శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం
శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం (ఎస్వీవీయు), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా తిరుపతిలో ఉన్న రాష్ట్ర విశ్వవిద్యాలయం. పశువైద్య అధ్యయనాలు జరపడంకోసం 2005లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విశ్వ విద్యాలయంను స్థాపించింది.
పూర్వపు నామము | కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ |
---|---|
రకం | ప్రజా |
స్థాపితం | 2005 |
ఛాన్సలర్ | ఆంధ్రప్రదేశ్ గవర్నర్ |
వైస్ ఛాన్సలర్ | వెలుగోటి పద్మనాభ రెడ్డి |
స్థానం | తిరుపతి, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
అనుబంధాలు | యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ |
చరిత్ర
మార్చు1955లో బాపట్లలో కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ స్థాపనతో శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. 1957లో దీనిని తిరుపతికి మార్చారు.
2004, సెప్టెంబరులో జరిగిన కళాశాల స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విశ్వవిద్యాలయ స్థాపనపై ప్రకటన చేశారు. శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ చట్టం 2005,[1] 2005, మార్చి 30న ఆమోదించబడింది. 2005, జూలై 15న కళాశాల ప్రాంగణంలో అప్పటి ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి అధికారికంగా ప్రారంభించాడు. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి వెటర్నరీ సైన్స్ అధ్యాపకుల కార్యకలాపాలను విశ్వవిద్యాలయం తన ఆధీనంలోకి తీసుకుంది.[2]
ఉప కులపతి
మార్చువిశ్వవిద్యాలయం మాజీ వైస్-ఛాన్సలర్లు (విసిలు):[2]
- ప్రియదర్శి దాష్: 5 ఆగస్టు 2005 (స్పెషల్ ఆఫీసర్)
- మన్మోహన్ సింగ్: 25 మే 2006 స్పెషల్ ఆఫీసర్‌గా, 15 సెప్టెంబరు 2006 విసిగా, 12 నవంబరు 2007 విసి ఇన్‌చార్జిగా.
- డివిజి కృష్ణ మోహన్: 14 ఏప్రిల్ 2008
- ఎండి. హఫీజ్: 12 జనవరి 2010 (ఇన్‌ఛార్జి)
- వి. ప్రభాకర్ రావు: 27 అక్టోబరు 2010
- మన్మోహన్ సింగ్: 31 అక్టోబరు 2013
- వై. హరి బాబు: 17 ఏప్రిల్ 2017 [3]
- పూనం మలకొండయ్య: 17 ఏప్రిల్ 2017 (ఇన్‌ఛార్జి)
- వేలుగోటి పద్మనాభ రెడ్డి: 5 ఆగస్టు 2020 [4]
పూర్వ విద్యార్థులు
మార్చు- కన్నెబోయిన నాగరాజు, ప్రొఫెసర్, బింగ్‌హాంటన్ విశ్వవిద్యాలయం[5]
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Sri Venkateswara Veterinary University Act, 2005" (PDF). 28 April 2005. Retrieved 23 February 2021.
- ↑ 2.0 2.1 "History of Sri Venkateswara Veterinary University". Sri Veterinary Vedic University. Retrieved 13 October 2020.
- ↑ Naidu, T. Appala (15 June 2017). "Fisheries varsity to come up on AP coast". The Hindu. Retrieved 13 October 2020.
- ↑ Nethaji, K. (4 August 2020). "Tirupati: SV Veterinary University New VC Prof V Padmanabha Reddy". The Hans India.
- ↑ Pharmacy, Kanneboyina Nagaraju Professor; Founding Chair School of. "Kanneboyina Nagaraju - Faculty and Staff - School of Pharmacy and Pharmaceutical Sciences | Binghamton University". School of Pharmacy and Pharmaceutical Sciences - Binghamton University. Archived from the original on 2018-12-11. Retrieved 2018-12-10.
{{cite web}}
: CS1 maint: multiple names: authors list (link)