షహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లా

పంజాబ్ లోని జిల్లా
(సాహిబ్ భగత్ సింగ్ నగర్ జిల్లా నుండి దారిమార్పు చెందింది)

పంజాబు రాష్ట్రం లోని 22 జిల్లాలలో షహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లా ఒకటి. జిల్లా నవాంచౌర్, బంగా, బాలాచౌర్ అనే 3 ఉపవిభాగాలుగా విభజించబడి ఉంది. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య రాష్ట్రంలో 3వ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో బర్నాలా, ఫతేహ్‌గర్ సాహిబ్ జిల్లాలు ఉన్నాయి.[1]

నవాన్ షహర్ జిల్లా
ਨਵਾਂਸ਼ਹਿਰ ਜ਼ਿਲ੍ਹਾ
షహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లా
ਸ਼ਹੀਦ ਭਗਤ ਸਿੰਘ ਨਗਰ
జిల్లా
బంగాలోని గురు తేగ్ బహదూర్ గేట్
బంగాలోని గురు తేగ్ బహదూర్ గేట్
Located in the eastern part of the state
Location in Punjab, India
దేశం India
రాష్ట్రంపంజాబు
Named forకొత్త నగరం అని అర్థం. సట్లెజ్ వరదల బారి నుండి తప్పించుకునేందుకు ప్రజలు రాహోన్ పట్టణం నుండి ఇక్కడికి తరలి వెళ్ళారు.
ముఖ్య పట్టణంనవాన్‌షహర్
విస్తీర్ణం
 • Total1,266 కి.మీ2 (489 చ. మై)
జనాభా
 (2011)‡[›]
 • Total1,25,833
 • జనసాంద్రత99/కి.మీ2 (260/చ. మై.)
భాషలు
 • అధికారికపంజాబీ
Time zoneUTC+5:30 (IST)
టెలిఫోన్ కోడ్01823 for Nawanshahr and Banga
01885 for Balachaur
అక్షరాస్యత80.3%

చరిత్ర

మార్చు

గతంలో ఈ జిల్లా పేరు నవాన్‌షహర్ జిల్లా అనే పేరుతో ఉండేది. 1995 నవంబరు 7 న పంజాబు రాష్ట్రంలోని హోషియార్‌పూర్, జలందర్ జిల్లాల నుండి కొంత భూభాగం వేరు చేసి నవాన్ షహర్ పట్టణం కేంద్రంగా రాష్ట్రంలో 16 వ జిల్లాగా దీన్ని ఏర్పాటు చేసారు. నవాన్‌షహర్ పట్టణాన్ని సైనికాధికారి నౌషర్‌ఖాన్ స్థాపించాడు. గతంలో ఈ పట్టణాన్ని నౌసర్ అనేవారు. తరువాత ఇది నవాన్‌షహర్‌గా మారింది. నౌషర్ పట్టణంలో అక్బర్ వంశానికి సంబంధం ఉన్న ముస్లిం ఘోరేవా రాజపుత్రులు, జాట్ రాజపుత్ర వంశానికి చెందిన రాజపుత్రులూ ఉన్నారు.[2] షెడ్యూల్డ్ కులానికి చెందిన ప్రజలు 40% ప్రజలు ఉన్నారు.

నవాన్‌షహర్ ఎం.ఎల్.ఎ, గత కాబినెట్ మంత్రి దిల్బాగ్ సింగ్ కృషితో 1995లో నవాన్‌షహర్ జిల్లాగా రూపొందించబడింది. ఈ జిల్లా ప్రజలలో సంపన్నులు అధికంగా ఉన్నారు. ఈ జిల్లా నుండి అధిక సంఖ్యలో ప్రజలు విదేశాలలో స్థిరపడ్డారు. అందువలన అధిక మొత్తంలో లభించిన విదేశీమారకంతో జిల్లా ఆర్థికంగా అభివృద్ధి చెందింది. ఫలితంగా జిల్లాలో ఇళ్ళస్థలాల ధరలు రాష్ట్రంలోని ( లుధియానా, చండీగఢ్ జిల్లాల తరువాత) ఆకాశానికి చేరుకున్నాయి. జలంధర్, రాహన్, జైజన్ లను కలిపే రైలు మార్గంలో ఈ జిల్లా గుండా పోతుంది.

ఆరోగ్య సంరక్షణ

మార్చు

ఈ భూభాగంలో విస్తారమైన ఆరోగ్య వసతులు ఉన్నాయి. జిల్లాలో అధికసంఖ్యలో ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలు ఉన్నాయి. అంతేకాక అధునిక వసతులు కలిగి ఉన్నాయి. జిల్లాలో తగినన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, డిస్పెంసరీలు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. నవాంషహర్ ఆసుపత్రులు 64 పడుకల వసతులతో ఆధునిక వసతులు కలిగి ఉన్నాయి. బంగ, బాలాచౌర్ ఆసుపత్రులలో 30 పడకలు ఉన్నాయి. ముక్త్‌సర్, ఉరాపూర్, సుజ్జన్, సరోయా, ముజఫర్‌పూర్‌లు సకల వసతులు కలిగి ఉన్నాయి. జిల్లాలోని ప్రతిగ్రామంలో ఆరోగ్యసేవలు అందుబాటులో ఉన్నాయి. నవాన్‌షహర్, రాహన్, బాలాచౌర్‌లో పశువుల ఆసుపత్రులు కూడా ఉన్నాయి.

ప్రముఖులు

మార్చు

2008 అక్టోబరు 27న ఖత్కర్ కలాన్ (నవాన్‌షహర్) పేరును మార్చి జిల్లాకు స్వాతంత్ర్యసమర వీరుడు భగత్‌సింగ్ పేరును పెట్టలని నిర్ణయించింది. షహీద్ భగత్‌సింగ్ 101వ పుట్టినరోజున ఈ నిర్ణయాన్ని పంజాబు ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బర్నాలా ప్రకటించాడు.

రాజకీయాలు

మార్చు
  • గురుద్వారా చరణ్ కంవాల్: 6వ గురువు " హరి గోబింద్ సాహెబ్ " ఇక్కడ ఒక మాసకాలం నివసించి భగవంతుని గురించి తపసు చేసాడు.
  • మజ్రా ంసు అబాద్ : శ్రీ నాభ్ కంవాల్ రాజా సాహిబ్ తపదుచేసిన ప్రదేశం.
  • గురుద్వారా నానక్సర్ (హకింపూర్), గురుద్వారా శ్రీ హర్గోబింద్ సాహిబ్ (లరోరా), రోజా షరీఫ్ మంధలి, పీర్ గులామీ షాహ్ (బంగ)
  • అకాలీ బబ్బర్ ఉద్యమం నడిపించిన నాయకులలో ఒకడైన " సాహెబ్ బబ్బర్ కరం సింగ్ " .
  • క్రీ.శే మాస్టర్ సుదాగర్ సింగ్ ధిండ్సా: బంగా సిఖ్ మిషనరీలలో ఒకడు. సాంఘిక కార్యకర్త. 1999లో " గురుద్వారా కంవల్ లంగర్ హాల్"కు పునాది వేసాడు.
  • ప్రఖ్యాత గురుద్వారా " గురుద్వారా తాలి సాహెబ్ " హోషియార్‌పూర్ రహదారిలో ఉంది. బాబా ష్రీ చంద్ (మొదటి గురువు గురునానక్ కుమారుడు) ఇక్కడ నివసించిన కాలంలో ఈ గురుద్వారా నిర్మించబడింది.
  • ప్రఖ్యాత గురుద్వారా మంజి సాహిబ్ ( షిరి గురువు తెగ్ బహదూర్) జలంధర్ రహదారిలో ఉంది.
  • కీ.శే కుల్జిత్ సింఘ్ ధింషా అడ్వొకేట్: ప్రఖ్యాత సాంఘిక సంస్కర్త, కర్మచారిదళ్ కౌంసిల్ స్థాపకుడు. ఈ జిల్లాకు చెందిన వాడే [3][4]

భౌగోళికం

మార్చు

నవాన్‌షహర్ జిల్లా 31°48′N 76°42′E / 31.8°N 76.7°E / 31.8; 76.7.[5] వద్ద ఉంది.

ప్రాంతాలవారీగా జనసంఖ్య

మార్చు
  • మొత్తం ప్రాంతం వైశాల్యం 1,258 చ.కి.మీ[6]
  • మొత్తం జనసంఖ్య (2001 గణాంకాలు) 587,468 చ.కి.మీ [6]
  • పురుషుల సంఖ్య 306,902[6]
  • స్త్రీల సంఖ్య 280,566[6]
  • స్త్రీలు: పురుషులు 913: 1000 : 913[6]
  • జనసాంద్రత చ.కి.మీకు 439 [6]
  • (1991–2001) మద్య కాలంలో జనసంఖ్య పెరుగుదల 10.43.%[6]

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 614,362, [1]
ఇది దాదాపు. సొలోమన్ ఐలాండ్స్ దేశ జనసంఖ్యకు సమానం.[7]
అమెరికాలోని. వర్మొంట్ నగర జనసంఖ్యకు సమం.[8]
640 భారతదేశ జిల్లాలలో. 522 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 479 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 4.58%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 954:1000, [1]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 80.3%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

ప్రముఖ వ్యక్తులు

మార్చు
  • చౌదరి రహమత్ ఆలీ (ముస్లిం మతం నేషనలిస్ట్)
  • జాజీ బి (పంజాబీ గాయకుడు)
  • బి.ఆర్ చోప్రా (సినిమా దర్శకుడు, నిర్మాత)
  • యష్ చోప్రా (సినిమా దర్శకుడు, నిర్మాత)
  • అమ్రీష్ పురి (భారతీయ సినీ నటుడు)
  • మదన్ పురి (భారతీయ నటుడు)
  • ముహమ్మద్ జహూర్ ఖయ్యాం (భారత సంగీత దర్శకుడు)
  • సుఖ్షిందర్ షిండా (పంజాబీ గాయకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత)

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. Gazetteer of the Hoshiarpur District (1883-4) (p. 56), when Mughal Emperor, Akbar, took in marriage the daughter of Mahr Mitha, a Jat of the Manjha, 35 principal families of Jats contenanced the marriage and sent representatives to Delhi. Thereafter, the the 35 Jat families became known as the "Akbari Jats".
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-03. Retrieved 2014-08-25.
  4. ^ http://www.rozanaspokesman.com/epaper/fullpage.aspx?edition=district&yview=2012&mview=Jul&dview=06&pview=35 Archived 2013-07-20 at the Wayback Machine
  5. "Nawanshahr District Location". nawanshahr.nic.in. Retrieved 2007-04-15.
  6. 6.0 6.1 6.2 6.3 6.4 6.5 6.6 "Nawanshahr District Census 2001". nawanshahr.nic.in. Retrieved 2007-02-13.
  7. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Solomon Islands 571,890 July 2011 est.
  8. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Vermont 625,741

వెలుపలి లింకులు

మార్చు