సింగలూరు

ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా గ్రామం

"సింగలూరు" కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలనికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

సింగలూరు
—  రెవెన్యూయేతర గ్రామం  —
సింగలూరు is located in Andhra Pradesh
సింగలూరు
సింగలూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°21′38″N 81°03′58″E / 16.360653°N 81.066057°E / 16.360653; 81.066057
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గుడ్లవల్లేరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 356
ఎస్.టి.డి కోడ్ 08674

సమీప గ్రామాలు మార్చు

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం

గ్రామానికి రవాణా సౌకర్యం మార్చు

గుడ్లవల్లేరు, పామర్రు నుండి రోడ్దురవాణా సొకర్యం ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 54 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు మార్చు

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామములోని మౌలిక సదుపాయాలు మార్చు

త్రాగునీటి సౌకర్యం మార్చు

ఈ గ్రామములో భారత వికాస పరిషత్తు ఆధ్వర్యంలో, 5 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటుచేయనున్న ఆర్.వో.ప్లాంట్ నిర్మాణానికై, 2017, మార్చి-8న శంకుస్థాపన నిర్వహించారు. [2]

ఈ పథకం నిర్మాణం పూర్తి అయినది. 2017, మే-21న ప్రారరంభించెదరు. ఏ.టి.ఎం తరహాలో కార్డు ద్వారా నీటిని అందించడం ఈ కేంద్రం ప్రత్యేకత. భారత వికాస పరిషత్తు విజయవాడ శాఖ సమన్వయంతో, ట్విల్స్ టెక్‌స్టైల్స్ ఆర్థిక వితరణతో దీనిని నిర్మించారు. గ్రామస్థులకు కార్డులను అందజేసి, నీటిశుద్ధి పథకం వద్ద ఏ.టి.ఎం యంత్రాన్ని ఏర్పాటుచేసారు. దీనిద్వారా నిర్దేశిత రుసుమును చెల్లించిన గ్రామస్థులకు, కార్డుద్వారా ఒక్కొక్కరికీ, 10 లీటర్ల శుద్ధిచేసిన మంచినీటిని మాత్రమే యంత్రం అందజేస్తుంది. [3]

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం

గ్రామ విశేషాలు మార్చు

జాతిపిత మహాత్మా గాంధీజీ జన్మదినం సందర్భంగా, ఈ గ్రామములో, 2015, అక్టోబరు-2వ తేదీనాడు, గుంటూరులోని సిబార్ దంతవైద్యశాల జాతీయ సేవా సంస్థ {ఎన్.ఎస్.ఎస్} విభాగం, ఈ గ్రామములో సేవాకార్యక్రమాలు నిర్వహించారు. వైద్య సిబ్బంది ఇంటింటి సమగ్ర ఆరోగ్య సర్వే, ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, నమోదు చేసారు. చేతుల, పరిసరాల పరిశుభ్రతలపై వివరించి ర్యాలీ నిర్వహించారు. [1]

ఈ గ్రామాన్ని, 2017,ఆగష్టు-13న, భారత వికాస పరిషత్తు యోజన గ్రామంగా ఆవిష్కరించినారు. ఈ క్రమంలో గ్రామం వద్ద ఒక బోర్డును ఏర్పాటు చేసినారు. [4]

ఈ గ్రామానికి చెందిన దంతవైద్యులు శ్రీ బండారు శ్యాంకుమార్, భాగ్య విధాత ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి, గ్రామంలో పలు అభివృద్ధి, ఐకాస, సేవా కార్యక్రమాల్ను నిర్వహించుచున్నారు. [5]

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు

[1] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-3; 27వపేజీ. [2] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017,మార్చి-9; 3వపేజీ. [3] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017,మే-21; 1వపేజీ. [4] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017,ఆగష్టు-14; 1వపేజీ. [5] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017,ఆగష్టు-28; 2వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=సింగలూరు&oldid=3549894" నుండి వెలికితీశారు