శ్రీరామాంజనేయ యుద్ధం (1958)
శ్రీరామాంజనేయ యుద్ధం కాశీనాథ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 1959, మే 9న విడుదలైన తెలుగు పౌరాణిక సినిమా. కాశీనాద్ ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకత్వం ఎన్. ఎన్. ఎ ఆచార్య . ఈ చిత్రంలో అమర్ నాథ్ , శ్రీరంజని,మీనాకుమారి ముఖ్య తారాగణం.సంగీతం జంధ్యాల సమకూర్చారు .
శ్రీరామాంజనేయ యుద్ధం (1958) (1958 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎన్.ఎన్.ఎ.ఆచార్య |
---|---|
తారాగణం | అమర్‌నాథ్, శ్రీరంజని, మీనాకుమారి |
సంగీతం | జంధ్యాల |
నిర్మాణ సంస్థ | కాశీనాథ్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- అమర్‌నాథ్ - శ్రీరాముడు
- శ్రీరంజని - సీత
- కె.వి.ఎస్.శర్మ - వశిష్టుడు
- ముక్కామల కృష్ణమూర్తి - విశ్వామిత్రుడు
- మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి - యయాతి
- ఎ.సూర్యనారాయణ - లక్ష్మణుడు
- పి.హేమలత - అంజనీదేవి
- రాజనాల - హనుమంతుడు
- సంధ్య - యయాతి భార్య శాంతిమతి
- పి.సూరిబాబు - అంగదుడు
- కాంతారావు - శివుడు
- కల్యాణం రఘురామయ్య - నారదుడు (?)
- మీనాకుమారి
- బేబి చంద్రకళ - యయాతి కుమార్తె
- మాస్టర్ కృష్ణభగవాన్ - యయాతి కుమారుడు
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: ఎన్.ఎన్.ఎ.ఆచార్య
- నిర్మాత: కె.సుబ్రహ్మణ్యం
- మాటలు: కొవ్వలి
- పాటలు: దైతాగోపాలం, తాండ్ర సుబ్రహ్మణ్యం, ఎస్.వి.యన్.ఆచార్య
- సంగీతం: జంధ్యాల
- శబ్దగ్రహణం: విశ్వనాథ్
- ఛాయాగ్రహణం: పి.ఎల్.రాయ్
పాటలు
మార్చుఈ చిత్రంలోని పాటలు, పద్యాల వివరాలు:[1]
- దేవదానవుల కేదేని వైరము నెంచ అవని (పద్యం) - కె.రఘురామయ్య
- శ్రీ రఘురామచంద్ర మది చింతనచేయతరంబే (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర
- అభయమిమ్మని బ్రతిమాలితమ్మ మిమ్ము (పద్యం) - కె. రఘురామయ్య
- అల మౌని యన్నంత (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర
- ఆరయ కాతుమం చభయహస్తము నిచ్చి (పద్యం) - పి.సూరిబాబు
- ఈపాద నీరజమేకదా జహ్నవి పుణ్య స్రవంతి (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర
- ఎందుకయ్యా ఈ అలుకా మాపై ఎందుకయ్యా - ఎ.పి.కోమల
- ఎరుగనీక యదార్ధంబు మరుగు పరచి (పద్యం) - సరోజిని
- ఏమే పార్వతి నీకు పల్కుటకు నోరేలేదా (పద్యం) - వైదేహి
- ఒకటే మాటయటన్న మాదేయని (పద్యం) - పి.బి.శ్రీనివాస్
- కనుగోనవే మానినీ శ్రీరాముని ఘనా ఘన శ్యాము - సరోజిని,వైదేహి
- కన్నుల్ మోడ్చిరి మందభాగ్యు లిపుడే కన్నీరు (పద్యం) - వైదేహి
- కమనీయంబగు నీదు నామ గుణము (పద్యం) - పి.సూరిబాబు
- కర్తవ్యంబును బోధ జేసితిరి (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర
- క్షేమంబే కదా ఆంజనేయునకు సుగ్రీవు (పద్యం) - పి.బి.శ్రీనివాస్
- చేరి యుంగరమిచ్చి సీతమ్మ ప్రాణముల్ కుదుట (పద్యం) - పి.సూరిబాబు
- జనక సుతా సీతామాతా వినవా నా మొర దేవి - ఏ.పి.కోమల
- జయ జయ రామ జగదభిరామా దయగను శ్రీరామా - కె.రఘురామయ్య
- జయ జయ సాంబశివా శంభో జయ జయ మహాదేవ - బృందం
- తప్పుడు రాము డిప్పటికి తా మునికిచ్చిన మాట (పద్యం) - కె.రఘురామయ్య
- నేనే శ్రీ రఘురామ భక్తుడన యేని (పద్యాలు) - ఘంటసాల,పి.బి.శ్రీనివాస్ - రచన: తాండ్ర
- ప్రళయంబే అగుగాక ఆ హరి హర బ్రహ్మాదులే అడ్డమై (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర
- బలవద్రాజ్యమదాతిరేకజని తాపస్మారమున్ (పద్యం) - మాధవపెద్ది
- భండనభీము డార్తజనబాంధవు డుజ్వలబాణ (పద్యం) - మల్లిక్
- మెరుగు బంగారమును మించు మేని కాంతి (పద్యం) - ఆర్.బాలసరస్వతి దేవి
- రఘుకులవారధి సోమా రామ దయగనుమా - మల్లిక్
- రవికుల భూషణ రామా పాహి రామేశా జయ లోకేశా - ఏ.పి.కోమల
- వినుమా రామ కధ రఘు రామ కధ శ్రీరామ కధ - ఎస్.జానకి, సుబ్బలక్ష్మి
- శ్రీ రాఘవం దశరధాత్మజ మప్రమేయం (శ్లోకం) -
- సీతమ్మ జాడ మీ చెవినేయమైతిమా (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర
- స్వామి తోడనా సంగ్రామమ్ దైవము పైన శరసంధానం - మల్లిక్
- నేనే శ్రీరఘువంశ సంభవుడా(పద్యం)_ఘంటసాల , పి.బి.శ్రీనివాస్_రచన: తాండ్ర సుబ్రహ్మణ్యం .
సంక్షిప్త కథ
మార్చుశక్తి, భక్తిలలో ఏది గొప్పదని శివపార్వతుల మధ్య వచ్చిన మీమాంసలో భక్తి గొప్పదని శివుడు చెప్పి దానికి తార్కాణంగా భూలోకంలో జరుగుతున్న ఒక సంఘటనను పార్వతికి చూపిస్తాడు.
యయాతి రాజు శ్రీరామభక్తుడు. ముందు వచ్చిన వశిష్టుని పాదపూజలో మునిగిపోయి కొంచెం వెనుక వచ్చిన విశ్వామిత్రుని రాకను గమనించడు. దానికి కుపితుడైన విశ్వామిత్రుడు తన్ను పరాభవించిన రాజును సంహరించగలనని రాముడితో వాగ్దానం పొందుతాడు. ఆ రాజు యయాతి అని విని రాముడు ఖేదం పొందుతాడు. యయాతిని బంధించి తీసుకురావడానికి వెళ్లిన లక్ష్మణుడి ద్వారా రాముడు విశ్వామిత్రునికి ఇచ్చిన వాగ్దానం గురించి తెలుసుకున్న యయాతి క్రుంగిపోతాడు. ఆ సమయంలో పెను తుఫాను చెలరేగుతుంది. ఆ తుఫానులో యయాతి, లక్ష్మణుడు విడిపోతారు. యయాతి అంజనీదేవి ఆశ్రమప్రాంతం చేరుకుంటాడు. ఆమె యయాతిని రక్షించవలసిందని తన కుమారుడు హనుమంతుడిని ఆదేశిస్తుంది. యయాతిని చంపబూనినది శ్రీరామచంద్రుడని తెలిసి అంజనీదేవి, హనుమంతుడు ఇరువురూ విచారిస్తారు. నారదుడు యయాతిని చంపడానికి రాముడు ప్రతిన బూనిన సంగతి, యయాతికి హనుమంతుడు అభయమిచ్చిన సంగతి అటు హనుమంతునితోను, ఇటు రామునితోను చెబుతాడు. రాముడు, హనుమంతుడు సందిగ్ధ స్థితిలో పడతారు. యయాతి భార్య శాంతిమతి అయోధ్య వెళ్ళి సీతను తనకు పతిభిక్ష వేడుతుంది. సీత రాముడిని బతిమాలుతుంది. కాని రాముడు ఆడిన మాటతప్పనని అంటాడు. అటు వానరులు అంగదుని రాముడి వద్దకు రాయబారం పంపుతారు. అది విఫలం కావడంతో రామ ఆంజనేయుల యుద్ధం తప్పనిసరి అవుతుంది. రామాస్త్ర ప్రభావాన్ని హనుమంతుడు రామనామస్మరణంతోనే ప్రతిఘటిస్తాడు. ప్రళయోదగ్రమైన పరిస్థితి ఉత్పన్నమై లోకాలు తల్లడిల్లడంతో శివుడు పార్వతితో వచ్చి శ్రీరామ హనుమంతుల మధ్య పోరును నిలుపుతాడు[2].
విశేషాలు
మార్చు- ఈ చిత్ర నిర్మాత కుమార్తె చంద్రకళ ఈ సినిమాలో యయాతి కూతురుగా నటించింది. తర్వాతి కాలంలో ఈమె నటిగా అనేక సినిమాలలో నటించింది.
- ఇదే కథను కొద్ది మార్పులతో 1963లో రాజ్‌కుమార్, ఉదయ్‌కుమార్, జయంతి ప్రధాన పాత్రధారులుగా కన్నడ భాషలో శ్రీరామాంజనేయ యుద్ధ పేరుతో నిర్మించారు. ఆ చిత్రం ద్వారా చెళ్ళపిళ్ళ సత్యం సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు.
- 1963లో వచ్చిన కన్నడ సినిమాను 1974లో బాపు దర్శకత్వంలో ఎన్.టి.రామారావు, బి.సరోజాదేవి జంటగా తెలుగులో పునర్మించారు.
మూలాలు
మార్చు- ↑ కల్లూరు భాస్కరరావు. "శ్రీరామాంజనేయ యుద్ధం - 1958". ఘంటసాల గళామృతము. కల్లూరు భాస్కరరావు. Archived from the original on 27 జనవరి 2020. Retrieved 2 April 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ సమీక్షకుడు (28 May 1958). "చిత్ర సమీక్ష - శ్రీరామాంజనేయ యుద్ధం". ఆంధ్రప్రభ దినపత్రిక. Retrieved 2 April 2020.[permanent dead link]