విజిల్ (2019 సినిమా)
విజిల్ 2019, అక్టోబరు 25న విడుదలైన తమిళ అనువాద చలనచిత్రం. ఫుట్‌బాల్ ఆట నేపథ్యంలో అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్, నయనతార, వివేక్, యోగిబాబు, జాకీష్రాఫ్, డేనియల్ బాలాజీ, అనంత్‌రాజ్ తదితరులు నటించగా, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించాడు.[4] ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కల్పతి సుబ్రమణ్యన్ అఘోరం ఈ చిత్రాన్ని నిర్మించాడు.[5] అట్లీ, విజయ్ కాంబినేషన్ లో 2016లో పోలీసోడు (తేరి), 2017లో అదిరింది (మెర్సల్) సినిమాలు వచ్చాయి.[6] ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేశాడు. 2019, జూన్ 22న విజిల్ టైటిల్ ప్రకటించారు.[7]
విజిల్ | |
---|---|
దర్శకత్వం | అట్లీ |
రచన | అట్లీ ఎస్. రమణ గిరివాసన్ శ్రీరామకృష్ణ (మాటలు-తెలుగు) |
స్క్రీన్ ప్లే | అట్లీ ఎస్. రమణ గిరివాసన్ |
కథ | అట్లీ |
నిర్మాత | కల్పతి సుబ్రమణ్యన్ అఘోరం కల్పతి సుబ్రమణ్యన్ గణేష్ కల్పతి సుబ్రమణ్యన్ సురేష్ మహేశ్ కోనేరు (తెలుగు) |
తారాగణం | విజయ్, నయనతార, వివేక్, యోగిబాబు, జాకీష్రాఫ్, డేనియల్ బాలాజీ, అనంత్‌రాజ్ |
ఛాయాగ్రహణం | జి.కె. విష్ణు |
కూర్పు | రూబెన్ |
సంగీతం | ఏ.ఆర్. రెహమాన్ |
నిర్మాణ సంస్థలు | ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ (తెలుగు) |
పంపిణీదార్లు | స్క్రీన్ సీన్ మీడియా ఎంటర్టైన్మెంట్ |
విడుదల తేదీs | 25 అక్టోబరు, 2019 |
సినిమా నిడివి | 177 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | తమిళ |
బడ్జెట్ | 180 కోట్లు[2][3] |
కథ
మార్చుచెన్నైలోని ఓ మురికివాడలో గ్యాంగ్‌స్టర్‌గా ఉన్న రాయప్పన్ (విజయ్) తన కొడుకు మైఖేల్ అలియాస్ విజిల్‌ను (విజయ్) జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా తయారుచేయాలి అనుకుంటాడు. ఫుట్‌బాల్ నేషనల్ ఛాంపియన్‌ఫిప్‌లో పాల్గొనడానికి విజిల్ ఢిల్లీ వెళ్తున్న సమయంలో రాయప్పన్ హత్య చేయబడుతాడు. దాంతో మైఖేల్ పుట్‌బాల్ ఆటను వదిలేసి తన తండ్రి బాధ్యతల్ని స్వీకరించి గ్యాంగ్‌స్టర్‌గా మారుతాడు. కానీ స్నేహితుడి మరణంతో విజిల్ జీవితం మలుపు తిరుగి, మహిళా ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా వెళ్ళాల్సివస్తుంది. ఈ నేపథ్యంలో విజిల్ జీవితంలో ఎదురైన సంఘటనలు, మహిళల్ని స్ఫూర్తివంతంగా తీర్చిదిద్ది విజేతలుగా నిలిపే క్రమంలో విజిల్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడన్నది చిత్రకథ.
నటవర్గం
మార్చు- విజయ్ (రాయప్ప, మైకెల్ రాయప్ప/విజిల్)[8]
- నయనతార (ఏంజిల్)[9]
- వివేక్ (నెస్సి)
- కదిర్ (కదిర్)
- జాకీ ష్రాఫ్ (జె.కె. శర్మ)[10]
- డేనియల్ బాలాజీ (డానియేల్)[11]
- ఆనంద్ రాజ్ (రాయప్ప స్నేహితుడు)
- దేవదర్శిని (ఎలిజబెత్)[12]
- యోగి బాబు (డోనాల్డ్)
- సౌందరరాజ (గుణ)[13]
- జి. జ్ఞానసంబంధం (ఆశీర్వాదం, ఏంజిల్ తండ్రి)
- ఐ.ఎం. విజయన్ (అలెక్స్)[14]
- ఇంధూజ రవిచంద్రన్ (వేంబు)[15]
- రెబా మోనికా జాన్ (అనితా)
- వర్ష బొల్లమ్మ (గాయత్రి)[16]
- అమృతా అయ్యర్ (తెండ్రల్)[17]
- ఇంద్రజ శంకర్ (పాండియమ్మ)[18]
- ఆదిరత్ సౌందరాజన్
- గాయత్రి రెడ్డి[19]
- మనోబాల (ఏంజిల్ ప్రొఫెసర్)[20]
- మాథ్యూ వార్గెస్ (పోలీస్ ఇన్సిపెక్టర్)
- జార్జ్ మేరియన్
- శాంతి మణి
- నిత్యారాజ్
- ప్రజూణ సారా
- కీర్తన
- అట్లీ (సింగప్పెన్నేయ్ పాటలో ప్రత్యేక పాత్ర)
- ఎ.ఆర్. రహమాన్ (సింగప్పెన్నేయ్ పాటలో ప్రత్యేక పాత్ర)
- పూవైయార్ (వేరితనమ్ పాటలో ప్రత్యేక పాత్ర)
సాంకేతికవర్గం
మార్చు- కథ, దర్శకత్వం: అట్లీ
- నిర్మాత: కల్పతి సుబ్రమణ్యన్ అఘోరం, కల్పతి సుబ్రమణ్యన్ గణేష్, కల్పతి సుబ్రమణ్యన్ సురేష్, మహేష్ ఎస్. కోనేరు (తెలుగు)
- రచన, స్క్రీన్ ప్లే: అట్లీ, ఎస్. రమణ గిరివాసన్
- మాటలు: శ్రీరామకృష్ణ (తెలుగు)
- సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
- ఛాయాగ్రహణం: జి.కె. విష్ణు
- కూర్పు: రూబెన్
- నిర్మాణ సంస్థ: ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ (తెలుగు)
- పంపిణీదారు: స్క్రీన్ సీన్ మీడియా ఎంటర్టైన్మెంట్
నిర్మాణం
మార్చు2019, జనవరి 21న అధికారిక ఫోటోగ్రఫీ ప్రారంభమయింది.[5][21][22] విజయ్, నయనతార, వివేక్, ఆనంద్ రాజ్ లు ఎంపికయ్యారు.[23][24] జి.కె. విష్ణును ఛాయాగ్రాహకుడిగా, రూబెన్ ను ఎడిటర్ గా తీసుకున్నారు. వీరు మెర్సెల్ సినిమాకి కూడా పనిచేశారు. 2019, ఆగస్టులో సినిమా నిర్మాణం పూర్తి అయింది.[25][26]
విడుదల
మార్చుస్క్రీన్ సీన్ మీడియా ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ ద్వారా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పంపిణి చేయబడింది.[27] ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ పతాకంపై మహేష్ ఎస్. కోనేరు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశాడు.[28] 2019, అక్టోబరు 6న ఫస్ట్ లుక్ పోస్టర్, అక్టోబరు 17న ట్రైలర్ విడుదల అయింది.[29]
విడుదలకు ముందు బిజినెస్
మార్చుఈ చిత్ర నిర్మాణానికి 180 కోట్లు ఖర్చు చేశారు.[30] సినిమా ప్రదర్శన, విదేశాల్లో ప్రదర్శన, డిజిటల్, శాటిలైట్, ఆడియో హక్కులు అన్నీ కలిపి విడుదలకు ముందే 220 కోట్ల బిజినెస్ చేసింది.[31][32] టీవి హక్కులు సన్ టీవి దక్కించుకుంది.[33]
స్పందన
మార్చువిజయ్ తండ్రి (రాజప్ప) కొడుకు (విజిల్) పాత్రల్లో తనదైన నటనను కనబరచడమేకాకుండా రాజప్ప పాత్రలో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కథానాయికగా నయనతార అభినయంతో మెప్పించింది. రహమాన్ నేపథ్య సంగీతం, జి.కె. విష్ణు ఛాయాగ్రహణం బాగున్నాయి.
రేటింగ్
మార్చు- టైమ్స్ ఆఫ్ ఇండియా - 3/5[34]
- సిఫి - 3.5/5[35]
- ఫస్ట్ పోస్ట్ - 3.25/5[36]
- ఇండియాగ్లిడ్జ్ - 2.75/5[37]
ఇతర వివరాలు
మార్చుఈ సినిమా కథపై వివాదాలు ఉన్నాయి. తన సినిమా ‘స్లమ్ సాకర్’ కాన్సెప్ట్‌తో అట్లీ ‘విజిల్’ తీశాడని నంది చిన్ని కుమార్ తెలంగాణ సినిమా రచయితల సంఘాన్ని కోరగా, తన కథను కాపీ కొట్టారంటూ దర్శకుడు కేపీ సెల్వ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశాడు.[38]
పాటలు
మార్చుఈ చిత్రానికి ఎ.ఆర్. రహమాన్ సంగీతం అందించాడు.
- సివంగివే - ఎ.ఆర్. రహమాన్, శరత్ సంతోష్, శాష తిరుపతి
- వెర్రెక్కింద్దాం - రేవంత్, ఎ.ఆర్. రహమాన్
- నీతోనే - మధుర దర తల్లూరి, ఎ.ఆర్. రహమాన్, అనురాగ్ కులకర్ణి
- మానిని - మధుర దర తల్లూరి, ఎ.ఆర్. రహమాన్, చిన్మయి, శిరీష
- విజిలు విజిలు విజిలమ్మ - ఎ.ఆర్. రహమాన్
మూలాలు
మార్చు- ↑ "BIGIL UNCUT". British Board of Film Classification.
- ↑ Ramanujam, Srinivasa (12 October 2019). "'Bigil' cost us ₹180 crore, says AGS Entertainment's Archana Kalpathi". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 26 October 2019.
- ↑ Chauhan, Gaurang (6 October 2019). "With a whopping budget of Rs 180 crore, Thalapathy Vijay's Bigil is the most expensive Tamil film after 2.0 | Entertainment News". Times Now. Retrieved 26 October 2019.
- ↑ "Rajkumar joins the cast of 'Thalapathy 63' – Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 26 October 2019.
- ↑ 5.0 5.1 "'Thalapathy 63 (Bigilu)' crosses a milestone – Tamil Movie News". IndiaGlitz.com. 11 February 2019. Retrieved 26 October 2019.
- ↑ ఈనాడు, సినిమా (25 October 2019). "రివ్యూ: విజిల్". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 25 October 2019. Retrieved 26 October 2019.
- ↑ "The first look and title of Thalapathy 63 released". WE Magazine (in అమెరికన్ ఇంగ్లీష్). 21 June 2019. Archived from the original on 22 June 2019. Retrieved 26 October 2019.
- ↑ "Here is the catchy nickname for Vijay in Thalapathy-63!". Sify. Retrieved 20 June 2019.
- ↑ Subramanian, Anupama (20 June 2019). "Nayan is an 'angel' now". Deccan Chronicle. Retrieved 20 June 2019.
- ↑ "Jackie Shroff joins Vijay's 'Thalapathy 63'". DNA India. 21 March 2019.
- ↑ Chennai (6 February 2019). "Thalapathy 63: Vijay's name in Atlee film leaked?". India Today (in ఇంగ్లీష్). Retrieved 26 October 2019.
- ↑ "Devadarshini reveals interesting details on Thalapathy 63! - Tamil News". IndiaGlitz.com. 23 April 2019.
- ↑ "After Theri, Soundararaja to share screen space with Vijay in Thalapathy 63". in.com. Archived from the original on 2019-04-14. Retrieved 2019-10-26.
- ↑ "Bigil update: Former Indian football captain IM Vijayan to play an important role in the Vijay-starrer". The New Indian Express. 11 July 2019. Retrieved 26 October 2019.
- ↑ "Breaking: Another heroine joins Vijay's Thalapathy 63! - Tamil News". IndiaGlitz.com. 10 April 2019.
- ↑ "Bigil: Thalapathy Vijay and team complete shooting at a massive railway station set". in.com (in ఇంగ్లీష్). 5 July 2019. Archived from the original on 5 జూలై 2019. Retrieved 26 October 2019.
- ↑ "Amritha Aiyer joins the cast of Thalapathy 63". The New Indian Express. 16 May 2019. Retrieved 26 October 2019.
- ↑ "The 11th woman football player in Vijay's Bigil, revealed". The New Indian Express. Retrieved 26 October 2019.
- ↑ "Gayathri Reddy | Thalapathy's golden gift: Pictures of Bigil team with the golden rings". Behindwoods. 14 August 2019. Retrieved 26 October 2019.
- ↑ "Manobala to play a small role in Bigil? - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 14 July 2019. Retrieved 26 October 2019.
- ↑ Chennai (20 January 2019). "Thalapathy 63: Vijay film kickstarts with puja". India Today (in ఇంగ్లీష్). Retrieved 26 October 2019.
- ↑ "Vijay's upcoming sports drama Thalapathy 63 goes on floors, have a look at the cast and crew of the movie!". Time Now. 22 January 2019. Retrieved 26 October 2019.
- ↑ "WOW! Vijay's lucky costar joins 'Thalapathy 63' – Tamil Movie News". India Glitz. 17 November 2018.
- ↑ "AR Rahman on Thalapathy 63: I haven't worked on this genre in south India". Hindustan Times (in ఇంగ్లీష్). 5 February 2019. Retrieved 26 October 2019.
- ↑ "Bigil update: Shooting to be wrapped by August 9; Vijay to start dubbing this week". The New Indian Express. Retrieved 26 October 2019.
- ↑ "Vijay completes shooting for 'Bigil' – Times of India". The Times of India (in ఇంగ్లీష్). 14 August 2019. Retrieved 26 October 2019.
- ↑ Scene, Screen (18 October 2019). "We are proud to announce our esteemed distributors for our much awaited movie BIGIL! @actorvijay @Ags_production @archanakalpathi @Atlee_dir @arrahman #Nayanthara #screenscene #BigilFromOct25 #BigilDiwali #Verithanam #PodraVediyapic". @Screensceneoffl (in ఇంగ్లీష్). Retrieved 26 October 2019.
- ↑ "'Bigil' Releasing In 400 Screens Across AP And Telangana; Here's Everything You Need To Know". Retrieved 26 October 2019.
- ↑ "The first look for the Telugu version of Bigil is out". The New Indian Express. Retrieved 26 October 2019.
- ↑ "Bigil to release in 4200 screens, total budget is 180 crores". Sify (in ఇంగ్లీష్). Retrieved 26 October 2019.
- ↑ "'Bigil' overseas rights sold for a record price!". Sify (in ఇంగ్లీష్). 25 July 2019. Retrieved 26 October 2019.
- ↑ Upadhyaya, Prakash (2 July 2019). "Vijay's popularity takes giant leap; Bigil set to earn Rs 220+ crore even before release". International Business Times, India Edition. Retrieved 26 October 2019.
- ↑ "SunTV bags Television rights of Thalapathy 63". Behindwoods. 19 March 2019. Retrieved 26 October 2019.
- ↑ "Bigil Movie Review". TimesofIndia.
- ↑ "Bigil review: Paisa vasool entertainer". Sify.
- ↑ "Bigil movie review: Vijay shines in Atlee's adrenaline pumping commercial entertainer tailor-made for the actor's fans". Firstpost.
- ↑ "Bigil Review". IndiaGlitz.
- ↑ ఈనాడు, సినిమా (18 October 2019). "'అట్లీ నా కథ కాపీ కొట్టారు'". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 26 October 2019. Retrieved 26 October 2019.