షామీర్‌పేట్ మండలం

తెలంగాణ, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా లోని మండలం
(షామీర్‌పేట్‌ నుండి దారిమార్పు చెందింది)

షామీర్‌పేట్‌ మండలం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లాలోని మండలం.[1]

షామీర్‌పేట్‌ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో మేడ్చల్ జిల్లా, షామీర్‌పేట్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో మేడ్చల్ జిల్లా, షామీర్‌పేట్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో మేడ్చల్ జిల్లా, షామీర్‌పేట్‌ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°35′30″N 78°34′56″E / 17.591667°N 78.58223°E / 17.591667; 78.58223
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మేడ్చల్ జిల్లా
మండల కేంద్రం షామీర్‌పేట్‌
గ్రామాలు 28
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 1,18,895
 - పురుషులు 61,438
 - స్త్రీలు 57,457
అక్షరాస్యత (2011)
 - మొత్తం 58.42%
 - పురుషులు 69.09%
 - స్త్రీలు 47.07%
పిన్‌కోడ్ 500078
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త రంగారెడ్డి జిల్లా పటంలో మండల స్థానం

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కీసర రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మల్కాజ్‌గిరి డివిజనులో ఉండేది.ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇటీవలి కాలంలో పలు అభివృద్ధి పనుల వలన మంచి పురోభివృద్ధి సాధించింది.సముద్రమట్టానికి 597 మీ.ఎత్తులో ఉంది.[3] ఈ మండలంలో  15  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

గణాంక వివరాలు మార్చు

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 237 చ.కి.మీ. కాగా, జనాభా 52,679. జనాభాలో పురుషులు 27,800 కాగా, స్త్రీల సంఖ్య 24,879. మండలంలో 11,981 గృహాలున్నాయి.[4]

మండలంలోని పట్టణాలు మార్చు

సమీప మండలాలు మార్చు

మేడ్చల్, కీసర, కుత్బుల్లాపూర్, ములుగు

మండలంలో పర్యాటక ప్రదేశాలు మార్చు

పెద్ద చెరువు మార్చు

 
షామీర్‌పేట్‌ చెరువు

శామీర్‌పేట సమీపంలోని చెరువు పెద్ద చెరువుగా పేరుగాంచింది. షామీర్‌పేట్‌ చెరువు అని పిలుస్తారు. దీనిని ఇది ఒక విహారస్థలంగా కూడా అభివృద్ధి చెందినది. సెలవు దినాలలో పరిసర ప్రాంతవాసులచే ఈ చెరువు పర్యాటక ప్రాంతంగా కనిపిస్తుంది. రాజీవ్ రహదారి ఈ చెరువు కట్టపై నుంచే వెళుతుంది. అంతేకాకుండా ఈ చెరువు పరిసరాలలో జవహర్ దుప్పుల పార్కు, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం కూడా ఉన్నాయి.

రత్నాలయ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం మార్చు

శామీర్‌పేటలో రాజీవ్ రహదారి ప్రక్కనే రత్నాలయం పేరుతో శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని నిర్మించారు. హైదరాబాదు, రంగారెడ్డి, నల్గొండ, మెదక్ జిల్లాల నుండి భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు. శనివారం రోజులలో భక్తులతో ఈ దేవాలయం కిటకిటలాడుతుంది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. http://www.onefivenine.com/india/villages/Rangareddi/Shamirpet/Shameerpet
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లింకులు మార్చు