విక్కీ దాదా 1989 లో వచ్చిన నేర చిత్రం. కామాక్షి ఆర్ట్ మూవీస్ పతాకంపై ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో డి. శివప్రసాదరెడ్డి నిర్మించాడు. ఇందులో అక్కినేని నాగార్జున, రాధా, జూహి చావ్లా ప్రధాన పాత్రల్లో నటించారు. రాజ్-కోటి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టైంది. హిందీలో మేరీ దునియా [1][2][3] గా అనువదించారు.

విక్కీదాదా
(1989 తెలుగు సినిమా)
Vicky Daada.jpg
దర్శకత్వం ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాణం డి. శివప్రసాద్ రెడ్డి
కథ యండమూరి వీరేంద్రనాథ్
చిత్రానువాదం పరుచూరి సోదరులు
తారాగణం నాగార్జున
రాధ
జుహి చావ్లా
గొల్లపూడి మారుతీరావు
గిరిబాబు
రంగనాథ్
కోట శ్రీనివాసరావు
సంగీతం ఇళయరాజా
ఛాయాగ్రహణం ఎన్.సుధాకరరెడ్డి
కూర్పు డి. వెంకటరత్నం
నిర్మాణ సంస్థ కామాక్షి మూవీస్
భాష తెలుగు

కథసవరించు

అక్కినేని నాగార్జున న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేట్. అతను, జూహి చావ్లా ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఆమె ఆ పట్టణం నుండి వేరే ఊరు వెళ్ళి కొన్నాళ్ళ తరువాత తిరిగివస్తుంది. అప్పటికి నాగార్జున విక్కీ దాదా (అతని నామమాత్రపు పాత్ర) పేరుతో ఓ రౌడీగా కనిపిస్తాడు. కోర్టులో జరిగిన అవినీతి కారణంగా నాగార్జున నేరస్థుడిగా మారతాడు. అతను విలన్లను (కన్నడ ప్రభాకర్ నేతృత్వంలో ఉన్న) వేటాడే పనిలో ఉంటాడు. . వాళ్ళను ఎలా ఎదుర్కొని, పేదలకు ఎలా సహాయం చేస్తాడనేది మిగిలిన కథ.

నటవర్గంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

పాటలుసవరించు

వేటూరి సుందరరామమూర్తి రాసిన పాటలకు రాజ్-కోటి సంగీతం సమకూర్చారు. AMC ఆడియో కంపెనీ ద్వారా సంగీతం విడుదలైంది.

సంఖ్య. పాటగాయనీ గాయకులు నిడివి
1. "ఓ బేబీ నీమీద"  మనో, ఎస్. జానకి 4:23
2. "అబ్బ టక్కు టిక్కు"  ఎస్.పి.బాల్సుబ్రహ్మణ్యం, పి.సుశీల 4:07
3. "బ్యూటీ బ్యూటీ"  ఎస్.పి.బాల్సుబ్రహ్మణ్యం, ఎస్. జానకి 4:57
4. "గంటగంటకీ మోతగుంటది"  ఎస్.పి.బాల్సుబ్రహ్మణ్యం, ఎస్. జానకి 4:27
5. "జారిందమ్మో జారిందమ్మో"  ఎస్.పి.బాల్సుబ్రహ్మణ్యం, ఎస్. జానకి 4:01
మొత్తం నిడివి:
21:55

మూలాలుసవరించు

  1. Vicky Dada (1989) – IMDb
  2. Vicky Dada (1991) – Movie Review, Story, Trailers, Videos, Photos, Wallpapers, Songs, Trivia, Movie Tickets
  3. Vicky Dada – YouTube