వేదిక:తెలుగు సినిమా/ఈ వారం బొమ్మ/2015-48వ వారం
తాతినేని ప్రకాశరావు సుప్రసిద్ధ తెలుగు, తమిళ మరియు హిందీ సినిమా దర్శకులు. వీరు కృష్ణా జిల్లా కపిలేశ్వరపురంలో జన్మించారు. సినిమా రంగంలో యల్.వి.ప్రసాద్ షావుకారు సినిమాకు మరియు కె.వి.రెడ్డి గారి వద్ద పాతాళ భైరవి సినిమాకు అసిస్టెంటుగా పనిచేశారు. తర్వాత పరివర్తన, పల్లెటూరు, జయం మనదేరా మొదలైన ఎన్నో తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, యం.జి.ఆర్. మొదలైన అగ్రనటులతో ఎన్నో తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించారు. హిందీలో దాదాపు పెద్ద నటులందరితోనూ 25 పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. మొత్తంగా సుమారు 60 పైగా దర్శకత్వం వహించినవాటిలో కొన్ని చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. వీరు తాష్కెంట్ చలన చిత్రోత్సవంలోను, ఉజ్ బెకిస్థాన్ లోను రెండు సార్లు డెలిగేషన్ లో పాల్గొన్నారు. కొత్త తరం దర్శకులుగా, తెలుగు చిత్రసీమకు చక్కని చిత్రాలు అందించగల టేలెంటెడ్ డైరక్టర్లలో ఒకరిగా గా 50వ దశకంలో తాతినేని ప్రకాశరావును పరిగణించేవారు. వీరు దర్శకత్వం వహించిన చిత్రాలలో కొన్ని సినిమాలుమార్చు
చిత్ర సౌజన్యం: దోనెపర్తి ప్రణీత్
|