సహవిద్య లేదా కో-ఎడ్యుకేషన్ అనగా స్త్రీ పురుషులిరువురూ కలసి ఒకే పాఠశాల/కళాశాలలో విద్య నేర్చుకొనుట. దీని అర్థం ఒక విద్యాలయంలో బాలబాలికలు కలగలసి చదువుకుంటుంటారు. ఈ విధానంలో సాధారణంగా ఒకే తరగతికి చెందిన విద్యార్థి, విద్యార్థినిలు ఆ తరగతికి సంబంధించిన గదిలో చేరొక వైపు అనగా ఆడపిల్లలంతా ఒకవైపు, మగపిల్లలంతా ఒకవైపు కూర్చొని విద్యనభ్యసిస్తుంటారు. ఈ అభ్యాస విధానం వివిధ దేశాల్లో విభిన్నంగా ఉంది. అత్యధిక ప్రాథమిక పాఠశాలలు చాలా కాలం నుంచి సహ విద్యావిధానానే కొనసాగిస్తున్నాయి. యుక్తవయస్సుకు ముందు ఆడవారిని ప్రత్యేకంగా చదివించాలని చేపేందుకు ప్రత్యేక కారణం లేదు. అలాగే, ప్రాథమిక పాఠశాలల్లో పాఠ్య ప్రణాళిక అనేదీ వివాదాస్పదం కాదు. ఇది భౌగోళిక, చరిత్ర యొక్క కొంత ప్రాథమిక జ్ఞానంతో చదవడం, రాయడం, అంకగణితం వక్కాణిస్తుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=సహవిద్య&oldid=2952011" నుండి వెలికితీశారు