సంగమేశ్వరం (నాగాయలంక)

సంగమేశ్వరం (నాగాయలంక) కృష్ణా జిల్లా నాగాయలంక మండలానికి చెందిన రెవిన్యూయేతర గ్రామం.[1]

సంగమేశ్వరం
—  రెవిన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం నాగాయలంక
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 120
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ భొగోళికం మార్చు

ఇది సముద్ర మట్టానికి 6 మీ.ఎత్తులో ఉంది.

సమీప గ్రామాలు మార్చు

రేపల్లె, మచిలీపట్నం, పొన్నూరు, పెడన

గ్రామానికి రవాణా సౌకర్యం మార్చు

నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు రైల్వేస్టేషన్: గుంటూరు 85 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు మార్చు

జిల్లాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, తలగడదీవి ప్రగతి విద్యానికేతన్, గణపేశ్వరం

గ్రామములో దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

సంగమేశ్వరస్వామివారి దేవాలయం మార్చు

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఫాల్గుణమాసంలో పక్షం రోజులపాటు జరిగే సూర్యకిరణాభిషేకాలు మహాప్రశస్తమైనది. సముద్రానికి అతి చేరువలో, దేవతలే స్వయంగా నిర్మించినట్లు ప్రాశస్తం పొందిన ఈ ఆలయంలోనికి సముద్రగర్భం నుండి ఎగసివచ్చే సూర్యభగవానుని తొలికిరణాలు తాకేలాగా ఆలయ నిర్మాణం జరిగింది. యావద్భారతదేశంలో కోణార్క సూర్య దేవాలయం తరువాత సూర్యకిరణాలు నేరుగా స్వామివారి మూలవిరాట్టుని అభిషేకించే ఏకైక దేవాలయం ఇది కావడం విశేషం. ఈ క్షేత్రంలో సూర్య కిరణ పూజ జరిగే సమయంలో భక్తులు ఎలాంటి కోరికలు కోరుకున్నా నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. ఈ పక్షం రోజులూ స్వామివారికి ఆలయంలో విశిష్టాభిషేకాలు నిర్వహించెదరు. ఈ పక్షం రోజులూ ఆలయానికి వచ్చే భక్తులకు, ఆలయ కమిటీవారు అన్ని సౌకర్యాలు కలుగజేసెదరు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం గోచరించే ఈ అద్భుతాన్ని కనులారా వీక్షించాలంటే ఈ ఆలయానికి తెల్లవారుఝాముననే చేరుకోవాలి. ఇక్కడకు విజయవాడ, మచిలీపట్నం, గుడివాడల నుండి ప్రతి రోజూ, నాగాయలంక వరకు ఆర్.టి.సి. బస్సు సౌకర్యం ఉంది. నాగాయలంక నుండి ఈ క్షేత్రం చేరుకోనడానికి ఈ పక్షం రోజులూ వేకువఝాముననే ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేసెదరు.

గ్రామంలో ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు మార్చు

ఈ గ్రామం బంగాళాఖాతం సముద్ర తీరంలో ఉంది. ఈ గ్రామంలో ఒక తాబేళ్ళ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. ఈ కేంద్రం నుండి తాబేళ్ళ గుడ్లను సముద్రం లోనికి వదలగా, 110 తాబేళ్ళ పిల్లలు వచ్చినవి. వీటిని అటవీ శాఖ వీరు సంరక్షించుచున్నారు. ఇక్కడ క్యాట్ ఫిష్ గూడా ఉన్నట్లు గుర్తించారు.

మూలాలు మార్చు

  1. "Sangameswaram Village , Nagayalanka Mandal , Krishna District". www.onefivenine.com. Retrieved 2023-06-30.

వెలుపలి లింకులు మార్చు