వేదిక:తెలుగు సినిమా/ఈ వారం బొమ్మ/2015-49వ వారం

పున్నగై అరసి కే ఆర్ విజయ

కె.ఆర్.విజయ దక్షిణభారత సినీనటి. పున్నాగై అరసి (పున్నాగ పూల వంటి నవ్వులు కలది) అని బిరుదునందుకున్న విజయ నాలుగు దశాబ్దాలపాటు సినీరంగములో పనిచేసినది. కేరళలో పుట్టిన విజయ తల్లి అదే రాష్ట్రానికి చెందినది కాగా, తండ్రి ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవాడు. ఈమె బాల్యం చాలామటుకు తమిళనాడులోని పళనిలో గడిచినది. ఈమె తండ్రి ఎం.ఆర్.రాధా డ్రామా కంపెనీలో పనిచేస్తూ సినిమాలలో నటించి పేరుతెచ్చుకోవాలని కలలుకన్నాడు.

విజయ బాల్యం నుండి రంగస్థలంపై నాట్య ప్రదర్శనలు చేసేది. ఈ కార్యక్రమాలను టీ.వీలో ప్రసారం చేసేవారు. అలాంటి మద్రాసులో జరిగిన ఒక టీ.వీ కార్యక్రమాన్ని చూసిన నటుడు జెమినీ గణేశన్ ఆమె నటనకు ముగ్ధుడై సినీ తార అయ్యేందుకు మంచి అవకాశాలున్నాయని ప్రోత్సహించాడు. విజయ కె.ఎస్.గోపాలకృష్ణన్ దర్శకత్వం వహించిన కర్పగం సినిమాతో రంగప్రవేశం చేసింది. ఈ సినిమాలో కథానాయకుడు జెమినీయే.

విజయ నటించిన చిత్రాలలో మచ్చుకు కొన్ని

సినిమాలు మార్చు

చిత్ర సౌజన్యం: శశి