కాస్కో

జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో 2009లో విడుదలైన తెలుగు చలనచిత్రం

కాస్కో 2009, డిసెంబరు 24న విడుదలైన తెలుగు చలనచిత్రం. కె. ఫిల్మ్స్ పతాకంపై ఎ. కోదండరామిరెడ్డి, ఎ. భారతి, సునీల్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వైభవ్ రెడ్డి, శ్వేతా బసు ప్రసాద్, ఆలీ, బ్రహ్మానందం, రఘుబాబు, చలపతిరావు, ఎమ్.ఎస్.నారాయణ, శ్రీనివాస రెడ్డి నటించగా, ప్రేమ్‌జీ అమరెన్ సంగీతం అందించాడు.

కాస్కో
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం జి. నాగేశ్వరరెడ్డి
నిర్మాణం ఎ. కోదండరామిరెడ్డి, ఎ. భారతి, సునీల్ రెడ్డి
చిత్రానువాదం సీపన శ్రీధర్
తారాగణం వైభవ్ రెడ్డి, శ్వేతా బసు ప్రసాద్, ఆలీ, బ్రహ్మానందం, రఘుబాబు, చలపతిరావు, ఎమ్.ఎస్.నారాయణ, శ్రీనివాస రెడ్డి
సంగీతం ప్రేమ్‌జీ అమరెన్
ఛాయాగ్రహణం అగిలన్
కూర్పు కె.ఎల్. ప్రవీణ్, ఎన్.బి. శ్రీకాంత్
నిర్మాణ సంస్థ కె. ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటవర్గం సవరించు

సాంకేతికవర్గం సవరించు

నిర్మాణం సవరించు

గొడవ సినిమా తరువాత వైభవ్ రెడ్డితో ఎ.కోదండరామిరెడ్డి నిర్మించిన రెండవ సినిమా ఇది. ఈ సినిమాకి శ్వేతా బసు ప్రసాద్, బ్రాహ్మానందం సంతకం చేశారు. వైభవ్ రెడ్డి చిన్ననాటి స్నేహితుడు, అతనితో సరోజా సినిమాలో నటించిన తమిళ సంగీత దర్శకుడు ప్రేమ్‌జీ అమరెన్ ఈ చిత్రానికి సంతకం చేశాడు. ఈ సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టాడు. 2009 జనవరిలో నిర్మాణ బృందం ఈ సినిమా హైదరాబాదులోని భెల్ టౌన్షిప్ లో చిత్రీకరించింది. హీరోయిన్ కిడ్నాప్ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి కోదండరామి రెడ్డి హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్నారు.[1]

పాటలు సవరించు

ఈ చిత్రానికి ప్రేమ్‌జీ అమరెన్ సంగీతం అందించాడు. 2009, నవంబరు 18 ఆడియో ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి పరుచూరి గోపాలకృష్ణ, వి. వి. వినాయక్, బి. గోపాల్, ఎన్.శంకర్ అతిథులుగా వచ్చారు.[2]

పాట పేరు గాయకులు నిడివి
"నచ్చావే" సైంధవి, ఎస్పీబీ చరణ్ 4:40
"విజిల్ కొట్టు" దేవి శ్రీ ప్రసాద్, సుర్ముఖి రామన్ 4:30
"ధీరా గంబీరా" రంజిత్, సువి 5:21
"తెలుసా తెలుసా" సుచిత్ర, ప్రేమ్‌జీ అమరన్ 4:50
"కృష్ణ వేణి" సుజాత మోహన్, నవీన్ మాధవ్ 5:08

విడుదల సవరించు

ఈ చిత్రం డిసెంబరు 4న విడుదల కావాల్సి ఉంది,[2] కానీ వాయిదా పడింది. ఫుల్ హైదరాబాద్ ఈ చిత్రానికి ప్రతికూల సమీక్ష ఇచ్చింది.[3]

మూలాలు సవరించు

  1. "Vaibhav Shweta Basu Prasad film press meet – Telugu cinema". www.idlebrain.com.
  2. 2.0 2.1 "Kasko music launch – Telugu cinema – Vaibhav & Shweta Basu Prasad". www.idlebrain.com.
  3. "Kasko review: Kasko (Telugu) Movie Review – fullhyd.com".

ఇతర లంకెలు సవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కాస్కో&oldid=3903778" నుండి వెలికితీశారు