సుభాని (కార్టూనిస్ట్)

(షేక్ సుభాని నుండి దారిమార్పు చెందింది)

సుభాని ప్రముఖ వ్యంగ చిత్రకారుడు. సుభాని పూర్తి పేరు షేక్ సుభాని. ఆగస్టు 11న 1961లో ప్రకాశం జిల్లా కారంచేడులో పుట్టాడు.

సుభాని
షేక్ సుభాని
జననం(1961-08-11)1961 ఆగస్టు 11
India కారంచేడు ఆంధ్రప్రదేశ్
నివాస ప్రాంతంహైదరాబాద్
వృత్తికార్టూన్ ఎడిటర్
ఉద్యోగంDeccan Chronicle
ప్రసిద్ధిప్రముఖ కార్టూనిస్ట్.
మతంముస్లిం
వెబ్‌సైటు
https://subhanicartoonist.com/

చిత్రకళపై ఆశక్తి మార్చు

1978లో ఇంటర్మీడియేట్ చదివే రోజుల్లో ఊల్లో ఉన్న లైబ్రరీకి ప్రతిరోజూ వెళ్లేవాడు. వార, మాసపత్రికల్లోని బాపు, జయదేవ్, సత్యమూర్తి గారి కార్టూన్లు వీరిని ఎంతగానో ఆకర్షించేవి. స్వతహాగా బొమ్మలు గీయటం ఇష్టపడే సుభాని పాఠశాల స్థాయిలో ఎన్నో బొమ్మలు గీసి స్కూల్ నోటీస్ బోర్డులో, క్లాస్ రూముల్లో అంటించేవాడు. క్లాస్ టీచర్స్, తోటి స్నేహితుల ప్రోత్సాహంతో కొన్ని కార్టూన్లు గీసి పత్రికలకు పంపాడు. ఊహించని విధంగా ఒకటి జ్యోతి మాసపత్రిక, మరొకటి ఆంధ్రభూమి దీపావళి ప్రత్యేక సంచికల్లో అచ్చయ్యింది. ఆ పత్రికల నుంచి కాంప్లిమెంటరీ కాపీలతో పాటు 15 రూపాయల రెమ్యూనరేషన్ వచ్చింది. అలా వీరి మొదటి కార్టూన్స్ ఇంటర్ మొదటి సంవత్సరంలో వున్నప్పుడు అచ్చయ్యింది. ఆ పత్రికల్లోని వీరి కార్టూన్స్ చూసి టీచర్స్ ఎంతో అభినందించారు సుభానిని. దానితో మరింత ఉత్సాహంతో ఇంటర్ నుండి పి.జి. వరకు హాబీగా కార్టూన్లు గీసేవాడు. ప్రతి నెల వివిధ పత్రికల్లో పది కార్టూన్ల వరకూ ప్రచురితం అయ్యేవి. వచ్చిన రెమ్యూనిరేషన్ పాకెట్ మనీగా, పుస్తకాలకు ఉపయోగించేవాడు. అప్పుడప్పుడూ పత్రికలవారు, అనేక ఆర్గనైజేషన్స్ నిర్వహించే కార్టూన్ పోటీలలో కూడా పాల్గొని ఏదో ఒక బహుమతి పొందేవాడు. అలా స్టూడెంట్ గా ఉన్న రోజుల్లో కార్టూన్స్ ద్వారా డబ్బు సంపాదించడంతో ఆత్మవిశ్వాసం కలిగింది వీరిలో.

కార్టూన్ ప్రస్థానం మార్చు

గ్రాడ్యుయేషన్ చీరాల కాలేజీలో జాయిన్ అయిన తర్వాత శ్రీధర్ (బాచి)తో పరిచయం అతని ద్వారా స్వర్ణ, కాటూరిగార్లతో పరిచయంతో అందరూ కలిసి చాలా కార్టూన్స్ గీశేవారు. 1981లో జరిగిన జ్యోతి (మాసపత్రిక) కార్టూన్ పోటీలలో ఒక సబ్జెక్ట్ మీద గీసిన సుభాని కార్టూనకు ప్రథమ బహుమతి రావటం, ఈ పోటీకి శ్రీ బాపుగారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, శ్రీరమణ గార్లు న్యాయనిర్ణేతలుగా ఉండటము, శంకుగారి క్రోక్విల్ అకాడెమీ, స్పోర్ట్స్ అధారిటీ పోటీలు నిర్వహించిన అన్ని విభాగాలలో బహుమతి రావటంతో వీరు కార్టూనిస్టుగా నిలదొక్కోడానికి సహాయపడ్డాయి. బహుమతి అందుకోవడానికి మొదటిసారి హైదరాబాద్ వెళ్ళాడు. బహుమతి ప్రదానోత్సవం తర్వాత అన్ని పత్రికల ఆఫీసులకు వెళ్లటం ఆయా ఎడిటర్లను కలవటం జరిగింది.

ఉద్యోగ జీవితం మార్చు

గుజరాత్ లో M.Sc. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి పోటీ పరీక్షలు రాద్దామని హైదరాబాద్ వెళ్ళాడు. చదువుకుంటూ శంకుగారి ‘హాస్యప్రియ’లో కార్టూన్స్ , తారా అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఇలస్ట్రేషన్స్ గీస్తుండేవాడు. జూనియర్ కాలజీలో లెక్చరర్ జాబ్ వదిలేసి, 1985 ఆంధ్రభూమి వీక్లీలో కార్టూనిస్టు, ఇలస్ట్రేటర్ గా ఉద్యోగంలో చేరాడు. దాదాపు అప్పుడు పేరున్న అందరు రచయితల కథలకు, సీరియల్స్ ఇలస్ట్రేషన్స్ గీశాడు. వారానికి ఒక రాజకీయ కార్టూన్ ఆంధ్రభూమి వీక్లీ రెండవ పేజీలో రావటం రాజకీయ కార్టూనిస్ట్ గా మారటానికి దోహదపడింది. ఆ సమయంలో ఆంధ్రభూమి వీక్లీలో 5,000 పైనే ఇలస్ట్రేషన్స్ గీశారు. ఉత్తమ్, కళాభాస్కర్, సుభాని గీసిన వాష్ టెక్నిక్ ఇలస్ట్రేషన్స్ చాలా పాపులర్ అయ్యాయి ఆరోజుల్లో. ఈ అనుభవమే వీరికి తర్వాతి కాలంలో పొలిటికల్ కార్టూన్స్ ఎక్కువ డిటేల్స్ గా గీయటానికి దోహదపడింది.

తర్వాత 1988 నుండి 1990 వరకు ఆంధ్రభూమి దినపత్రికకు పొలిటికల్ కార్టూనిస్ట్ గా పనిచేశారు. 1990 నుండి ప్రస్తుతం (2021) దక్కన్ క్రానికల్ గ్రూప్ లో కార్టూన్ ఎడిటర్ గా పనిచేస్తున్నాడు. కార్టూన్ ఎడిటర్ డిజిగ్నేషన్ పొందిన మొట్టమొదటి ఇండియన్ కార్టూనిస్ట్ సుభానిగారే కావడం విశేషం. దక్కన్ క్రానికల్ దక్షిణాది రాష్ట్రాలలో ఎడిషన్స్ తో పాటు, జాతీయ, అంతర్జాతీయ దినపత్రిక The Asian Age లో ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక ఎడిటోరియల్ కార్టూన్, ఒక పాకెట్ కార్టూన్ వస్తున్నాయి. గత 30 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా వీరి కార్టూన్ మిస్ కాకుండా దినపత్రికలో రావటం ఒక రికార్డు (ఆదివారం ఎడిషన్లో దాదాపు 6 Cartoons Full pledged Caricaturesతో కలిపి).

గుర్తింపు మార్చు

ప్రచురించిన కార్టూన్ పుస్తకాలు మార్చు

  1. 'THE DRIVE' Cartoons on road safety.
  2. 'COUNTER POINT' 350 కార్టూన్స్ పుస్తకం, Premier Edition దక్కన్ క్రానికల్ సంస్థ 2005లో ప్రచురించింది.
  3. ‘ADAAB HYDERABAD’ 2012 హైదరాబాద్ ప్రత్యేకత గురించి సుభాని గీసిన డ్రాయింగ్స్ తో వెలువరించిన పుస్తకం పర్యాటకం అవార్డు గెలుపొందింది.
  4. ‘ScreenToons’ సినిమారంగ కార్టూన్లతో 2021లో వెలువరించిన పుస్తకం.
  5. “హ్యూమర్ ఆన్ పోలీస్” అప్పటి తెలంగాణ పోలీస్ కమీషనర్ మురళీకృష్ణగారితో కలిసి ప్రచురించిన హ్యూమర్ పుస్తకం.

అవార్డులు-సత్కారాలు మార్చు

  • 2021 లో శేఖర్ (కార్టూనిస్టు) మొమోరియల్ అవార్డ్
  • 2019 లో తెలుగు కార్టూనిస్ట్స్ అసోసియషన్ విజయవాడ వారి ఆత్మీయసత్కారం.
  • 2017లో ‘నవ తెలంగాణ’ దినపత్రిక బెస్ట్ కార్టూనిస్ట్ అవార్డు, JCI, అభినందన ఉగాది పురస్కారం.
  • 2016లో CARTOON WATCH ‘LIFETIME ACHIEVEMENT’ AWARD.
  • 2014 6 BHARAT PRAKASHAN TRUST ‘BEST CARTOONIST’ AWARD.
  • 201356 LIONS CLUB INTERNATIONAL ‘LIFETIME ACHIEVEMENT’ AWARD.
  • 2010లో ‘YODHVIR AWARD’ For the out standing contribution to cartoon journalist’ లక్ష రూపాయల నగదు బహుమతితో వెండి సైటేషన్.
  • 2009 DICACD, SEOUL, KOREA ‘HM’ PRIZE.
  • 2006లో FIFA AND IRAN CARTOON HOUSE ‘PRIZE OF HONOUR.
  • 2005లో TABRIZ INTERNATIONAL CARTOON FESTIVAL in ‘selected prize’ .
  • 2004 Fow international Cartoon contestant ‘Gold medal +’success award’.
  • 2003లో ‘knoke-heist’ Belgium in public prize’ 2002లో Rodhas, Greece In ‘selected prize’.
  • 2001లో AIDS CONTROL SOCIETY CARTOON CONTEST IN 1ST PRIZE.

సుభాని వ్యంగ చిత్రమాలిక మార్చు

అధారాలు, మూలాలు మార్చు