సత్య కుమార్ యాదవ్

వై. సత్య కుమార్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో ధర్మవరం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2][3][4]

వై. సత్య కుమార్ యాదవ్
సత్య కుమార్ యాదవ్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
12 జూన్ 2024
గవర్నరు ఎస్. అబ్దుల్ నజీర్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
నియోజకవర్గం ధర్మవరం

వ్యక్తిగత వివరాలు

జననం 1971
గడేకల్లు, విడపనకల్లు మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు వై. నాగ రాజా రావు
సంతానం సంస్కృతి, రిషి అద్వానీ
నివాసం ఇంటి. నెం. 1-1478, బీపీఓ రోడ్, అనంతపురం, జార్జ్ పేట్, అనంతపురము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తి రాజకీయ నాయకుడు
వెబ్‌సైటు [1]

జననం, విద్యాభాస్యం

మార్చు

సత్య కుమార్ అనంతపురం జిల్లా, విడపనకల్లు మండలం, గడేకల్లు గ్రామంలో జన్మించాడు. ఆయన ప్రొద్దుటూరు ప్రభుత్వ మున్సిపల్ పాఠశాల, నాగర్ కర్నూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసి కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో ప్రీయూనివర్శిటీ కోర్సు (PUC), మదనపల్లిలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిప్లొమా, బెంగుళూరులో AMIE కోర్సు ద్వారా ఇంజనీరింగ్, మధురై కామరాజ్ యూనివర్సిటీ నుండి పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్‌ (ఐటిఎం), చెన్నై నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌ను పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

సత్యకుమార్ యాదవ్‌ 1993లో వెంకయ్య నాయుడు వద్ద వ్యక్తిగత సహాయకుడిగా చేరి ప్రైవేటు కార్యదర్శిగా, అదనపు ప్రైవేటు కార్యదర్శిగా, సీనియర్ ప్రైవేటు సెక్రటరీగా, ఉప రాష్ట్రపతిగా ఉన్న సమయంలో కొద్దిరోజులు ఓఎస్డీగా దాదాపు  25 ఏళ్ల పాటు పని చే‌శాడు. ఆయన ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 2018లో జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యాడు. సత్యకుమార్ యాదవ్‌ కేరళ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరిశీలికుడిగా, బీజేపీ తరఫున ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సహ ఇన్‌చార్జ్‌గా, అండమాన్-నికోబార్ ఇన్‌చార్జ్‌గా పని చేశాడు.[5]

సత్య కుమార్ 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో ధర్మవరం నుండి తన సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై 3734 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై[6][7] జూలై 12న నారా చంద్రబాబునాయుడు నాలుగో మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[8]

మూలాలు

మార్చు
  1. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Dharmavaram". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  2. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  3. EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  4. EENADU (12 June 2024). "ఉమ్మడి అనంతకు ముగ్గురు అమాత్యులు". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  5. BBC News తెలుగు (12 June 2024). "సత్యకుమార్ యాదవ్: వెంకయ్యనాయుడి పర్సనల్ సెక్రటరీ నుంచి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి వరకు". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  6. EENADU (5 June 2024). "ఓటు ఉప్పెనైంది.. వైకాపాను ఊడ్చేసింది." Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  7. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  8. Eenadu (12 June 2024). "చంద్రబాబు టీమ్‌ ఇదే.. కొత్త మంత్రుల వివరాలు ఇలా." Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.