సన్‌ ఆఫ్‌ ఇండియా దేశభక్తి ప్రధానాంశంగా 2021లో నిర్మించిన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మించగా డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, శ్రీకాంత్, తనికెళ్ళ భరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 ఫిబ్రవరి 18న విడుదలై[1], 2022 మే 17న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైంది.[2]

సన్ ఆఫ్ ఇండియా
దర్శకత్వండైమండ్ రత్నబాబు
రచనడైమండ్‌ రత్నబాబు
స్క్రీన్ ప్లేమంచు విష్ణు
నిర్మాతమంచు విష్ణు
తారాగణం
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థలు
24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ
శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్
విడుదల తేదీs
18 ఫిబ్రవరి 2022 (2022-02-18)(థియేటర్)
17 మే 2022 (2022-05-17)( అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో)
దేశం భారతదేశం
భాషతెలుగు

బాబ్జీ (మోహ‌న్‌బాబు) ఎన్‌.ఐ.ఎ అధికారిణి అయిన ఐరా (ప్ర‌గ్యా జైశ్వాల్‌) ద‌గ్గ‌ర డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. తిరుపతి బయలుదేరిన కేంద్ర మంత్రి మహేంద్ర భూపతి (శ్రీకాంత్) తలకోనలో కిడ్నాప్‌కి గుర‌వుతాడు. ఈ కేసుని ఛేదించ‌డం కోసం ఐరా రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలో కిడ్నాప్‌ల వెన‌క బాబ్జీ అని తెలుస్తుంది. ఇంత‌కీ బాబ్జీ ఆ కిడ్నాప్‌లు ఎందుకు చేశాడు? అతను గతం ఏమిటి? అనేదే మిగతా సినిమా కథ.[3]

చిత్రనిర్మాణం

మార్చు

ఈ సినిమాను 2020 ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాను మోహన్ బాబు ప్రకటించాడు.[4] ఈ సినిమా 2020 అక్టోబరు 23న పూజ కార్యక్రమాలతో సినిమా షూటింగ్ ప్రారంభమైంది.[5] ఈ సినిమా టీజర్‌కు చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడు.[6]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
  • నిర్మాత: మంచు విష్ణు
  • దర్శకత్వం: డైమండ్ రత్నబాబు
  • స్క్రీన్ ప్లే: మోహన్ బాబు
  • సంగీతం: ఇళయరాజా

మూలాలు

మార్చు
  1. Eenadu (15 February 2022). "ఈ వారం థియేటర్‌/ఓటీటీలో సందడి చేసే సినిమాలివే". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
  2. Sakshi (17 May 2022). "ఓటీటీలో 'సన్‌ ఆఫ్‌ ఇండియా' స్ట్రీమింగ్‌.. ఎక్కడంటే ?". Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.
  3. Andhra Jyothy (18 February 2022). "సినిమా రివ్యూ : సన్ ఆఫ్ ఇండియా". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
  4. News18 Telugu (15 August 2019). "'సన్ ఆఫ్ ఇండియా'గా మోహన్ బాబు.. కొత్త మూవీ ప్రకటించిన కలెక్షన్ కింగ్." News18 Telugu. Archived from the original on 14 June 2021. Retrieved 14 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. News18 Telugu (23 October 2020). "Mohan Babu Son Of India: పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన మోహన్ బాబు 'సన్నాఫ్ ఆఫ్ ఇండియా' మూవీ." News18 Telugu. Archived from the original on 29 November 2020. Retrieved 14 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Sakshi (5 June 2021). "డైలాగ్‌ కింగ్‌కి మెగా వాయిస్‌". Sakshi. Archived from the original on 14 June 2021. Retrieved 14 June 2021.