సంబరం 2003 లో దశరథ్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథా చిత్రం.[1] నితిన్, నిఖిత ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.[2] దర్శకుడు తేజ తన స్వంత నిర్మాణ సంస్థ చిత్రం మూవీస్ బ్యానర్ పై నిర్మించగా ఆర్. పి. పట్నాయక్ సంగీతాన్నందించాడు. బాల్య స్నేహితులు, కుటుంబ స్నేహితులైన నాయకా నాయికలు తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారనేది కథాంశం.

సంబరం
దర్శకత్వందశరథ్
రచనతేజ
నిర్మాతతేజ
తారాగణంనితిన్
నిఖిత
సీత
బెనర్జీ
గిరిబాబు
ఎస్. వి. కృష్ణారెడ్డి
పరుచూరి వెంకటేశ్వరరావు
రాళ్ళపల్లి
సుమన్ శెట్టి
ఛాయాగ్రహణంప్రసాద్
కూర్పుకె. వి. కృష్ణారెడ్డి
సంగీతంఆర్. పి. పట్నాయక్
పంపిణీదార్లుచిత్రం మూవీస్
విడుదల తేదీ
31 జూలై 2003
సినిమా నిడివి
172 నిమిషాలు.
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ సవరించు

రవి, గీత చిన్ననాటి స్నేహితులు. రవి చదువుమీద పెద్దగా శ్రద్ధ చూపకుండా స్నేహితులతో బలాదూర్ తిరుగుతుంటాడు. గీత మాత్రం కష్టపడి చదివి ఇంజనీరింగ్ లో చేరుతుంది. రవి గీతను ప్రేమిస్తుంటాడు. ఈ విషయం ఊర్లో అందరికీ తెలిసినా గీత మాత్రం పట్టించుకోదు. రవి వదిన గీతతో రవితో పెళ్ళి గురించి ప్రస్తావన తేగా ఆమె వాళ్ళు స్నేహితులు మాత్రమే నని చెబుతుంది. తనకు కాబోయే భర్త చదువులో, సంపాదనలో తనకన్నా మిన్నగా ఉండాలని చెబుతుంది. ఆమె మాటలు విని రవి తీవ్ర నిరాశకు లోనవుతాడు. మొట్టమొదటిసారిగా జీవితంలో స్థిరపడాలనే ఆలోచన అతనికి వస్తుంది. మెకానిక్ గా చిన్న ఉద్యోగం మొదలుపెడతాడు. నెమ్మదిగా తన వృత్తిలో రాణించి దుబాయ్ వెళ్ళడానికి వీసా సంపాదిస్తాడు. అలా వెళితే తాను గీతకు దూరంగా ఉండచ్చనీ, ఆర్థికంగా కూడా ఎదగచ్చనీ అనుకుంటాడు రవి. ఈ లోపు గీత తండ్రి మరణిస్తాడు. ఆమెకు ఆ సమయంలో సరైన తోడు అవసరమని అనిపిస్తుంది. మంచి భర్తగా ఉండటానికి కేవలం విద్యార్హతలు, ఆర్థిక సంపాదన మాత్రమే సరిపోవని ఆమెకు అనిపిస్తుంది. అప్పటికే రవి దుబాయ్ వెళ్ళడం కోసం విమానాశ్రయం చేరుకుని ఉంటాడు. రవి ఆమెను ఎంతగా ప్రేమించిందీ తెలుసుకుని అతనితో తన ప్రేమను వ్యక్తపరడంతో కథ సుఖాంతమవుతుంది.

తారాగణం సవరించు

పాటలు సవరించు

ఈ చిత్రానికి ఆర్. పి. పట్నాయక్ సంగీత దర్శకత్వం వహించాడు. పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి. కులశేఖర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశారు.

పాట పాడిన వారు రాసిన వారు
ఎర్ర గులాబీ తల్లో పెట్టుకున్నాది మల్లి, రవివర్మ కులశేఖర్
నక్క తోక తొక్కావురో బాలజీ, రవివర్మ కులశేఖర్
పిట్ట నడుం పిల్ల బలేగుందిరో ఆర్.పి, ఉష కులశేఖర్
దేవుడిచ్చిన టిప్పు కులశేఖర్

మూలాలు సవరించు

  1. GV. "Telugu cinema Review - Sambaram". idlebrain.com. GV. Retrieved 22 September 2016.
  2. "Sambaram Telugu Movie". filmibeat.com. Retrieved 22 September 2016.

బయటి లింకులు సవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=సంబరం&oldid=3892532" నుండి వెలికితీశారు