వికీపీడియా చర్చ:సమావేశం/అంతర్జాతీయ మహిళా దినోత్సవం, భారతదేశం

తాజా వ్యాఖ్య: తలా ఒక చెయ్యి వెయ్యండి టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: వైజాసత్య

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 న కొన్ని కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా తెవికీ సభ్యులు కూడా మహిళా దినోత్సవ సంబంధిత వ్యాసాలను మెరుగు పరచటం ఇంకా సృష్టించటం చేయవచ్చు, భారతదేశంలో జరిగే వివిధ కార్యక్రమాల వివరాలు: http://en.wikipedia.org/wiki/Wikipedia:Meetup/International_Women%27s_Day,_India#Event_details రహ్మానుద్దీన్ (చర్చ) 10:52, 26 ఫిబ్రవరి 2013 (UTC)Reply

ఈ సందర్భంగా ఈ నెల రోజులు వికీపీడియాలో ఆంగ్లమే కాకుండా, తెలుగుతో సహా అన్ని భారతీయ భాషలలొ మహిళలకు సంబంధించిన వ్యాసాలను అభివృద్ధిచేయడం లేనివి ప్రారంభించడానికి నడుం బిగించింది. సుజాత లాంటి సీనియర్ సభ్యులు ఈ విషయంలో కొంత మార్గదర్శకులుగా నిలిచి ఈ కార్యక్రమాన్ని తెలుగు వికీపీడియాలో నడిపించాలని, దానికి మిగిలిన రచయితలు సహకరించవలసినదిగా మనవి చేసుకొంటున్నాను.Rajasekhar1961 (చర్చ) 07:07, 27 ఫిబ్రవరి 2013 (UTC)Reply
ధన్యవాదాలు రహ్మానుద్దీన్ గారు మరియు రాజశేఖర్ గారు. http://en.wikipedia.org/wiki/Wikipedia:Meetup/International_Women%27s_Day,_India#Event_details లో t.sujathaగారు మరియు వైజాసత్యగారు 'Suggested Articles' లో కొన్ని తెలుగు అంశాలను సూచిస్తే చాలా బావుంటుంది. వారు దీనికి నడుం బిగించి మిగితా సభ్యులకు ప్రోత్సాహం కలిగిస్తారని ఆశిస్తూ...విష్ణు (చర్చ) 14:43, 27 ఫిబ్రవరి 2013 (UTC)Reply
తెలుగు వికీపీడియాలోని మహిళలకు సంబంధించిన అన్ని వర్గాల్ని భారతీయ మహిళలు అనే వర్గానికి మార్చి దానికి ఆంగ్ల వికీ లింకు ఇచ్చాను. మీరంటున్నది తెలుగు మహిళల పేర్లను ఈ జాబితాలో చేర్చమనా. లేదా వేరుగా తెలుగు మహిళల జాబితా తయారుచేయాలా. తెలియజేయండి.Rajasekhar1961 (చర్చ) 14:56, 27 ఫిబ్రవరి 2013 (UTC)Reply
రాజశేఖర్ గారు మీరు చేసింది బావుందండి. అలాగే 'Suggested Articles' లో తెలుగుకి ఒక సబ్ సెక్షన్ (5.2) చేసి అందులో కొన్ని అంశాలు (తెలుగులో) సూచిస్తే బావుంటుందేమో. మీరేమంటారు? విష్ణు (చర్చ) 16:07, 27 ఫిబ్రవరి 2013 (UTC)Reply
మంచి ఆలోచన. మీరంటున్నది నేను సరిగా అర్ధం చేసుకుని ఉంటే.. ఈ ఆంగ్ల వికీ పేజీలో తెలుగు విషయాలు జోడించాలా?? వికీపీడియా:సముదాయ పందిరిలో ప్రకటించి తెవికీలోనే కొన్ని వ్యాసాలు అభివృద్ధి చేస్తే బాగుంటుందేమో? ఆంగ్ల వికీకి వచ్చిన కొరతేమీ లేదండి. భావి తెలుగు జాతంతా చదివేది, వ్రాసేది ఆంగ్లంలోనే కదా. కాబట్టి ఎప్పుడో ఒకసారి అక్కడ వ్యాసాలు చేరుస్తారులే. --వైజాసత్య (చర్చ) 04:47, 1 మార్చి 2013 (UTC)Reply
వైజాసత్య గారు మీరు అన్నట్టుగా వికీపీడియా:సముదాయ పందిరిలో ప్రకటించడం ఉత్తమం. అలాగే ఆంగ్ల వికీ పేజీలోనూ పెడితే National Visibility మరియు కొత్త వారిని ఆకర్షించ వచ్చేమోనని చిన్న ఆశ -- విష్ణు (చర్చ) 07:36, 1 మార్చి 2013 (UTC)Reply
అందరం దుర్గాబాయి దేశ్‌ముఖ్ వ్యాసాన్ని విస్తరిద్దాం ఏవంటారు? మరేమైనా ప్రతిపాదనలు --వైజాసత్య (చర్చ) 06:00, 1 మార్చి 2013 (UTC)Reply
వైజాసత్య గారు... నేను సరోజినీ నాయుడు & సురభి కమలాబాయి వ్యాసాలను విస్తరించడానికి నా వంతు కృషి చేస్తానండి విష్ణు (చర్చ) 07:46, 1 మార్చి 2013 (UTC)Reply
నేను విజయలక్ష్మీ పండిట్, సరోజినీ నాయుడు, మేధాపాట్కర్ మరియు మరికొన్ని విశిష్ట మహిళల జీవిత చర్రిత్రలను మహిళా దినోత్సవం లోపు పూర్తిగా విస్తరిస్తాను.(  కె. వి. రమణ. చర్చ 13:11, 1 మార్చి 2013 (UTC))Reply
ఈ కింది వ్యాసాలను పరిశీలించండి. ఇంకా మీకు తోచిన వ్యాసాలను చేర్చండి. మహిళాదినోత్సవ వ్యాసాలు :- సరోజినీ నాయుడు, విజయలక్ష్మి పండిట్, మొల్ల

, ఝాన్సీ లక్ష్మీబాయి , రుద్రమదేవి , ఫ్లారెన్స్ నైటింగేల్ , మదర్ తెరెసా , శోభానాయుడు , మార్గరేట్ థాచర్ , మేరీ క్యూరీ , సిరిమావో బండారినాయకి , ఎం. ఎస్. సుబ్బలక్ష్మి , ఇందిరా గాంధీ , మేధాపాట్కర్ , పి.సుశీల , ఎస్.జానకి , భానుమతి రామకృష్ణ , పసుపులేటి కన్నాంబ , కస్తూరిబా గాంధీ , జానంపల్లి కుముదినీ దేవి , గ్యాన్ కుమారీ హెడా. ఆంగ్ల వికీపీడియాలో 41 మంది మహిళా నోబెల్ పురస్కార విజేతల గురించి వ్యాసాలున్నాయి. లింకు: en:Category:Women Nobel laureates వీటిలో అన్నింటిని కాకపోయినా సుకీ, మేరీ క్యూరీ, మదర్ తెరెసా వంటి కొంతమంది గురించి తెలుగు వికీలో వ్యాసాల్ని అనువదించితే చాలా మంది విద్యార్ధులకు, యువతకు మార్గదర్శకులవుతారు. జేన్ ఆడమ్‍స, కోరీ, గ్రీడర్, క్యూరీ, మొంటాల్సినీ, జోడీ విలియంస్, యాలో, యోనాత్ వ్యాసాలు బాగున్నాయి.Rajasekhar1961 (చర్చ) 13:31, 3 మార్చి 2013 (UTC)Reply

ఈ చొరవ విజయవంతంకావాలని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 14:37, 3 మార్చి 2013 (UTC)Reply

తలా ఒక చెయ్యి వెయ్యండి మార్చు

ఆదర్శ వనితలు వ్యాసంలో ఒక తొమ్మిది మంది స్వాతంత్ర సమరయోధురాళ్ళ పేర్లకు ఎర్రలింకులు ఇచ్చాను. వాటిలో వ్రాయటానికి సమాచారమున్న ఒక వెబ్‌సైటు లింకు కూడా ఇచ్చాను. క్రియాశీలక సభ్యులందరూ ఒక్కో వ్యాసం తీసుకుని పూర్తిచేస్తే ఈ తరం మరచిపోయిన తొమ్మిది మంది తెలుగు వీరవనితలను అందరికీ పరిచయం చేసినట్లు అవుతుంది. ముందస్తుగా కృతజ్ఞతలు --వైజాసత్య (చర్చ) 07:34, 12 మార్చి 2013 (UTC)Reply

Return to the project page "సమావేశం/అంతర్జాతీయ మహిళా దినోత్సవం, భారతదేశం".