కొండపల్లి దశరథ్

(దశరథ్ నుండి దారిమార్పు చెందింది)

కొండపల్లి దశరథ్ కుమార్ ఒక ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత. సంబరం, సంతోషం, మిస్టర్ పర్‌ఫెక్ట్ అతను దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు.[1][2]

దశరథ్
జననం
వృత్తిసినీ దర్శకుడు
జీవిత భాగస్వామిశేష సౌమ్య
పిల్లలుకార్తీక

జీవితంసవరించు

దశరథ్ నవంబరు 30, 1971 న ఖమ్మం లోని ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.[3] 2005 లో శేష సౌమ్యతో అతని వివాహం జరిగింది. వారికి కార్తీక అనే కూతురు ఉంది.[4]

కెరీర్సవరించు

సినిమాల్లోకి రాక మునుపు దశరథ్ ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్తో కలిసి టీవీ సీరియళ్ళకు సంభాషణలు రాసేవాడు. దూరదర్శన్ లో ప్రసారమైన వెన్నెల్లో ఆడపిల్ల అనే ధారావాహిక మంచి ఆదరణ పొందింది. వీరశంకర్, తేజ, వై.వి.యస్.చౌదరి లాంటి దర్శకులతో సుమారు పదేళ్ళ పాటు పనిచేశాడు. వీరశంకర్ తో హలో ఐ లవ్ యూ, వైవీయస్ చౌదరితో యువరాజు, తేజతో చిత్రం, నువ్వు నేను, ఫ్యామిలీ సర్కస్ లాంటి సినిమాలకు పనిచేశాడు.

2002 లో నాగార్జున కథానాయకుడిగా వచ్చిన సంతోషం సినిమాతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.

సినిమాలుసవరించు

దర్శకుడిగాసవరించు

రచయితగాసవరించు

మూలాలుసవరించు

  1. All about class - The Hindu
  2. "Posters: Nagarajuna's first look in Greeku Veerudu - Oneindia Entertainment". Archived from the original on 2013-05-28. Retrieved 2016-09-22.
  3. "Dasaradh - Screenwriter, Film director". Archived from the original on 2016-03-04. Retrieved 2016-09-22.
  4. "Dasarath interview - chitchat - Telugu film director". Archived from the original on 2016-08-11. Retrieved 2016-09-22.