జీడిగుంట రామచంద్ర మూర్తి
జీడిగుంట రామచంద్ర మూర్తి ప్రముఖ సాహితీవేత్త.[1] రేడియో నాటకాలు రాయడం, వాటిల్లో నటించడం; కథలు, నాటికలు, నవలలు, సినిమాలకు సంభాషణలు, అనువాద వ్యాసాల రచన... ఇలా అన్నింట్లో తన కలానికున్న సత్తా చాటారు జీడిగుంట రామచంద్రమూర్తి.[2]
జీవిత విశేషాలుసవరించు
ఆయన ప్రముఖ తెలుగు రచయిత. ఆయన ఆలిండియా రేడియో, హైదరాబాదు కేంద్రంలో 28 సంవత్సరాలపాటు తన సేవలనందించారు.[3] కేవలం రచనపై ఉన్న ఆసక్తితోనే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని ఆకాశవాణిలో అడుగుపెట్టి పదవీ విరమణ వరకు అందులోనే ఉండిపోయారాయన[2].
రేడియో రచయితగాసవరించు
ఆయన "కుటుంబ నియంత్రణ" విభాగంలో స్క్రిప్ట్ రచయితగా, తర్వాత "నాటక విభాగం"లో కార్యక్రమ నిర్వహణాధికారిగా పనిచేశారు. అప్పుడే దాదాపు 40 నాటికల్ని, నాటకాల్ని రాసి ప్రసారం చేశారు. అలాగే ప్రయోక్తగా మల్లాది వెంకటకృష్ణమూర్తి (మందాకిని), ముదిగొండ శివప్రసాద్ (అనుభవ మంటపం), వాసిరెడ్డి సీతాదేవి (ఉరితాడు), యండమూరి వీరేంద్రనాథ్ (నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య) లాంటి ప్రముఖ రచయితల నవలలను రేడియో నాటకాలుగా ప్రసారం చేశారాయన[2]. రేడియోలో ఆదివారాల్లో వచ్చే "కార్మికుల కార్యక్రమం"లో "బాలయ్య"గా ఆయన పాత్ర పోషించారు. చిన్నక్క, ఏకాంబరం పాత్రలతో పాటు బాలయ్యగా శ్రోతలు ఆయనను ఆదరించారు. సుమారు నాలుగేళ్లు ఈ కార్మికుల కార్యక్రమాన్ని నిర్వహించి రికార్డు సృష్టించారు. అప్పట్లో ప్రతి ఆదివారం సంక్షిప్త శబ్దచిత్రం శీర్షిక తో ప్రసారమయ్యే తెలుగు చలనచిత్రాల కూర్పు కూడా చేసేవారు.
సినీరంగ ప్రవేశంసవరించు
ఆయన ప్రముఖ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించిన అమెరికా అబ్బాయి సినిమాకు కథ రాసారు. దుక్కిపాటిగారికి రేడియో వాళ్లంటే ఎంతో అభిమానం. ఆ చిత్రానికి ప్రముఖ రేడియో ఆర్టిస్ట్ ఎర్రమనేని చంద్రమౌళి మాటలు రాశారు. తర్వాత ఈ ప్రశ్నకు బదులేది, పెళ్లిళ్లోయ్ పెళ్లిళ్లు అనే సినిమాలకు సంభాషణలు రాశారు. మరో మాయాబజార్, అమృత కలశం చిత్రాలకు సహ రచయితగా వ్యవహరించారు. టెలివిజన్ లో బాగా ప్రేక్షకాదరణ పొందిన ‘మనోయజ్ఞం’ సీరియల్‌కు 40 ఎపిసోడ్లకు స్క్రిప్ట్ రాశారు.[2]
రచనలుసవరించు
- నిన్నటి కొడుకు కథలు[4]
- ఆశ్రుఘోష (నాటకం)- 2004 తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ అవార్డు లభించింది.[5]
- ప్రేమకు మిగిలింది
- గోదానం
- అమూల్యం
- నిన్నటి కొడుకు
- అమ్మకో ముద్దు
- జీడిగుంట రామచంద్రమూర్తి కథలు
- వెండితెర సాక్షిగా
- గుడిలో పువ్వు
- జీవన వాహిని (నవల)
- అనుభూతులు అనుబంధాలు (నవల)
- నల్ల మల్లి (నవల)
- మూడు నాటికలు
^ బావా బావా పన్నీరు
- తాతాధిత్తై తధిగిణతోమ్
" శ్రీ అంజనేయం ^ నేనూ నా జ్ఞాపకాలు
వ్యక్తిగత జీవితంసవరించు
ఆయనకు ముగ్గురు కొడుకులు. ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉంటారు. రెండో కుమారుడు జీడిగుంట శ్రీధర్ టీవీ సీరియళ్లలో నటుడు. అలాగే వెండితెరపై వర్ధమాన నటుడు వరుణ్ సందేశ్ ఆయన పెద్ద కుమారుడు విజయసారథి కుమారుడు.[6] మనుమరాలు వీణా సాహితి కూడా పాటల రచయిత్రి. ఆమె అలా మొదలైంది సినిమాలో పాటలను వ్రాసారు.
అవార్డులుసవరించు
- ప్రతి సంవత్సరం చాట్ల శ్రీరాములు నెలకొల్పిన "ప్రతిభా పురస్కారం" 2015 సంవత్సరానికి గానూ లభించింది.[7]
- 2015 మన్మధ నామ సంవత్సర కళారత్న పురస్కారాన్ని "సాహిత్యం" విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేసింది.[8]
- సారా నిషేధ ఉద్యమంపై రచించిన ‘పరివర్తన’కు ఉత్తమ రచయితగా నంది అవార్డు.
- ‘ఊర్మిళ-ఉగాది రచనల పోటీ’కు ద్వితీయ ఉత్తమ రచయితగా నంది అవార్డు.
- దూరదర్శన్‌లో ప్రసారమైన ‘పునరపి’ సీరియల్‌కు ఉత్తమ టెలీఫిల్మ్ రచయితగా నంది అవార్దు.
- ‘భర్తృహరి సుభాషిత కథలు’ లఘుచిత్రాలకు ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు
- "గుండెపోటు" అనే కథకు 2007 సంవత్సర సోమేపల్లి సాహితీ పురస్కారం అందుకున్నారు.
మరణంసవరించు
శ్రీ రామచంద్ర మూర్తి గారు తన 80వ యేట 2020,నవంబర్ 10న హైదరాబాదులో కేర్ (Care) ఆసుపత్రిలో Covid-19 చికిత్స పొందుతూ మరణించారు.[9]
మూలాలుసవరించు
- ↑ విజయవాడ సూపర్బ్ Sakshi | Updated: January 30, 2015 00:47 (IST)[permanent dead link]
- ↑ 2.0 2.1 2.2 2.3 "మేనమామ ట్యూన్ చేశారు". No. సాక్షి. సాక్షి. March 19, 2015. Archived from the original on 14 December 2015. Retrieved 7 January 2016.
- ↑ "Varun Sandesh Wiki and Biography in filmyfolks.com". Archived from the original on 2016-04-08. Retrieved 2016-01-09.
- ↑ "Ninnati Koduku Kathalu, Navodaya Book House,Hyderabad". Archived from the original on 2016-03-04. Retrieved 2016-01-09.
- ↑ "Telugu University annual literary awards (2004)". Archived from the original on 2016-03-06. Retrieved 2016-01-09.
- ↑ "Waiting for the turn, Y. SUNITA CHOWDHARY, May 6, 2012, హిందూ పత్రిక". Archived from the original on 2020-11-11. Retrieved 2016-01-09.
- ↑ Honour for Jeedigunta, GUDIPOODI SRIHARI, December 17, 2015 16:04 IST హిందూపత్రిక
- ↑ "ఉగాది పురస్కార విజేతలను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Published On:20-03-2015 సాక్షి". Archived from the original on 2016-03-04. Retrieved 2016-01-09.
- ↑ "జీడిగుంట రామచంద్ర మూర్తి కన్నుమూత". Archived from the original on 2020-11-11. Retrieved 2020-11-11.