విద్యారావు

తెలంగాణకు చెందిన హిందుస్థానీ శాస్త్రీయ గాయని, రచయిత్రి.

విద్యారావు, తెలంగాణకు చెందిన హిందుస్థానీ శాస్త్రీయ గాయని, రచయిత్రి. తుమ్రి, దాద్రా శైలీలలో ప్రసిద్ధి పొందింది.[1] దివంగత నైనా దేవి గురించి హార్ట్ టు హార్ట్: రిమెంబరింగ్ నైనాజీ అనే పుస్తకాన్ని రాసింది. విద్యారావు కుమార్తె అదితిరావు హైదరీ సినిమా నటి.

విద్యారావు
విద్యారావు (2016)
వ్యక్తిగత సమాచారం
జననంహైదరాబాదు, తెలంగాణ
వృత్తిగాయని
పిల్లలుఅదితిరావు హైదరీ
వెబ్‌సైటుwww.vidyaraosinger.com

తొలి జీవితం మార్చు

విద్యారావు, తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తిలో పుట్టి హైదరాబాద్‌లో పెరిగారు. ఆమె మద్రాసు నుండి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, తరువాత ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సోషియాలజీలో ఏంఏ చదివింది.[2]

వృత్తిరంగం మార్చు

సంగీతరంగంలోకి రావడానికిముందు సెంటర్ ఫర్ ఉమెన్స్ డెవలప్‌మెంట్ స్టడీస్‌తో కలిసి ఐదు సంవత్సరాలు పరిశోధకురాలిగా పనిచేసింది.[3] అమీర్ ఖుస్రో, కబీర్ మొదలైన ఆధ్యాత్మికవేత్తల కవిత్వాన్ని అందించింది.[4]మణిరత్నం దర్శకత్వం వహించిన రావణన్ (2010) సినిమాలో ఐశ్వర్య రాయ్ తల్లిపాత్రతో సినిమారంగంలోకి ప్రవేశించింది. అయితే, ఆమె నటించిన సన్నివేశాలు సినిమా నుండి కత్తిరించబడ్డాయి.[5]

వ్యక్తిగత జీవితం మార్చు

విద్యారావుకు ఎహసాన్ హైదరీతో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె, అదితిరావు హైదరీ బాలీవుడ్ సినిమాలలో నటిస్తోంది.

మూలాలు మార్చు

  1. Kuldeep Kumar. "On a delicate note". The Hindu. Retrieved 8 January 2022.[permanent dead link]
  2. Kumar, Kuldeep (8 December 2011). "Glimpses of Naina". The Hindu. Retrieved 8 January 2022.
  3. Kumar, Kuldeep (8 December 2011). "Glimpses of Naina". The Hindu. Retrieved 8 January 2022.
  4. Jyoti Nair Belliappa. "Cascade of thumris". The Hindu.
  5. "Aditi Rao shines as Delhi 6 sinks - Bollywood Movies - Zimbio". 4 November 2009. Archived from the original on 4 November 2009.