శేషు

జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో 2002లో విడుదలైన తెలుగు చలనచిత్రం

శేషు 2002, ఫిబ్రవరి 28న విడుదలైన తెలుగు చలనచిత్రం. జీవిత తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజశేఖర్, కళ్యాణి నాయికానాయకులుగా నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. యువన్ శంకర్ రాజాకు తెలుగులో మొదటి చిత్రం ఇది. 1999లో తమిళ దర్శకుడు బాల దర్శకత్వంలో విక్రమ్ నటించిన సేతు చిత్రం, ఈ చిత్రానికి మాతృక.

శేషు
Seshu (2002) Poster Design.jpg
శేషు చిత్ర గోడపత్రిక
దర్శకత్వంజీవిత
రచనబాల (దర్శకుడు)
నిర్మాతబేబి శివాని
తారాగణంరాజశేఖర్, కళ్యాణి
ఛాయాగ్రహణంహరి అనుమోలు
కూర్పుగౌతంరాజు
సంగీతంయువన్ శంకర్ రాజా
ఇళయరాజా
నిర్మాణ
సంస్థ
శివ శివాని మూవీస్
విడుదల తేదీ
2002 ఫిబ్రవరి 28 (2002-02-28)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన తొలి తెలుగు చిత్రం శేషు. దీనికి తమిళ మాతృక అయిన సేతు సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. శేషు సినిమలో 8 పాటలుండగా, అందులోని 4 పాటల బాణీలను సేతు సినిమా నుండి తీసుకున్నారు. ఈ సినిమా పాటలల్లో గాయనిమణి గాత్రం కూడా లేదు. ఇందులోని పాటలను చంద్రబోస్, శ్రీహర్ష రాశారు.

పాటల జాబితా
సం.పాటసంగీతంగాయకులుపాట నిడివి
1."ఏదిదారి బాటసారి"ఇళయరాజాఎస్.పి. బాలు05:07
2."ఆకాశం కిందుంది"యువన్ శంకర్ రాజాటిప్పు, యువన్ శంకర్ రాజా, శ్రీనివాస్05:13
3."సాయంత్రం చేరువయ్యిందో"యువన్ శంకర్ రాజాశంకర్ మహదేవన్04:06
4."మన శేషు అన్న"ఇళయరాజాఎస్.పి. బాలు02:27
5."చీయా చీయా"యువన్ శంకర్ రాజాదేవన్ ఏకాంబరం05:12
6."గూడు విడిచిన"ఇళయరాజాఎస్.పి. బాలు03:01
7."మెరిసి మెరిసి"ఇళయరాజాఉన్నికృష్ణన్00:47
8."థీమ్ మ్యాజిక్"ఇళయరాజావాయిద్యం05:13
Total length:34:03

మూలాలుసవరించు

ఇతర లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=శేషు&oldid=3846723" నుండి వెలికితీశారు