సఫిల్‌గూడ

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక నివాస ప్రాంతం
(సఫిల్గూడ నుండి దారిమార్పు చెందింది)

సఫిల్‌గూడ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక నివాస ప్రాంతం.[1] నేరెడ్‌మెట్‌ సమీపంలో ఉన్న ఈ ప్రాంతం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోని మల్కాజ్‌గిరి మండలం పరిధిలోకి వస్తుంది. ఇది 2009లో హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని వార్డు నంబరు 137గా ఏర్పాటు చేయబడింది.[2] నగరంలో అత్యంత జనసాంద్రత కలిగిన మధ్య/ఉన్నత తరగతి ప్రాంతాలలో సఫిల్‌గూడ ఒకటి.

సఫిల్‌గూడ
సమీపప్రాంతం
సఫిల్‌గూడ ఎక్స్ రోడ్
సఫిల్‌గూడ ఎక్స్ రోడ్
సఫిల్‌గూడ is located in Telangana
సఫిల్‌గూడ
సఫిల్‌గూడ
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
నిర్దేశాంకాలు: 17°27′50″N 78°32′30″E / 17.46389°N 78.54167°E / 17.46389; 78.54167Coordinates: 17°27′50″N 78°32′30″E / 17.46389°N 78.54167°E / 17.46389; 78.54167
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చెల్-మల్కాజ్‌గిరి
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
ప్రభుత్వం
 • నిర్వహణహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం35,891
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
నేరెడ్‌మెట్‌ & ఆర్కే పురం పోస్టు – 500056
మల్కాజ్‌గిరి పోస్టు – 500047
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుటి.ఎస్
లోకసభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం
విదాన్ సభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
జాలస్థలిtelangana.gov.in

ఇక్కడ సఫిల్‌గూడ చెరువు ఉంది. హుస్సేన్ సాగర్ సరస్సులోని టాంక్ బండ్ లాగా ఈ చెరువు చుట్టూ రోడ్డు ఉంటుంది. అందువల్ల దీనిని సఫిల్‌గూడ మినీ ట్యాంక్‌బండ్ అని కూడా పిలుస్తారు. జాగింగ్, ఈవినింగ్ వాక్ కోసం అనేకమంది ఇక్కడకు వస్తారు.[3]

చరిత్రసవరించు

1960/1970లలో ఈ ప్రాంతంలో నివాసగృహాలు నిర్మించబడ్డాయి. ఆ కాలంలో ఈ ప్రాంతం నుండి నగరానికి చేరుకోవడానికి రవాణా సౌకర్యాలు, విద్యుత్ వంటివి లేవు. గతంలో ఇది ఒక కుగ్రామం కాగా, తరువాత ఓల్డ్ నేరెడ్‌మెట్ గ్రామంలో ఒక భాగంగా ఉండేది.

ఉప ప్రాంతాలుసవరించు

సఫిల్‌గూడ ప్రాంతాన్ని ఓల్డ్ సఫిల్‌గూడ, న్యూ సఫిల్‌గూడ అని రెండు ప్రధాన ప్రాంతాలుగా విభజించారు. నేరెడ్‌మెట్‌ గ్రామానికి చెందిన పాత కుగ్రామాన్ని (సఫిల్‌గూడ) ఇప్పుడు ఓల్డ్ సఫిల్‌గూడ అని పిలుస్తారు.[4] ఇక్కడ ఒక దర్గా ఉంది. సఫిల్‌గూడ ఎక్స్ రోడ్ - సఫిల్‌గూడ రైల్వే స్టేషన్ - సఫిల్‌గూడ పాకెట్ కాంప్లెక్స్ (డిఫెన్స్ క్వార్టర్స్) - సఫిల్‌గూడ ఎఒసి - ఆర్కే నగర్ - ఉత్తమ్ నగర్ - బలరామ్ నగర్ మొదలైన ప్రాంతాలను కలుపుకొని న్యూ సఫిల్‌గూడ అని పిలుస్తారు. ఈ ప్రాంతానికి రోడ్డు, రైల్వే సౌకర్యం ఉంది. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషను నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో, జూబ్లీ బస్ స్టేషన్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఓల్డ్ సఫిల్‌గూడలోని కాలనీలుసవరించు

  • సంతోషిమా నగర్ కాలనీ
  • పాత సఫిల్‌గూడ
  • భరత్ నగర్
  • గణేష్ నగర్
  • పిబి కాలనీ
  • ద్వారకమై కాలనీ
  • సుధా నగర్
  • సాయినాథపురం
  • వెంకటేశ్వర నగర్ కాలనీ

న్యూ సఫిల్‌గూడలోని కాలనీలుసవరించు

  • శారదా నగర్
  • సూర్యానగర్ ఎన్క్లేవ్
  • చాణక్యపురి కాలనీ
  • ఆర్.కె.నగర్
  • ఉత్తమ్ నగర్
  • దయానంద్ నగర్
  • చంద్రగిరి కాలనీ
  • బలరామ్‌నగర్
  • సీతారాంనగర్
  • దేవి నగర్

ఈ ప్రాంతంలో 1970లలో రాధాకృష్ణ నగర్, ఉత్తమ్ నగర్, దయానంద్ నగర్ మొదలైనవి ఏర్పడ్డాయి. 1970లలో రైల్వే ఉద్యోగులు ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేసి, ఇళ్ళు నిర్మించుకున్నారు. ఇక్కడి రైల్వే ఉద్యోగులలో ఎక్కువమంది ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ర్టాల నుండి వచ్చినవారు ఉన్నారు.

వాణిజ్య ప్రాంతంసవరించు

ఇక్కడ రిలయన్స్, ఫ్రెష్ @, మరిన్ని వంటి ప్రధాన రిటైల్ దుకాణాలు ఉన్నాయి. సబర్బన్ పట్టణానికి కావలసిన వైద్య, విద్య, షాపింగ్, కార్యాలయాలు, ప్రజా రవాణా వంటి మౌలిక సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి.

రవాణాసవరించు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఆనంద్‌బాగ్ ఎక్స్ రోడ్ నుండి సఫిల్‌గూడ మీదుగా ఉత్తమ్ నగర్, మెట్టుగూడ, ఇసిఐఎల్, మౌలాలీ, తార్నాక మొదలైన ప్రాంతాలకు రవాణా సౌకర్యం ఉంది.[5] ఇక్కడ సఫిల్‌గూడ రైల్వే స్టేషను ఉంది. ఇది సికింద్రాబాద్ జంక్షన్, బొల్లారాం జంక్షన్ ల మధ్య ఉంది.

మూలాలుసవరించు

  1. "Safilguda Locality". www.onefivenine.com. Retrieved 2021-02-01.
  2. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Retrieved 2021-02-01.
  3. "Safilguda Lake Anything but Swachh, Needs Attention". The New Indian Express. Retrieved 2021-02-01.
  4. "Old Safilguda, Moula Ali, Secunderabad Locality". www.onefivenine.com. Retrieved 2021-02-01.
  5. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-02-01.

ఇతర లంకెలుసవరించు