వైశాఖమాసము
హిందూ మాసములలో ఒక మాసము
(వైశాఖం నుండి దారిమార్పు చెందింది)
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
వైశాఖ మాసము (సంస్కృతం: बैसाख) తెలుగు సంవత్సరంలో రెండవ నెల. పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రము (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఆ నెల వైశాఖము. దానాలు ఇవ్వడానికి వైశాఖ మాసాన్ని ప్రశస్తమైన మాసంగా పురాణాలలో చెప్పడం జరిగింది.
విశేషాలు
మార్చు- నమ్మాళ్వార్ లేదా శఠకోపముని వైశాఖ మాసంలోనే జన్మించారు.
- ఈ నెలలో తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి.
- జలియన్ వాలాబాగ్ దురంతం అమృత్సర్ పట్టణంలో పంజాబీలకు పవిత్రమైన ఈ నెల ( 1913 ఏప్రిల్ 13) తేదీన బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
- సా.శ. 1900 : శార్వరి నామ సంవత్సరంలో తిరుపతి వేంకట కవులు బొబ్బిలివద్దనుండు పాలతేరు గ్రామంలోను, గజపతినగరములోను, విశాఖపట్టణంలో యవధానములు జరిపారు.[1]
పండుగలు
మార్చుమూలాలు
మార్చు- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 74. Retrieved 27 June 2016.[permanent dead link]