వైశాఖమాసము

హిందూ మాసములలో ఒక మాసము
(వైశాఖ మాసము నుండి దారిమార్పు చెందింది)
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు



వైశాఖ మాసము (సంస్కృతం: बैसाख) తెలుగు సంవత్సరంలో రెండవ నెల. పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రము (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఆ నెల వైశాఖము. దానాలు ఇవ్వడానికి వైశాఖ మాసాన్ని ప్రశస్తమైన మాసంగా పురాణాలలో చెప్పడం జరిగింది.

విశేషాలు

మార్చు

పండుగలు

మార్చు
వైశాఖ శుద్ధ పాడ్యమి వైశాఖ స్నాన వ్రతము ప్రారంభం
వైశాఖ శుద్ధ విదియ
వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ, బలరామ జయంతి సింహాచలం చందనోత్సవం పద్మకల్పం ప్రారంభం. త్రేతాయుగాది
వైశాఖ శుద్ధ చతుర్థి
వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతి

రామానుజాచార్య జయంతి

వైశాఖ శుద్ధ షష్ఠి
వైశాఖ శుద్ధ సప్తమి గంగాసప్తమి చీరాల పట్టణ నిర్మాణం
వైశాఖ శుద్ధ అష్ఠమి దేవీపూజ
వైశాఖ శుద్ధ నవమి ద్వాపరయుగాంతము వృషభసంక్రమణ పుణ్యకాలం
వైశాఖ శుద్ధ దశమి శ్రీ బ్రహ్మంగారి ఆరాధన
వైశాఖ శుద్ధ ఏకాదశి మోహినీ ఏకాదశి అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవం
వైశాఖ శుద్ధ ద్వాదశి పరశురామ జయంతి
వైశాఖ శుద్ధ త్రయోదశి
వైశాఖ శుద్ధ చతుర్దశి నృసింహ జయంతి
వైశాఖ శుద్ధ పూర్ణిమ మహావైశాఖి బుద్దావతార జయంతి అన్నమయ్య జయంతి
వైశాఖ బహుళ పాడ్యమి భూతమాతృత్సం
వైశాఖ బహుళ విదియ నారదజయంతి
వైశాఖ బహుళ తదియ
వైశాఖ బహుళ చతుర్థి
వైశాఖ బహుళ పంచమి
వైశాఖ బహుళ షష్ఠి
వైశాఖ బహుళ సప్తమి
వైశాఖ బహుళ అష్టమి
వైశాఖ బహుళ నవమి దత్తాత్రేయుడు రామ, కృష్ణాది అవతారాలకంటే ముందే ఒకానొక వైశాఖ బహుళ దశమీ గురువారంనాడు, రేవతీ నక్షత్రమున అవతరించారని పురాణాలు చెబుతున్నాయి .
వైశాఖ బహుళ ఏకాదశి అపర ఏకాదశి
వైశాఖ బహుళ ద్వాదశి
వైశాఖ బహుళ త్రయోదశి
వైశాఖ బహుళ చతుర్దశి సవిత్రివ్రతము మాసశివరాత్రి
వైశాఖ బహుళ అమావాస్య వృషభసంక్రాంతి

మూలాలు

మార్చు
  1. తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 74. Retrieved 27 June 2016.[permanent dead link]