శ్రీ మంజునాథ
శ్రీ మంజునాథ 2001 లో తెలుగు, కన్నడ భాషలలో నిర్మించిన ఆధ్యాత్మిక చిత్రం.[1] ఇది కర్ణాటక రాష్ట్రంలో ధర్మస్థల లోని శ్రీ మంజునాథేశ్వరుని మీద ఆధారపడినది. ఇందులో చిరంజీవి శివునిగా,[2] అర్జున్ శివభక్తుడు మంజునాధుడిగా నటించగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. కథ, మాటలు జె. కె. భారవి రాశాడు.
శ్రీ మంజునాథ (2001 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
---|---|
నిర్మాణం | నారా జయశ్రీదేవి |
కథ | జె.కె. భారవి |
తారాగణం | చిరంజీవి, అర్జున్, సౌందర్య, మీనా |
సంగీతం | హంసలేఖ |
నేపథ్య గానం | రమేష్ చంద్ర, కె.ఎస్.చిత్ర, హేమంత్ కుమార్, శంకర్ మహదేవన్, నందిత, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ |
సంభాషణలు | జె.కె. భారవి |
ఛాయాగ్రహణం | సుందరనాథ సువర్ణ |
కూర్పు | జనార్థన్ |
నిర్మాణ సంస్థ | చిన్ని ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
మార్చు- శివుడు గా చిరంజీవి
- పార్వతి గా మీనా
- మంజునాథుడు గా అర్జున్
- సౌందర్య
- అంబరీష్
- సుమలత
- నందిగా బ్రహ్మానందం
- భృంగిగా తనికెళ్ళ భరణి
- యమున
- ఆనంద వర్ధన్
- సుధారాణి
- ఆర్.ఎన్. సుదర్శన్
పాటలు
మార్చు- ఓం అక్షరాయ నమః (గానం: హేమంత్ కుమార్)
- ఓహో గరళ కంఠ.... నీ మాటంటే ఒళ్ళుమంట (గానం: బాలు)
- శ్రీ మంజునాథుని చరితం... మధురం... మధురం...
- ఒక్కడే... ఒక్కడే... మంజునాథుడొక్కడే...(గానం: బాలు)
- ఓం... మహాప్రాణ దీపం ... శివం... శివం (రచన: వేదవ్యాస రంగభట్టర్ గానం: శంకర్ మహదేవన్)
- ఓహో తిప్పిరి.. తళుకు బెళుకు...
- స్వాగతమయ్యా ఓ యమరాజా (గానం: బాలు)
మూలాలు
మార్చు- ↑ "Happy Birthday Arjun Sarja: These Four Films Prove That The 'Action King' Is One Fine Actor!". filmibeat.com (in ఇంగ్లీష్). 2018-08-15. Retrieved 2021-02-11.
- ↑ "Chiranjeevi:శ్రీ మంజునాథ కంటే ముందు చిరంజీవి పౌరాణిక పాత్ర వేసిన సినిమా ఏమిటో తెలుసా." News18 Telugu. Retrieved 2021-02-11.