వేదాస్ వెంకయ్య (జ. 1941 మార్చి 2) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ సభ్యుడు.[1] 2004 నుండి 2009 వరకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున సూర్యాపేట శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడిగా పనిచేశాడు.[2]

వేదాస్ వెంకయ్య
మాజీ శాసనసభ సభ్యుడు
నియోజకవర్గంసూర్యాపేట
(2004-2009)
వ్యక్తిగత వివరాలు
జననం (1941-03-02) 1941 మార్చి 2 (వయసు 83)
కుడకుడ, సూర్యాపేట జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
సంతానంఇద్దరు కుమారులు
నివాసంకుడకుడ, సూర్యాపేట

జననం, విద్య

మార్చు

వెంకయ్య 1941 మార్చి 2న సూర్యాపేట జిల్లాలోని కుడకుడ గ్రామంలో జన్మించాడు. వెంకయ్య తండ్రి పేరు రామయ్య. వెంకయ్య హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1967-70 మధ్యకాలంలో ఎం.ఏ., ఎల్.ఎల్.బి. పూర్తిచేశాడు.[3]

ఉద్యోగం

మార్చు

షెడ్యూల్డ్ కులానికి చెందిన వెంకయ్య, కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశాడు.[4][5]

రాజకీయ జీవితం

మార్చు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున సూర్యాపేట శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రజనీకుమారిపై 11,518 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందాడు.

మూలాలు

మార్చు
  1. "Profile of Vedas Venkaiah of Suryapet Constituency – hello ap". www.helloap.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2013-01-29. Archived from the original on 2014-05-08. Retrieved 2021-10-26.
  2. "State Elections 2004" Election Commission of India
    "Profile of Vedas Venkaiah - Suryapet" hello ap.2013-01-29.
  3. "Election Commission of India"
  4. "Election Commission of India"
  5. "List of MLAs 2004" Archived 2013-08-04 at the Wayback Machine aplegislature.org