనుకూలంగా (దీనిపై వాదన వద్దు) మార్చుకుంటే బాగుండదు.
  3. )వికీలో సారూప్యత కొరకే పూర్తి పేర్లు ఉండాలను కోవడం బాగుండదు. మనకు కావలసినది పేర్లలో సారూప్యత ఒక్కటే కాదు, అంతకంటే ముఖ్యమైనవి వ్యాసాలలో నాణ్యత, స్పష్టత, ఆధారాలు, నిడివి మొదలగునవి అప్పుడే వికీపై జనాదరణ బాగుంటుంది.
  4. )అబ్రివియేషన్లు తెలుగు భాషకు సంబంధం లేకుండా ఆంగ్లం లోనే ఉండడాన్ని మనమేమీ చేయలేము. దాన్ని అనుసరించడం ఒక్కటే పరిష్కారం. ఆంగ్లేయుల పాలన అనంతరమే ఈ సమస్య వచ్చింది. అంతకు పూర్వపు వ్యక్తులు పూర్తి పేర్లతోనే ప్రసిద్ధి చెందినారు. సమాజంలో జరిగే మార్పులకు అనుగుణంగా దాన్ని మనం విస్మరించలేము. కాబట్టి వాడక తప్పదు.
  5. ) చివరగా ఒక విషయం నేను పైన చెప్పిన వాక్యాలు దేవా గారికి ఉద్దేశించి కాదు. గత కొద్ది కాలంగా నేను సృష్టించిన వ్యాసాల పేర్లు కొందరు సభ్యులు తరలింపు చేస్తున్నారు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నవి చెప్పేశాను అంతేకాని దేవాగారికి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేయడం లేదు. ఈ విషయంలో దేవాగారు సహకరిస్తారని భావిస్తున్నాను. -- C.Chandra Kanth Rao(చర్చ) 16:28, 6 సెప్టెంబర్ 2008 (UTC)
నేను నా అభిప్రాయం మాత్రమే తెలిపాను. అలాగే మీరు కూడా మీ అభిప్రాయాలు చెప్పారు. ధన్యవాదాలు. వాడుకపేర్లు వాడదామనుకుంటే అలాగే వాడండి. మిగతా సభ్యుల అభిప్రాయాల కొరకు ఒక వారం వేచి చూసి, ఆ తర్వాత నిర్ణయం తీసుకొని నియమావళి రాద్దామా? δευ దేవా 19:55, 6 సెప్టెంబర్ 2008 (UTC)
సరే అలాగే చేద్దాం. సభ్యులందరూ చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలిపితే నియమావళి రచించడానికి చాలా పాయింట్లు దొరుకుతాయి. కాని కొందరు సభ్యులు చర్చలలో పాల్గొనరు కాని తరలింపులలో ముందుంటారు. నియమావళి రచిస్తే మునుముందు ఈ తరలింపుల మరియు తలనొప్పుల బాధ ఉండదు. -- C.Chandra Kanth Rao(చర్చ) 20:07, 6 సెప్టెంబర్ 2008 (UTC)
Return to the project page "వ్యక్తుల పేర్లు".