నారంశెట్టి ఉమామహేశ్వరరావు

రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు తెలుగు కథారచయిత. ఆయన గేయాలు, కథలు, వ్యాసాలు, నాటికలు, నవలలు, వాచకాలు మొదలైన ప్రక్రియలలో కథా సాహిత్యం, బాలసాహిత్యాన్ని అందిస్తున్నారు.[1] ఆయన "నారంశెట్టి ఉమా", "శరత్ చంద్రిక", "ఉమామహేశ్", "ఎన్యూఎమ్మార్" కలంపేర్లతో రచనలు చేస్తుంటాడు. అతనికి 2018 బాలల సాహిత్య పురస్కారం లభించింది. అతని నవల ‘ఆనందలోకం’కు ఈ గౌరవం దక్కింది.[2]

నారంశెట్టి ఉమామహేశ్వరరావు

జీవిత విశేషాలు

మార్చు

ఆయన విజయనగరం జిల్లా (ఆంధ్రప్రదేశ్) లోని సీతానగరం మండలానికి చెందిన గెడ్డలుప్పి గ్రామంలో నవంబరు 14 1964 న సావిత్రమ్మ, గంగయ్య దంపతులకు జన్మించాడు. ఆయన ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఎం.ఎ చేసాడు. తపాలా శాఖలో పర్యవేక్షకునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. ఆయన ప్రవృత్తి పరంగా కథా రచన, బాల సాహిత్య రచనలు చేయడం, వేసవి శిక్షణా శిబిరాలలో బాలసాహిత్యంపై శిక్షణ నివ్వడం, బాల సాహిత్య రచనలు చేయడంలో పిల్లలను ప్రోత్సహించడం, బాల సాహిత్యం మీద వ్యాసాలు రాయడం చేస్తూంటాడు.[3]

రచనా వ్యాసంగం

మార్చు

ఆయన మొదటి రచన ‘మేలేరిగిన మనిషి’ (అనుబంధ నవల) ప్రముఖ బాలల మాసపత్రిక “బాలజ్యోతి” 1981 ఫిబ్రవరి సంచికలో ప్రచురించబడింది. అది మొదలు ఇప్పటివరకూ 1000 కు పైగా బాలల కథలు, బాలగేయాలు, గేయకథలు, అనుబంధనవలలు, పెద్దకథలు, సీరియల్ నవలలు తెలుగులో వెలువడిన పత్రికలైన చందమామ, బాలమిత్ర, బాలభారతం, బుజ్జాయి, బాలజ్యోతి, బాల రంజని, చిన్నారిలోకం, జాబిల్లి, చిన్నారి, బాల, బాలభారతి, బాలచంద్రిక, బాలబాట, నాని, శ్రీవాణి పలుకు, మొలక, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, వార్త, స్వాతి, ఉదయం, ఆదివారం, మయూరి లలో అచ్చయ్యాయి. ఇవికాక పెద్దలకోసం రాసిన కథలు, కవితలు ఈనాడు ఆదివారం, తెలుగు వెలుగు, నవ్య వీక్లీ, ఆంధ్రప్రభ, స్వాతి, ఆంధ్రభూమి, పల్లకి, తరంగిణి, స్రవంతి, యువ, విజయ, హాస్యానందం, శ్రావ్య, చతుర, విపుల, స్వప్న, యోజన, సైనిక సమాచార్ మొదలగు వార, మాస పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కవితలు, కథలు ప్రసారమయ్యాయి.[4]

ప్రచురించబడిన పుస్తకాలు

మార్చు
  • మేలెరిగిన మనిషి (బాల కథా సంపుటి)
  • వింతజలం (బాల కథా సంపుటి)
  • భద్రయ్య పంపకం (బాల కథా సంపుటి)
  • నిజాయితీకి బహుమతి (బాల కథా సంపుటి)
  • నిజమైన స్నేహితుడు (బాల కథా సంపుటి) [5]
  • తలతిక్క రాజు (బాల కథా సంపుటి) [6]
  • ఊహలకే రెక్కలోస్తే (జానపద నవల )
  • ఆనందలోకం (జానపద నవల) [7]
  • జవాబు దొరకని ప్రశ్న (బాల కథా సంపుటి)
  • పుష్పక విమానం (బాల కథా సంపుటి )
  • అమ్మంటే నీలాకాశం (కథా సంపుటి)
  • సరిహద్దు పంటలు- ఎర పంటలు (వ్యవసాయ వాచకం) (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి వ్యవసాయ శాఖ వారిచే ప్రచురణ )
  • పప్పుధాన్యాలు -1 (వ్యవసాయ వాచకం) (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి వ్యవసాయ శాఖ వారిచే ప్రచురణ )
  • పప్పుధాన్యాలు -2 (వ్యవసాయ వాచకం) (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి వ్యవసాయ శాఖ వారిచే ప్రచురణ )
  • తెలివైన వాడు (బాల కథా సంపుటి)
  • ఎలుగుబంటి స్నేహం (బాల కథా సంపుటి)
  • e - తరం కుర్రాడు (తానా బాల సాహిత్య పోటీలో ప్రథమ బహుమతి పొందిన ఆధునిక సాహస నవల )
  • రైతు సింహాసనం (నవల )
  • తెలివైన వాడు (బాలల కథా సంపుటి
  • ఎలుగుబంటి స్నేహం (బాలల కథా సంపుటి)
  • బహుమతి (బాలల కథా సంపుటి (హిమకర్ పబ్లికేషన్స్)
  • అసలు సిసలు నేస్తం (బాలల కథాసంపుటి  (హిమకర్ పబ్లికేషన్స్).
  • దేశభక్తి (బాలల కథా సంపుటి,
  • తాతయ్య చిక్కు ప్రశ్నలు (బాలల కథా సంపుటి,
  • వెండినాణెంలో వింత రాక్షసుడు (బాలల కథా సంపుటి,
  • తెలివితక్కువ పులి (బాలల కథా సంపుటి,
  • బుద్ధొచ్చిన ఏనుగు (బాలల  కథా సంపుటి)

ప్రచురణలో ఉన్న బాల సాహిత్యం

మార్చు
  • స్నేహితుడి ఎంపిక (బాల కథా సంపుటి) 2. దెబ్బకు దెబ్బ (బాల కథా సంపుటి) 3. బడి పాప (బాల గేయ  సంపుటి) 4. చూడదగ్గ ప్రదేశాలు (వ్యాసాలు)   5. చేతవెన్నముద్ద (బాల గేయ సంపుటి) 6. మేకపిల్ల  సాయం (బాల కథా సంపుటి) 7. తప్పెవరిది (బాల కథా సంపుటి) 8. జ్ఞానదీపము (బాలకథా సంపుటి ) 9. పరోపకారి గుర్రం   (బాల కథా సంపుటి) 10. దొంగల్లో దొర  (బాలకథా సంపుటి) 12. మంచితనం (పొట్టి కథలు)13. అటకెక్కిన రచయిత (హాస్యకథలు)14. ఆ రోజులు మళ్ళీ రావాలి (కవితా సంపుటి
  • 15. అయిదు వరాలు (పిల్లల నవల)16. అద్భుత లోకం (పిల్లల నవల)17. బాలసాహిత్యం – నేటి అవసరం18. మన జాతీయ నాయకులు (వ్యాసాలు)19. బాల సాహిత్యం (నాడు – నేడు - రేపు)20 .తెలుగు వీర  (పద్య శతకం )21.  జ్యోతిర్మయం (ఆధ్యాత్మిక వ్యాసాలు)

పొందిన బహుమతులు

మార్చు
  1. బాలజ్యోతి మాసపత్రిక నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో “గుణపాఠం” కథకు ప్రథమ బహుమతి. (1987)
  2. ‘పాఠశాల’ మాసపత్రిక నిర్వహించిన దీపావళి కథ పోటీలో “కష్టేఫలి” కథకు ద్వితీయ బహుమతి. (1988)
  3. ‘జాబిల్లి’ మాసపత్రిక నుండి ఉత్తమ విమర్శకుడు బహుమతి. ( 1984)
  4. నవత మాస పత్రిక నుండి ‘నా(నే)డు’ మినీ కవితకు ఉత్తమ కవిత బహుమతి. (1985 జూలై)
  5. నవత మాస పత్రిక నుండి ‘నిజం’ మినీ కవితకు ఉత్తమ కవిత బహుమతి. (1986 జనవరి)
  6. హిమగిరి మాస పత్రిక నిర్వహించిన జోకుల పోటీలో రెండు కన్సొలేషన్ బహుమతులు. (1986)
  7. స్వాతి వార పత్రిక నిర్వహించిన బాపు బొమ్మకు కథ పోటీలో ‘పిల్లల కోసం’ కథకు బహుమతి. (21.11.86 సంచికలో ప్రచురణ)
  8. ఉదయం వార పత్రిక నిర్వహించిన ‘అసలు కథ అప్పుడే మొదలయింది” పోటీలో “ఆమె ప్రేమ” కథకు బహుమతి. (1987)
  9. మయూరి వార పత్రిక నిర్వహించిన “పాఠకుల కోసం పాఠకుల కథ” పోటీలో “పున:సంగమం” కథకు బహుమతి. (1987)
  10. మయూరి వార పత్రిక నిర్వహించిన “పాఠకుల కోసం పాఠకుల కథ” పోటీలో “ఎదురు చూపు” కథకు బహుమతి. (1987)
  11. స్వాతి వార పత్రిక నిర్వహించిన బాపు బొమ్మకు కథ పోటీలో ‘నిర్ణయం’ కథకు బహుమతి. ( 06.11.87 సంచికలో ప్రచురణ)
  12. ఆంధ్ర జ్యోతి వార పత్రిక నుండి ‘నచ్చిన కథ’ ఉత్తరానికి బహుమతి. (27.07.90 సంచికలో ప్రచురణ)
  13. ఆంధ్ర ప్రభ వార పత్రికలో “ఈ విధంగా చేయండి” లేఖకి ఉత్తమ లేఖ బహుమతి. ( 1993)
  14. స్వాతి సపరి వార పత్రిక నిర్వహించిన బాపు కార్టూనుకి కథ పోటీలో ‘అనుకున్నదొక్కటీ ...” కథకు బహుమతి. ( 17.09.2010 సంచికలో ప్రచురణ)
  15. బాలసాహిత్య పరిషత్, అరుణోదయ ఆర్ట్స్ క్రియేషన్స్ నిర్వహంచిన రాష్ట్ర స్థాయి బాలసాహిత్య గ్రంథాల పోటీలో “మేలెరిగిన మనిషి” (బాలల కథల సంపుటి) కి మొదటి బహుమతి. (2012)
  16. శ్రీవాణి పలుకు మాసపత్రిక జన్మ దిన సంచిక కథల పోటీలో “కుక్క తోక’ కథకు ప్రోత్సాహక బహుమతి. (2015)
  17. శ్రీవాణి పలుకు మాసపత్రిక సంక్రాంతి కథల పోటీ 2017 లో “దేశభక్తి " కథకు బహుమతి
  18. తానా - మంచి పుస్తకం వారు నిర్వహించిన బాల సాహిత్య రచనల పోటీలు 2017 లో e-తరం కుర్రాడు బాలల నవలకు ఉత్తమ నవలగా బహుమతి పొందింది.
  19. తెలుగు వెలుగు మాసపత్రిక నిర్వహించిన ప్రేమ లేఖల పోటీలో "నువ్వే నాకు ఆదర్శం" లేఖకు రు.1116 /- నగదు బహుమతి పొందారు.
  20. రావూరి భరద్వాజ బాలల విజ్ఞాన పీఠం, చిలకలురిపేట వారు నిర్వహించిన బాలల కథల పోటీలో “ఆచరణ” కథకు ప్రోత్సాహక బహుమతి పొందారు. (2018)
  21. విశాఖ సంస్కృతి మాసపత్రిక నిర్వహించిన బాలల కథల పోటీలో “మాటల మాధుర్యం” కథకు ప్రోత్సాహక బహుమతి పొందారు. (2018)

సన్మానాలు, పురస్కారాలు

  1. ప్రముఖ బాల సాహితీవేత్త శ్రీ రెడ్డి రాఘవయ్య గారి బాల సాహిత్య నిర్మాతలు పుస్తకంలో ఫోటో, బయో డేటా ప్రచురణ.
  2. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారిచే “సహస్రాబ్ది అవార్డు” ప్రదానం (తేది 01-01-2000)
  3. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ గారిచే ఉత్తమ ఉద్యోగిగా గుర్తింపు, హైదరాబాదులో సన్మానం. (2006)
  4. బాలసాహిత్య పరిషత్, హైదరాబాద్ వారిచే “ బాలసాహితీ రత్న ‘ అవార్డు” ప్రదానం.( తేది 08.05.2011)
  5. బాలసాహిత్య పరిషత్, హైదరాబాద్, అరుణోదయ ఆర్ట్ క్రియేషన్స్ వారిచే జరిగిన రాష్ట్ర స్థాయి బాలసాహిత్య గ్రంధాల పోటీలో “మేలెరిగిన మనిషి”కి మొదటి బహుమతి ప్రదానం . (తేది 28.02.2012)
  6. శ్రీరామ రూరల్ విద్యాసంస్థలు, చిలుమూరు వారి నుండి ప్రతిష్ఠాత్మక ‘కొలసాని- చక్రపాణి’ పురస్కారం ప్రదానం (2012)
  7. ధర్మకేతనం సాహిత్య కళాపీఠం, హైదరాబాదు వారిచే “కొత్త అర్ధం” కవితకు ఉత్తమ కవితా ప్రశంసా పత్రం, సన్మానం. (2011)
  8. డాక్టర్ వెలగా వెంకటప్పయ్య గారి సంపాదకత్వాన వెలువడిన “అందరూ మహానుభావులే” గ్రంథంలో బాల సాహిత్య రచయితగా గుర్తింపు. (2013)
  9. సాహిత్య అకాడెమీ, బెంగుళూరు శాఖ వారు ప్రచురించిన బాలల మంచికథలు గ్రంథంలో “కృతజ్ఞత” కథ ప్రచురణ, 22 భారతీయ భాషల్లోకి అనువాదం కొరకు ఎంపిక .
  10. ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని కిన్నెర ఆర్ట్ థియేటర్స్, కిన్నెర పబ్లికేషన్స్ వారు ప్రచురించిన తెలుగు రచయితల డైరెక్టరీలో ఫోటో, బయోడేటా ప్రచురణ. (2012)
  11. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా జిల్లా కలెక్టరు, ఎం.పీ., ఎం.ఎల్.ఏ.ల చే పార్వతీపురంలో ఘన సన్మానం. (2012)
  12. తెలుగురక్షణ వేదిక, హైదరాబాదు వారిచే ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ గారి చేతుల మీదుగా ఘనసన్మానం (2013)
  13. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, ప్రకృతి ఆదిదేవోభవ, తోటపల్లి వారు నిర్మించిన వలస పక్షులు డాక్యుమెంటరీలో నటన. (2014)
  14. డాక్టర్ వెలగా వెంకటప్పయ్య గారి 83 వ జన్మదిన ప్రత్యేక సంచికకు సంపాదకుడిగా వ్యవహరించుట. (2014)
  15. పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం వారి ఆర్థిక సహకారంతో బాల సాహితీవేత్త శ్రీ పైడిమర్రి రామకృష్ణ ప్రచురించిన “బాలసాహితీ శిల్పులు” గ్రంథంలో బాల సాహిత్య రచయితగా ఫోటో, బయోడేటా ప్రచురణ. (2015)
  16. రాష్ట్ర మంత్రులు శ్రీ గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథ రెడ్డి గారి చేతుల మీదుగా ‘అమరావతి పురస్కారం’ ప్రదానం. (21.06.2015 విశాఖ లో)
  17. విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పెర్సన్ శోభా స్వాతిరాణి, గజపతినగరం ఎం.ఎల్.ఎ. శ్రీ కె. ఏ. నాయుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు డా. డి. వి. జి. శంకరరావుల చేతుల మీదుగా “గోదావరి మహా పుష్కర పురస్కారం” ప్రదానం. (19.07.2015 విజయనగరంలో)
  18. చిలకలూరి పేట, రావూరి భరద్వాజ బాలల విజ్ఞాన పీఠం వారి ఆధ్వర్యంలో జరిగిన సభలో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీతలు దాసరి వెంకటరమణ, చొక్కాపు వెంకటరమణ, పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయ అవార్డు గ్రహీతలు అలపర్తి వెంకట సుబ్బారావు గార్ల చేతుల మీదుగా సన్మానం. (05.07.2015)
  19. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్ పెర్సన్ చౌదరి ధనలక్ష్మి, శ్రీకాకుళం శాసన సభ్యురాలు గుండ లక్ష్మీదేవి, చేతుల మీదుగా “తెలుగు భాషా శ్రీ “ పురస్కారం ప్రదానం. (23.08.2015 శ్రీకాకుళంలో)
  20. మాతృభాషా దినోత్సవం పురస్కరించుకుని ‘తెలుగు పరిరక్షణ సమితి, విజయనగరం’ వారిచే 27.08.2015 నాడు విజయనగరం భాష్యం పబ్లిక్ స్కూలులో సన్మానం.
  21. మాతృభాషా దినోత్సవం పురస్కరించుకుని ‘శ్రీ సాహితీ సేవా సమాఖ్య, బొబ్బిలి’ వారిచే 28.08.2015 నాడు బొబ్బిలి గాయత్రి పబ్లిక్ స్కూలులో సన్మానం.
  22. విజయనగర ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం నిర్వహించిన కవి సమ్మేళనంలో సన్మానం. (26.10.15)
  23. సాలూరు సాహితీ మిత్ర బృందం వారిచే 7.11.2015 సన్మానం
  24. బాల గోకులం సాహిత్య, సాంస్కృతిక సంస్థ, హైదరాబాదు వారిచే “బాల నేస్తం అవార్డు ప్రదానం (15.11.15)
  25. బాలరంజని సాహిత్య సాంస్కృతిక సంస్థ, శ్రీకాకుళం వారిచే “బాల బంధువు” అవార్డు ప్రదానం (29.11.15)
  26. మహాకవి గురజాడ శత వర్థంతి సందర్భంగా విజయనగరం జిల్లా కలెక్టర్ ప్రభుత్వం నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొని జ్ఞాపిక, సన్మానం (30.11.2015 )
  27. గాయత్రి విద్యా సంస్థలు, తెలుగు పరిరక్షణ సమితి, విజయనగరం నిర్వహించిన సంక్రాంతి కవి సమ్మేళనంలో సన్మానం. (03.01.2016)
  28. విజయనగరం జిల్లా కలెక్టర్ గారిచే దుర్ముఖి ఉగాది పురస్కారం ప్రదానం. (8.4.2016)
  29. కరీంనగర్ జిల్లా మెట్ పల్లికి చెందిన త్రివేణి సాహిత్య సంస్థ వారిచే వాసాల బాల సాహితీ పురస్కారం ప్రదానం (27.03.2016)
  30. మంచిపల్లి సత్యవతి స్మారక రాష్ట్ర స్థాయి బాల సాహిత్య ఉగాది పురస్కారం, బాల సాహితీ భూషణ్ బిరుదు ప్రదానం (24.04.2016)
  31. ఆంధ్ర ప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో “కృష్ణా పుష్కర పురస్కారం” ప్రదానం (19.08.2016)
  32. భారతి సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ వారిచే ‘ఉత్తరాంధ్ర కళా రత్న పురస్కారం’ ప్రదానం (21.08.2016)
  33. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారిచే “తెలుగు భాషా సేవకుడు” విశిష్ట పురస్కారాన్ని గౌ!! ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిచే ప్రదానం. (29.08.2016)
  34. విజయనగర ఉత్సవ్ 2016 సందర్భంగా పది మంది ప్రముఖులను ఎంపిక చేసి సాహిత్యంలో ప్రముఖునిగా గుర్తించి జిల్లా కలెక్టర్ శ్రీ వివేక్ యాదవ్, శాసన సభ్యులు మీసాల గీత, శాసన మండలి సభ్యులు డి.జగదీశ్ మున్నగు వారిచే సత్కారం (16.10.2016)
  35. బండారు బాలానంద సంఘం, లోగీస, గజపతినగరం వారిచే బాల సేవక్ పురస్కారం (13.11.2016)
  36. గ్రంథాలయ సంఘం, తెనాలి (గుంటూరు) వారిచే ‘బాలబంధు సమతారావు రాష్ట్ర స్థాయి బాల సాహిత్య పురస్కారం’ ప్రదానం (20.11.16)
  37. 2014 సంవత్సరానికి “వింత జలం” బాల సాహిత్య గ్రంథానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం నుండి  తెలంగాణా హోం శాక్షా మాత్యులు నాయిని నరసింహారెడ్డి, ఆర్థిక శాఖామాత్యులు ఈటెల రాజేందర్ గారి చేతుల మీదుగా సాహితీ పురస్కార ప్రదానం (01.12.2016)
  38. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ప్రతినిధిగా ఆంధ్ర సంస్కృతి సమితి, భువనేశ్వర్ లో నిర్వహించిన అరవయ్యవ వార్షికోత్సవ సభలో  హాస్య కవి సమ్మేళనంలో పాల్గొని సన్మానం పొందుట. (25.12.2016)
  39. సూర్య తేజ కళాశాల, కాశీబుగ్గ వారి ఆరవ వార్షికోత్సవ సభలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి డా.జి.యతిరాజులు గారిచే సన్మానం. (06.1.2017)
  40. గెడ్డలుప్పిలో జరిగిన ప్రగతి అసోసియేషన్ వారి 154 వ స్వామి వివేకానంద జయంతి ఉత్సవంలో ప్రసంగం, సన్మానం (12.01.2017)
  41. పార్వతీపురంలో జరిగిన కళింగ వైశ్య సంఘం వారిచే సంక్రాంతి సంబరాలలో ఘన సన్మానం (16.01.2017)
  42. ఆదిలీలా జాతీయ ఫౌండేషన్, కొత్త డిల్లీ వారి నుండి ‘ఉగాది జాతీయ సాహితీ ప్రతిభా పురస్కారం’ను భారత మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ డా జి. వి. జి. కృష్ణమూర్తి గారి చేతుల మీదుగా ప్రదానం.(26.03.2017
  43. అమరావతి, విశ్వ సాహితి, విశాఖపట్టణం వారు నిర్వహించిన కవి సమ్మేళనం, పుస్తకావిష్కరణ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరయి పొందిన సన్మానం. (29.04.2017)
  44. బాల రంజని, శ్రీకాకుళం, జన జాగృతి సంస్థ, పలాస వారి ఆధ్వర్యంలో శ్రీకాకుళం ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగం,   సన్మానం.(29.05.2017).
  45. తెలంగాణా సాహిత్య అకాడెమి అధ్యక్షుడు నందిని సిధారెడ్డి గారిచే తానా,      మంచి పుస్తకం సభలో సన్మానం(8.08.17)
  46. చైతన్య భారతి, గజపతినగరం వారి ఉపాధ్యాయ దినోత్సవ పురస్కారాల ప్రదానం సందర్భంగా ముఖ్య అతిథిగా సభలో ప్రసంగం, వారిచే సన్మానం(5.9.2017)
  47. విజయనగరం  వైశ్య సంఘం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ పురస్కారాల ప్రదానం సందర్భంగా ముఖ్య అతిథిగా సభలో ప్రసంగం, వారిచే సన్మానం(5.9.2017)
  48. విజయవాడ, స్వర్ణభారతి ట్రస్టులో జరిగిన ‘రైతు నేస్తం’ పురస్కారాల కార్యక్రమంలో భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు గారిచే ‘రైతు సింహాసనం’‘ పుస్తకావిష్కరణ, సన్మానం (3.10.17)
  49. సిరిసిల్లా లోని రంగినేని మోహనరావు ట్రస్ట్ వారిచే రంగినేని బాల సాహిత్య పురస్కారం(8.10.2017)
  50. అనంతపురంలో జరిగిన అయిదు ప్రపంచ రికార్డుల కవి సమ్మేళనంలో ప్రముఖ సినీ గీత రచయిత అనంత శ్రీరాం గారిచే సన్మానం (14.10.2017)
  51. లయన్స్ క్లబ్, పార్వతీపురం వారిచే  ప్రసిద్ద రచయిత్రి శ్రీమతి తనికెళ్ళ కల్యాణి స్మారక సాహితీ పురస్కారం ప్రదానం (17.11.2017)
  52. పార్వతీపురంలో జరిగిన జాతీయ బాల సాహిత్య సదస్సులో కేంద్ర సాహిత్య అకాడెమి గ్రహీతల చే సన్మానం.(17.11.2017)
  53. ప్రపంచ తెలుగు మహా సభలలో హైదరాబాదులో జరిగిన బృహత్ కవి సమ్మేళనంలో పాల్గొని తెలంగాణా ప్రభుత్వ సత్కారం స్వీకారం(18.12.17)
  54. ప్రపంచ తెలుగు మహా సభల ప్రత్యేక బాల సాహిత్య సదస్సు లో పాల్గొని బాల సాహిత్య పరిషత్ వారిచే సత్కారం పొందడం (19.12.2017)
  55. అస్తిత్వం జాతీయ సంస్థ వారిచే అస్తిత్వం జాతీయ ప్రతిభా పురస్కారం ను తెలంగాణా ప్రత్యేక సలహాదారు సముద్రాల వేణుగోపాలాచారి గారి చేతుల మీదుగా ప్రదానం (24.03.2018).
  56. భాషా సాంస్కృతిక శాఖ, విజయవాడ వారిచే  150 వ గాంధీ జయంతి ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన కథా సమ్మేళనంలో “గాంధీ మార్గం” పఠనం (4.10. 2018)
  57. కేంద్ర సాహిత్య అకాడెమీ  బాల సాహిత్య పురస్కారం 2018 "ఆనందలోకం"  బాలల నవలకు ప్రదానం (14.11.2018)
  58. రచనా సమాఖ్య, బొబ్బిలి వారిచే కళాభారతిలో నిర్వహించిన ప్రాణదాత పుస్తకావిష్కరణ సభకు ముఖ్య అతిధిగా హాజరయి సన్మానం పొందుట. (25.11.2018)
  59. తెలుగు భాషా పరిరక్షణ సమితి, శ్రీ శారదా విద్యాపీఠం విద్యాసంస్థలు విజయనగరంలో నిర్వహించిన “గురజాడ  జయంతి “ సభలో ప్రసంగం, సత్కారం (30.11.2018)
  60. ఎన్. టి .ఆర్. కాళారాధనా పీఠం, విశాఖపట్నం వారిచే  నిర్వహించిన సభలో ప్రసంగం, సత్కారం . (01. 12. 2018)
  61. శ్రీకాకుళం బాల రంజని సంస్థ నిర్వహించిన పిల్లల కార్యక్రమంలో పాల్గొని పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు కథలు వ్రాయడంలో శిక్షణ ఇచ్చి కథలు వ్రాయించి బహుమతి ప్రదానం, సత్కారం స్వీకారం (8.12.2018)
  62. సాహితీ చైతన్య కిరణాలు, తెలుగు రచయితల వేదిక, పరవస్తు చిన్నయ సూరి పీఠం, శ్రీకాకుళం వారి కవి సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయి ప్రసంగం, సత్కారం పొందుట. (9. 12. 2018)
  63. కథానిలయం సందర్శించి కథల  మాస్టారు కాళీపట్నం రామారావు గారిని కలసి వారిచే సత్కారం పొందుట (09. 12. 2018 )
  64. విజయనగరంలో నిర్వహించిన 1 వ పుస్తక మహోత్సవంలో సాహితీ స్రవంతి నిర్వహించిన సభలో బాల సాహిత్యం పై ప్రసంగం, సత్కారం (14.12. 2018)
  65.   అమరావతి విశ్వ సాహితీ, విశాఖపట్నంలో నిర్వహించిన శశిబాల బాలల కథల సంపుటి ఆవిష్కరణ సభకు ముఖ్య అతిధిగా హాజరయి బాల సాహిత్యంపై ప్రసంగం. (22. 12. 2018)
  66. సాలూరు సాహితీ మిత్ర బృందం నిర్వహించిన ఉత్తరాంధ్ర స్థాయి కథల పోటీకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించి, సభలో ప్రసంగం, సత్కారం పొందుట. (28. 12. 2018)
  67. రాజాం రచయితల వేదిక, రాజాంలో నిర్వహించిన బాలల కథా రచనా కార్యశాలలో పాల్గొని శిక్షణ ఇచ్చి బాలలచే కథలు వ్రాయించి బహుమతి ప్రదానం (30. 12. 2018)
  68. విజయనగరం అరబిందో ఆశ్రమంలో జరిగిన విజయనగరం జిల్లా రచయిత్రుల సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగం, సత్కారం (31.12. 2018)
  69. ప్రగతి యూత్ అసోసియేషన్ వారి వివేకానంద జనం దినోత్సవ వేడుకల సభలో పాల్గొని ప్రసంగించి, సత్కారం పొందుట. (12. 01. 2019)
  70. పార్వతీపురం కళింగ వైశ్య సంబరాలలో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగ, సత్కారం (17.01.2019)
  71. అనంతపురం జిల్లా చిలమత్తూరు పాఠశాల విద్యార్థులతో కథా కార్యశాల నిర్వహించి సత్కారం పొందుట (22. 01. 2019)
  72. అనంతపురం జిల్లా హిందూపూర్ పాఠశాల విద్యార్థులతో కథా కార్యశాల నిర్వహించి సత్కారం పొందుట (22. 01. 2019)
  73. అనంతపురం జిల్లా ముద్దిరెడ్డిపల్లి పాఠశాల విద్యార్థులతో కథా కార్యశాల నిర్వహించి సత్కారం పొందుట (22. 01. 2019
  74. అనంతపురం జిల్లా లేపాక్షి పాఠశాల విద్యార్థులతో కథా కార్యశాల నిర్వహించి సత్కారం పొందుట (22. 01. 2019)
  75. అనంతపురం జిల్లా చెన్నరాజుపల్లి పాఠశాల విద్యార్థులతో కథా కార్యశాల నిర్వహించి సత్కారం పొందుట (23. 01. 2019)
  76. అనంతపురం జిల్లా పుట్టపర్తి పాఠశాల విద్యార్థులతో కథా కార్యశాల నిర్వహించి సత్కారం పొందుట (23. 01. 2019)
  77. అనంతపురం జిల్లా బుక్కపట్నం పాఠశాల విద్యార్థులతో కథా కార్యశాల నిర్వహించి సత్కారం పొందుట (23. 01. 2019)
  78. అనంతపురం జిల్లా కొత్తచెరువు మండల ఆర్యవైశ్య సంఘ భవనంలో ఆర్యవైశ్య సంఘం, విశ్వ సాహితి సమితి, చిత్రావతి కళా పీఠం నిర్వహించిన సభలో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించి సత్కారం పొందుట (23. 01. 2019)
  79. విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో నారంశెట్టి బాల సాహిత్య పీఠం నిర్వహించిన ద్వితీయ పురస్కార ప్రదానోత్సవ సభకు అధ్యక్షుడిగా పాల్గొని సభా విజయం సాధించి సత్కారం పొందుట. (03.02. 2019)
  80. అమరావతి విశ్వసాహితి ఆధ్వర్యంలో డా దేవులపల్లి పద్మజ రచించిన శ్రీ కృష్ణ మనోహరం వచన శతకం ఆవిష్కరణకు విశిష్ట అతిదిగా పాల్గొని ప్రసంగం, సత్కారం (04. 02. 2019)
  81. విజయనగరం జిల్లా లక్కవరపు కోట కస్తూరి బాయి గాంధీ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కథా కార్యశాలకు ముఖ్య అతిధిగా హాజరయి ప్రసంగించి సత్కారం పొందుట. (11.02. 2019)
  82. విజయనగరం జిల్లా లక్కవరపు కోట మండల గ్రంథాలయంలో విద్యార్థులకు నిర్వహించిన కథా కార్యశాలకు ముఖ్య అతిధిగా హాజరయి ప్రసంగించి సత్కారం పొందుట. (11.02. 2019)
  83. విజయనగరం ఎస్.వి.ఎన్.లేక్ పేలస్ లో నిర్వహించిన రోటరీ ఒకేషనల్ పురస్కారాల ప్రధాన సభలో పాల్గొని ప్రతిష్ఠాత్మక పురస్కారం స్వీకారం (12. 02. 2019)
  84. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ సభ్యునిగా ప్రభుత్వం చే నియామక పత్రం స్వీకారం (13. 02. 2019) .
  85. సాలూరు సాహితీమిత్ర బృందం సాలూరులో నిర్వహించిన మాతృభాష  దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించి సత్కారం పొందుట (21. 02. 2019)
  86. బొబ్బిలి కోటలో  జరిగిన కార్యక్రమంలో బొబ్బిలి యువరాజా, మాజీ మునిసిపల్ చైర్మన్ బేబీ నాయన గారిచే సత్కారం (21.02. 2019)
  87. విజయనగరం  సన్ స్కూల్ నిర్వహించిన సయోనోరా  కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగం, సత్కార స్వీకరణ (23. 02. 2019)
  88. విజయనగరం జిల్లా కొమరాడ  మండలంలో జరిగిన యువ దినోత్సవ సభకు ముఖ్య  అతిధిగా హాజరై ప్రసంగించి సత్కారం పొందుట. ( 24. 02. 2019)
  89. కరీంనగర్  తపాలా శాఖ సూపరింటెండెంట్ శ్రీ  బాసంగి సురేష్ కుమార్ గారిచే సత్కారం (25. 02. 2019)
  90. పార్వతీపురంలో ఆర్. సి. ఎం. పాఠశాల  ఆవరణలో నారంశెట్టి బాల సాహిత్య పీఠం నిర్వహించిన అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవ సభకు ముఖ్య  అతిధిగా హాజరై ప్రసంగించి బాలబాలికలకు పుస్తక వితరణ చేయుట (01. 04. 2019)
  91. విజయనగరం జిల్లా కలెక్టర్ గారిచే నిర్వహించిన ఉగాది సంబరాలలో  కవిసమ్మేళనంలో పాల్గొని కలెక్టర్ డా. ఎం. హరిజవహర్ లాల్ గారిచే సత్కారం  పొందుట. (06. 04. 2019)
  92. విజయనగరం లోని సన్  స్కూల్ లో నిర్వహించిన ఉడాన్ కార్యక్రమానికి అతిధిగా  హాజరై ప్రసంగం, సత్కారం స్వీకారం (3. 05. 2019)
  93. పార్వతీపురంలో కళింగ వైశ్యులచే  నిర్వహించబడిన సభలో పార్వతీపురం ఎం.ఎల్. ఏ. శ్రీ అలజంగి జోగారావు గారిచే సత్కారం పొందుట. (18.06. 2019)
  94. విశాఖ సంస్కృతి మాసపత్రిక  విశాఖపట్నంలో నిర్వహించిన సప్తమ  వార్షికోత్సవ సభకు ముఖ్య  అతిధిగా హాజరై ప్రసంగం, అతిధులకు సత్కరించి సత్కారం పొందుట. (11. 08. 2019)
  95. విశాఖపట్నం పౌరగ్రంథాలయంలో నిర్వహించిన బాలబాట   పదకొండవ వార్షికోత్సవ సభకు ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించి సత్కారం  పొందుట (12. 08. 2019)
  96. విజయనగరం గీతాంజలి పాఠశాలలో తెలుగు భాషా పరిరక్షణ  సమితి నిర్వహించిన మానాప్రగడ స్మారక పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగం, సత్కారం స్వీకారం (17. 08. 2019)
  97. హిమాకర్ పబ్లికేషన్స్, హైదరాబాదు వారు నిర్వహించిన  8 పుస్తకాల ఆవిష్కరణ సభలో పాల్గొని 5 పుస్తకాలు ఆవిష్కరింపజేసుకుని సత్కారం పొందుట (31. 08. 2019)
  98. విజయనగరం గాయత్రి  పాఠశాలలో జరిగిన గురజాడ జయంతి సభలో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగం, పురస్కార గ్రహీతలకు సత్కారం (20.09. 2019 )
  99. పార్వతీపురం ఆర్. సి. ఎం. బాలికోన్నత  పాఠశాలలో జరిగిన గురుపూజోత్సవ సభకు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగం (21.09.2019)
  100. విశాఖపట్నం లోని  మురళీనగరలో అమరావతి విశ్వసాహితి  నిర్వహించిన మూడవ వార్షికోత్సవ సభలో విశిష్ట  అతిధిగా పాల్గొని ప్రత్యేక సంచిక ఆవిష్కరణ, అతిధులకు సత్కారం చేయుట. (22. 09. 2019)
  101.   సాలూరు సాహితీ  మిత్రబృందం, సాలూరులో  నిర్వహించిన గురుపూజోత్సవ  కార్యక్రమంలో ముఖ్య అతిధిగా  పాల్గొని ప్రసంగం, 7 గురువులకు  సత్కారం (13. 10. 2019)
  102. ఒడిశా రాష్ట్రం రాయగఢలో స్పందన సాహిత్య సంస్థ యొక్క  24 వ వార్షికోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరై కవిసమ్మేళనానికి సమీక్షకునిగా,  కవితల పోటీ న్యాయనిర్ణేతగా వ్యవహరించి సత్కారాలు పొందుట. (10. 11. 2019 )
  103. నారంశెట్టి బాలసాహిత్య పీఠం నిర్వహించిన  బాల సాహిత్య పురస్కార ప్రదానోత్సవ సభకు అధ్యక్షత వహించి సభా నిర్వహణ చేయుట, అనేక మంది కవులను సత్కరించటం. (14. 11. 2019)
  104. విజయనగరం కేంద్ర గ్రంథాలయంలో ఏలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు నిర్వహించిన జాతీయ  పత్రికా దినోత్సవ సభకు ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించి ఇద్దరు పత్రికా సంపాదకులకు సత్కరించటం  (16. 11. 2019)

సాహిత్య రచయితగా పాల్గొన్న వర్క్ షాపులు

మార్చు
  1. కిన్నెర ఆర్ట్ థియేటర్స్, బాల సాహిత్య పరిషత్ వారు సంయుక్తంగా నిర్వహించిన బాలల నాటికల సదస్సులో చర్చా పత్రం సమర్పణ.
  2. సాహిత్య అకాడెమీ, బెంగుళూరు శాఖ వారు విశాఖపట్నంలో నిర్వహించిన బాలల నీతి కథల సదస్సులో పాల్గొని ప్రసంగించి చర్చాపత్రం సమర్పణ. ( 15.09.2013)
  3. నేషనల్ బుక్ ట్రస్ట్ వారు విశాఖపట్నంలో నిర్వహించిన బాలసాహిత్యం సదస్సులో బాలసాహిత్యంపై ప్రసంగం. (13.04.2015)
  4. రావూరి భరద్వాజ బాలల విజ్ఞాన పీఠం, చిలకలూరు పేట వారు నిర్వహించిన బాల సాహిత్య సదస్సులో పాల్గొని ‘బాల సాహిత్యంలో రావలసిన మార్పులు’ అంశంపై చర్చా పత్రం సమర్పించుట. (05.07.2015)
  5. పిల్లల కొరకు ప్రత్యేకంగా తయారు చేయబడిన వాయిస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ “లాలి పప్” కోసం వందకు పైగా కథలు రికార్డు చేయబడ్డాయి.
  6. విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో జరిగిన గురజాడ 154 వ జయంతి సభలో గురజాడ వ్రాసిన బాలసాహిత్యం పై ప్రసంగం, పత్ర సమర్పణ (21.09.2016),
  7. నెల్లూరులో నేషనల్ బుక్ ట్రస్ట్ (భారత ప్రభుత్వం) నిర్వహించిన బాల సాహిత్య సృజన శిక్షణ కార్యశాలలో విషయ నిపుణుడిగా పాల్గొని పిల్లలకు శిక్షణ అందించుట. (9,10/11.2016)
  8. క్రియ పిల్లల పండుగ, కాకినాడలో పాల్గొని కథారచన, కథ చెప్పడం అంశాలలో పిల్లలకు తర్ఫీదు నిచ్చి పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం (25,26/02/2017)
  9. శాంతి వనం, ఒంగోలు వారు  2017 మే 25 నుండి 27 వరకు పార్వతీపురం జట్టు సేవాశ్రమంలో జరిగిన బాల సాహిత్య శిక్షణా శిబిరంలో పాల్గొని పిల్లలకు కథలు వ్రాయడంలో మెలకువలు నేర్పుట.
  10. ఏ.వి.ఎం. మునిసిపల్ ఉన్నత పాఠశాల, శ్రీకాకుళంలో 2017 జూన్ 30 నాడు నిర్వహించిన ‘బాల సాహిత్యం – ప్రయోజనాలు’ కార్యక్రమంలో  ప్రసంగం, సన్మానం .
  11.  సిరిసిల్లాలో రంగినేని మోహనరావు ట్రస్ట్ నిర్వహించిన బాల సాహిత్య శిక్షణా శిబిరంలో విషయ నిపుణుడిగా పాల్గొని పిల్లలకు కథా రచన మీద శిక్షణ (9.10.2017)
  12. . వివేకానంద కేంద్రం, కన్యాకుమారి వారు జట్టు ఆశ్రమంలో ఏర్పాటు చేసిన బాల సాహిత్య శిక్షణా కార్యశాలలో పాల్గొని కథా రచన మీద శిక్షణ ఇచ్చుట. (25.10.2017) 
  13. పార్వతీపురంలో నేషనల్ బుక్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన బాలల సృజనాత్మక కార్యశాలలో విషయ నిపుణుడుగా పిల్లలకు రచనలు చేయడంలో శిక్షణ ఇచ్చుట (14.07.2018 నుండి 16.07.2018)
  14. అనంతపురం జిల్లాలో ఏడు పాఠశాలల్లో బాలలకు కథా కార్యశాలలు ఏర్పాటు చేసి మెళకువలు నేర్పించుట.
  15. ఎస్.కోట కస్తూర్భా విద్యాలయంలో బాలికలకు కథా రచనలో మెళకువలు నేర్పించుట.
  16. ఎస్.కోట గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కథా కార్యశాలలో పాల్గొని విద్యార్థినీ విద్యార్థులకు కథా రచనలో మెళకువలు నేర్పించుట.
  17. ఇంకా నమోదు కానివి అనేకం

సాహితీ సేవలో

మార్చు
  1. మిత్ర సాహితి, సాహితీ సంస్థ, పార్వతీపురానికి సహాయ కార్యదర్శిగా (1992-99)
  2. సాహితీ లహరి సంస్థ (రిజిస్టర్డు), పార్వతీపురం వారికి జీవితకాల సభ్యుడు.
  3. బాలసాహిత్య పరిషత్ ఉపాధ్యక్షుడు
  4. తెలుగురక్షణ వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి
  5. ఉత్తరాంధ్ర రచయితల వేదిక అద్యక్షుడు
  6. నారంశెట్టి బాల సాహిత్య పీఠం అధ్యక్షుడు

సంపాదకత్వం వహించినవి

మార్చు
  1. డాక్టర్ వెలగా వెంకటప్పయ్య గారి 83వ  జన్మ దినసంచిక (2014)
  2. ‘స్పందన’ – డా మంచిపల్లి శ్రీరాములు వజ్రోత్సవ జన్మదిన ప్రత్యేక సంచిక (28.6.2017)
  3. “తెలుగు వాణి” ( నూట పదహారు మంది కవుల విరచిత కవితా సంకలనం)
  4. “అమరావతి” ( నూట యాభైమంది  కవుల విరచిత కవితా సంకలనం)
  5. “అక్షర స్వరం” (అయిదువందల యాభై అయిదు మంది కవుల విరచిత కవితా సంకలనం):

ఇతర సేవలు

మార్చు
  1. పార్వతీపురం పట్టణానికి చెందిన 110 మంది బాల సాహిత్య కారుల కథలను సేకరించి “పార్వతీపురం బాల సాహితి” పేరుతో పుస్తక ప్రచురణకు స్వీకారం.
  2. పిల్లలకోసం ప్రగతి యూత్ అసోషియేషన్, గెడ్డలుప్పి గ్రామం (సీతానగరం మండలం) వారు నిర్వహించిన వేసవి శిక్షణా శిబిరంలో పాల్గొని పిల్లలకు కథలు వ్రాయడంపై ఆసక్తి పెంచుట.
  3. నెహ్రూ బాలానంద సంఘం, లోగిశ గ్రామం (గజపతినగరం మండలం) లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పిల్లలకు కథలు వ్రాయడంపై ఆసక్తి కలిగించుట.
  4. జట్టు సేవాశ్రమం, పార్వతీపురంలో అనాథ బాలబాలికల కోసం నాలుగు లక్షలు విరాళాలు సేకరించి ‘స్వామి వివేకానంద ధ్యాన మందిరం నిర్మాణం’ చేయుటకు సహకరించుట.
  5. తోటపల్లి ప్రకృతి ఆది దేవోభవ ప్రాంగణంలో స్థాపించిన బాలల గ్రంథాలయానికి ఇరవై వేల రూపాయలు విరాళాలు సేకరించి ఇచ్చుట.
  6. తోటపల్లిలో నిర్మాణంలో ఉన్న తోటపోలమ్మ గుడి కోసం లక్షా పది వేల రూపాయలు విరాళం సేకరించి ఇచ్చుట.
  7. భక్తుల సౌకర్యార్ధం తోటపల్లి కాలువ ప్రక్కన స్నాన వాటిక నిర్మించుట (ఖర్చు సుమారు డెబ్భయి వేలు)

వ్యక్తిగత జీవితం

మార్చు

ఆయన భార్య అమ్మాజీ ఉపాధ్యాయిని. ఆయన కుమారుడు నివేష్ (M.S)(అమెజాన్ సంస్థ ఉద్యోగి ), కుమార్తె సూర్యనిఖిత (ఎం..ఎస్.) అమెజాన్ ఉద్యోగి .

వ్యక్తిగత విజయాలు:

తెలుగు రక్షణ వేదిక సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అనంతపురం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 2017 అక్టోబరులో నిర్వహించిన 5 ప్రపంచ రికార్డుల కవి సమ్మేళనం 33 గంటల 44 నిముషాల 55 సెకండ్లు నిర్వహించగా సభాధ్యక్షుడిగా వ్యవహరించి 27 గంటల కాలం సభ నిర్వహించి వ్యక్తిగత రికార్డు నెలకొల్పారు.

నారంశెట్టి బాల సాహిత్య పీఠం ద్వారా బాల సాహిత్య వ్యాప్తి:

2017 నవంబరు 17 న విజయనగరం జిల్లా పార్వతీపురంలో జాతీయ బాల సాహిత్య సదస్సు నిర్వహించారు. అదే రోజున 'నారంశెట్టి బాల సాహిత్య పీఠం' ప్రారంభించారు. సుమారు నలభై పాఠశాలల నుండి విద్యార్థినీ విద్యార్థులను రప్పించి కథా రచన, గేయ రచన, వ్యాస రచనల్లో పోటీలు నిర్వహించి సీనియర్స్, జూనియర్స్ కు బాల సాహిత్య గ్రంథాలను, ప్రశంసాపత్రాలను బహూకరించారు. అది మొదలు ఎన్నో పాఠశాలలను సందర్శించి బాల సాహిత్య వ్యాప్తికి కథా రచనలో మెళకువలు వివరించారు. పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించడానికి చక్కని బాలల కథలను వినిపించారు.

2017 లో ముగ్గురు బాల సాహితీ వేత్తలకు 'నారంశెట్టి బాల సాహిత్య పురస్కారాన్ని' ప్రదానం చేశారు. పురస్కార గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ. 5000/- నగదు, జ్ఞాపిక, సన్మాన పత్రం,శాలువాతో సత్కరించారు. 2018 లో ఇద్దరు బాల సాహితీవేత్తలను ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి ఎంపిక చేసి సత్కరించారు. 2019 సంవత్సరానికి ఇద్దరినీ ఎంపిక చేసి నవంబరు 14 బాలల దినోత్సవం రోజు పురస్కార ప్రదానం చేయనున్నట్టు ప్రకటన వెలువడింది.

మూలాలు

మార్చు
  1. బాల సాహిత్య వైశిష్ట్యం[permanent dead link]
  2. "నారంశెట్టి, మౌళిలకు అకాడమీ పురస్కారాలు".[permanent dead link]
  3. బాలసాహితీ మిత్ర January 7, 2011[permanent dead link]
  4. [1]కథానిలయంలో ఆయన కథలు
  5. నిజమైన స్నేహితుడు' పుస్తకావిష్కరణ కార్యక్రమం
  6. పిల్లల కథలు- బొమ్మలతో
  7. పిల్లలు మెచ్చే ‘మంచి పుస్తకాలు

ఇతర లింకులు

మార్చు