సంజుక్తా పాణిగ్రాహి

భారతీయ నర్తకి

సంజుక్తా పాణిగ్రాహి (24 ఆగస్టు 1944 – 24 జూన్ 1997)[1] ప్రముఖ భారతీయ ఒడిస్సీ నృత్య కళాకారిణి. అతి చిన్న వయసులో సంప్రదాయ  నృత్యం  నేర్చుకుని,  ఆ నృత్యంలో  ప్రఖ్యాతం  పొందిన అతి కొద్దిమందిలో  సంజుక్తా ఒకరు కావడం విశేషం.[2][3]

సంజూక్తా పాణిగ్రాహి
జననం(1944-08-24)1944 ఆగస్టు 24
మరణం1997 జూన్ 24(1997-06-24) (వయసు 52)
వృత్తిభారతీయ క్లాసికల్ నృత్యకారిణి, నృత్య దర్శకురాలు
క్రియాశీల సంవత్సరాలు1950s- 1997
జీవిత భాగస్వామిరఘునాథ్ పాణిగ్రాహి
పురస్కారాలు1975: పద్మశ్రీ
1976:సంగీత నాటక అకాడమీ పురస్కారం

భారతీయ సంప్రదాయ నృత్యంలో ఆమె చేసిన కృషికి ఫలితంగా 1975లో భారత అత్యంత పౌర పురస్కారమైన పద్మశ్రీ పురస్కారాన్ని పొందింది. 1976లో  సంగీత  నాటక అకాడమీ  పురస్కారం కూడా అందుకొంది ఆమె.

ఒడిస్సీ నృత్య ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు, ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా వివిధ దేశాలు సందర్శించింది ఆమె. అమెరికా, ఫిలిప్పైన్స్, లండన్, ఇజ్రాయిల్, గ్రీస్ లో జరిగిన దెల్పీ అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవంలో పాల్గొంది. ఫ్రాన్స్ లోని పారిస్ లో జరిగిన అంతర్జాతీయ సంగీత ఉత్సవంలో దాదాపు 11 వారాల పాటు ప్రదర్శనలు  చేసింది.

తొలినాళ్ళ జీవితం, నేపధ్యం మార్చు

ఒడిషా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో బరంపురంలోని బ్రాహ్మణ కుటుంబంలో అబ్రహం మిశ్రా, శకుంతల మిశ్రాలకు 24 ఆగస్టు 1944లో జన్మించింది సంజుక్తా.[4] ఆమె బాల్యంలో కూరగాలలు తరుగుతున్నప్పుడు లేదా కట్టెలు కొడుతున్నప్పుడు ఒక విధమైన లయతో వచ్చే శబ్దానికి అనుగుణంగా అకారణంగా నాట్యం చేయడం ప్రారంభించింది. ఆమె తల్లి జానపద కళలను అభిమానించే కుటుంబ నేపధ్యం కలిగినది. ఆమె తన కుమార్తెలో ప్రతిభను గుర్తించి, సంజుక్త తండ్రి అయిన అభీరం మిశ్రా నుండి కొన్ని ప్రారంభ ప్రతిఘటన ఉన్నప్పటికీ ఆమెను ప్రోత్సహించింది. ఈ నృత్య నిరోధానికి కారణం ఆ రోజుల్లో ఈ నృత్యం సాధారణంగా ఆలయాలలో "మహారీలు" అనబడే అమ్మాయిలు చేత నిర్వహించబడడం సాంప్రదాయంగా ఉండేది. ఈ అమ్మాయిలను "దేవదాసీలు" అని దక్షిణ భారతదేశంలో పిలిచేవారు.

శిక్షణ మార్చు

ఆమె తల్లి ప్రోత్సాహంతో ఆమె తన 4వ యేట "కెలుచరణ మహాపాత్ర" అనే నృత్య గురువు వద్ద శిక్షణ ప్రారంభించింది. 1950-53 మధ్య కాలంలో మూడు సంవత్సరాలపాటు బిస్యుబా మిలన్ యొక్క ఉత్తమ బాల నటిగా ఆమె గుర్తింపు పొందింది. తన ఆరేళ్ల వయస్సులో ఒక ప్రదర్శనలో తన ప్రదర్శన కాలం అయిపోయినా సరే నృత్య వేదికను వదలకుండా శక్తివంతంగా నాట్యాన్ని కొనసాగించింది. ఆమె తల్లి కేకలు వేసి, నృత్యాన్ని బలవంతంగా ఆపేటట్లు చేసింది. తన తొమ్మిదవ యేట కలకత్తాలోని చిల్డ్రన్స్ లిటిల్ థియేటర్ లో వార్షిక పండగలలో ఆమె తన ప్రదర్శననిచ్చింది.[5]

ఆమె 1952లో అంతర్జాతీయ చిల్డ్రన్ ఫిలిం పెస్టివల్ లో ప్రథమ స్థానం పొందింది. ఆమె విజయాలను పోత్సహించిన ఆమె తల్లిదండ్రులు చెన్నై లోని కళాక్షేత్రంలో చేర్చి ఉత్తమ శిక్షణను అందించాలని నిశ్చయించారు. అక్కడ రుక్మిణీదేవి అరండేల్ మార్గదర్శకత్వంలో శిక్షణ కొనసాగించింది. తరువాతి ఆరు సంవత్సరాలు అక్కడే ఉండి నృత్యప్రవీణ డిప్లొమా ను కథాకళి రెండవ విషయంగా భరతనాట్యంలో పట్టాను పొందారు. తరువాత ఆమె "కళాక్షేత్ర బాలెట్ ట్రూపు" సభురాలిగా భారతదేశం, యితర దేశాలలో ప్రదర్శనలిచ్చారు.

తన 14వ యేట ఆమె ఒడిషా తిరిగి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమెను ముంబై లోని భారతీయ విద్యా భవన్ లోని గురు హజారీలాల్ వద్ద కథక్ నృత్యం నేర్చుకొనుటకు ఉపకార వేతనాన్ని యిచ్చింది. కానీ ఆమె ఆ కోర్సును వదలి ఒడిస్సీ నృత్యంలో దృష్టి పెట్టడానికి తిరిగి ఒడిశా వచ్చారు.

సంజుక్తా పాణిగ్రాహి పురస్కారాలు మార్చు

 
పద్మశ్రీపురస్కారం

ఆమె మరణం తరువాత ఆమె భర్త రఘునాథ్ పాణిగ్రాహి ఆమె పేరుతో "సంజుక్తా పాణిగ్రాహి మెమోరియల్ ట్రస్టు" ను 2009 లో నెలకొల్పారు. ఈ ట్రస్టును ఒడిస్సీ నాట్యకళను అభివృద్ధి చేయుటకు స్థాపించారు. 2001 నుండి ప్రతి సంవత్సరం ఆమె జయంతి సందర్భంగా నృత్యకళాకారులను ఉపకార వేతనాలు యివ్వడం, ఒడిస్సీ నృత్య కళలో ప్రముఖులకు పురస్కారాలను అందజేయడం జరుగుతుంది.[6][7]

మూలాలు మార్చు

  1. "Sanjukta at odissivilas". Archived from the original on 2016-03-04. Retrieved 2017-04-28.
  2. Sanjukta: the danseuse who revived Odissi Indian Express, 25 June 1997.
  3. Sanjukta Panigrahi, Indian Dancer, 65 New York Times, 6 July 1997.
  4. Publications, Europa (2003). The International Who's Who 2004. Routledge. p. 1281. ISBN 1-85743-217-7.
  5. Sanjukta Panugrahi mapsofindia.
  6. First Sanjukta Panigrahi award Times of India, 25 August 2001.
  7. Sanjukta Panigrahi Awards narthaki.com.

ఇతర లింకులు మార్చు

Video links