ప్రధాన మెనూను తెరువు

శాతవాహన ఎక్స్‌ప్రెస్ విజయవాడ, సికింద్రాబాద్ ల మధ్య నడిచే సూపర్ఫాస్ట్ రైలుబండి. ఈ బండి 351 kilometres (218 mi) లను 5 గంటల 35 నిమిషాలలో పూరిస్తుంది. ఈ రైలు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం మరియు మధిరల మీదుగా సికింద్రాబద్ నుండి విజయవాడకు వెళుతుంది. దక్షిణ మధ్య రైల్వే వారు నడిపే రైళ్ళలో ఇది అత్యంత వేగవంతమయినది. గంటకు దాదాపు 134 కిమీ ల వేగంతో మధిర, ఖమ్మం మధ్య నడుస్తుంది. విజయవాడ నుండి పొద్దున్నే మొదలయ్యే రైళ్ళలో ఇదొకటి.[1]

శాతవాహన ఎక్స్‌ప్రెస్
12714 Sathavahana Express Name Board (Vijayawada - Secunderbad).jpg
12713 (BZA-SC) Sathavahana Express at Ghatkesar.jpg
ఘట్కేసర్ వద్ద సికింద్రాబాదుకు వెళుతున్న శాతవాహన ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంసూపర్ ఫాస్ట్
స్థానికతఆంధ్ర ప్రదేశ్
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వే
మార్గం
మొదలువిజయవాడ జంక్షన్
గమ్యంసికింద్రాబాద్ జంక్షన్
ప్రయాణ దూరం351 km (218 mi)
సగటు ప్రయాణ సమయం5 గంటల 35 నిమిషాలు ఇరు మార్గాల్లో
రైలు నడిచే విధంప్రతిరోజూ
రైలు సంఖ్య(లు)12713 / 12714
సదుపాయాలు
శ్రేణులుఏసీ చెయిర్ కార్, రెండో తరగతి కుర్చీ, వంటచేయు పెట్టె, అనారక్షిత పెట్టెలు
కూర్చునేందుకు సదుపాయాలుఔను
పడుకునేందుకు సదుపాయాలుకాదు
సాంకేతికత
పట్టాల గేజ్1,676 మిమీ (5 అడుగులు 6 అం)
వేగం62.87 km/h (39.07 mph) average with halts
మార్గపటం
Sathavahana Express (BZA-SC) Route map.jpg
శాతవాహన ఎక్స్‌ప్రెస్ యొక్క పాంట్రీ కార్

రైలు బండి సంఖ్యలుసవరించు

నామకరణంసవరించు

ఈ రైలుకు శాతవాహన అని శాతవాహన సామ్రాజ్య గౌరవార్ధం నామకరణం చేశారు. శాతవాహనులు కోస్తాంధ్ర, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, మధ్యప్రదేశ్, విదర్భ, కర్నాటక, మరియు గోవాలోని కొన్ని ప్రాంతాలను పాలించారు.

సమయప్పట్టీసవరించు

శాతవాహన ఎక్స్‌ప్రెస్ విజయవాడ జంక్షన్ వద్ద ఉదయం 6:10 కు బయలుదేరుతుంది, సికింద్రాబద్కి 11:45 కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ జంక్షన్ వద్ద సాయంత్రం 4:15 కి బయలుదేరి విజయవాడకు రాత్రి 9:50 కి చేరుతుంది. సగటున 25 నిమిషాల ఆల్స్యంగా సికింద్రాబాద్ కు, 20 నిమిషాల ఆలస్యంతో విజయవాడకు చేరుతుంది.

శాతవాహన ఎక్స్‌ప్రెస్ సమయప్పట్టీ
స్టేషను కోడ్ స్టేషను పేరు 12713 నిలుపుదల దూరం
విజయవాడ నుండి
12714 నిలుపుదల దూరం
సికింద్రాబాదు నుండి
చేరే సమయం బయలుదేరే సమయం చేరే సమయం బయలుదేరే సమయం
BZA విజయవాడ జంక్షన్ మొదలు 06:10 0 21:50 గమ్యం 351
MDR మధిర 06:57 06:58 1 నిమిషం 57 20:23 20:24 1 నిమిషం 294
KMT ఖమ్మం 07:18 07:20 2 నిమిషాలు 102 19:53 19:55 2 నిమిషాలు 209
DKJ డోర్నకల్ జంక్షన్ 07:49 07:50 1 నిమిషం 125 19:36 19:37 1 నిమిషం 227
MABD మహబూబాబాద్ 08:09 08:10 1 నిమిషం 149 19:04 19:05 1 నిమిషం 203
KDM కేసముద్రం 1నిమిషం
WL వరంగల్ 09:00 09:02 2 నిమిషాలు 209 18:20 18:22 2 నిమిషాలు 142
KZJ కాజీపేట జంక్షన్ 09:20 09:22 2 నిమిషాలు 219 18:05 18:07 2 నిమిషాలు 132
SC సికింద్రాబాద్ జంక్షన్ 11:45 గమ్యం 351 మొదలు 16:15 0

గమ్యస్థానములుసవరించు

ఈ రైలు ఖాజీపేట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, ఖమ్మం మరియు మధిర అనే ప్రదేశాలలో ఆగుతూ చివరికి విజయవాడ చేరుతుంది. ఈ రైలు (రైలు సం.12713) దక్షిణ మధ్య రైల్వే జోన్ లో అతి వేగంగా ప్రయాణించే రైళ్ళలో ఒకటి. ఈ రైలు మధిక మరియు ఖమ్మం ల మధ్య 134 కి.మీ/గంట వడితో ప్రయాణిస్తుంది. విజయవాడకు నుండి బయలుదేరే ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ లలో ఇది ఒకటి. విజయవాడ నుండి ఉదయం బయలుదేరే యితర రైళ్ళు పినాకిని ఎక్స్‌ప్రెస్ మరియు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్.

కోచ్ల కూర్పుసవరించు

ఈ రైలులో మొత్తం 20 బోగీలు ఉంటాయి. ఈ రైలును లాలాగూడా షెడ్ కు చెందిన WAP-7 ఇంజన్ లాగుతుంది.

12713 
విజయవాడ నుండి సికింద్రాబాదుకు వెళ్ళే రైలు [2]
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇంజను
SLR యు.ఆర్ యు.ఆర్ యు.ఆర్ యు.ఆర్ యు.ఆర్ యు.ఆర్ సి1 డి1 డి2 డి3 డి4 PC డి5 యు.ఆర్ యు.ఆర్ యు.ఆర్ యు.ఆర్ యు.ఆర్ SLR  

వివిధ సంఘటనలుసవరించు

  • 2013 నవంబరు 7 : విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న శాతవాహన ఎక్స్ ప్రెస్ లో గురువారం ఉదయం సాంకేతికలోపం ఏర్పడింది. దాంతో ఖమ్మం జిల్లాలోని మొటుపర్రు వద్ద ఆ ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. దీంతో విజయవాడ - వరంగల్ మధ్య పలు రైళ్లు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శాతవాహన ఎక్స్ ప్రెస్ లోని ప్రయాణికులే కాకుండా పలు రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.[3]
  • 2015 ఆగస్టు 26 : మెయిన్‌లైన్‌లో గూడ్సురైలు ఉండడంతో శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను లూప్‌లైన్‌లో వదిలారు. అయితే లూప్‌లైన్ పట్టాలు బలహీనంగా ఉండడంతో రైలు మామూలు పట్టాలపై వెళ్లినట్లు వేగంగా వెళ్లడంతో బోగీలన్నీ ఒక్కసారిగా ఊగిపోయాయి. దాంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురై కేకలు వేస్తూ చైన్ లాగి రైలును ఆపేశారు. ఈ సంఘటన మహబూబాబాద్- డోర్నకల్ మార్గంలో గుండ్రాజుమడుగు రైల్వేస్టేషన్ వద్ద 2015 ఆగస్టు 26 రాత్రి జరిగింది.[4]

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "Satavahana passengers spend tense moments". The Hindu (ఆంగ్లం లో). 2012-02-02. ISSN 0971-751X. Retrieved 2016-05-15.
  2. 12713/Satavahana SF Express
  3. సాంకేతిక లోపంతో నిలిచిన 'శాతవాహన ఎక్స్ ప్రెస్ ' Sakshi | Updated: November 07, 2013
  4. శాతవాహన ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం Sakshi | August 26, 2015

బయటి లింకులుసవరించు