సిద్దిపేట ఐటీ టవర్

తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా, సిద్దిపేట పట్టణంలో ఉన్న ఐటీ టవర్

సిద్దిపేట ఐటీ టవర్ అనేది తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట పట్టణంలో ఉన్న ఐటీ టవర్.[1] రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ సేవలు విస్తరించాలన్న ఉద్దేశ్యంతో సిద్దిపేట పట్టణంలో 1,72,645 చదరపు అడుగుల విస్తీర్ణంలో 63 కోట్ల వ్యయంతో 718 సీటింగ్‌ కెపాసిటీతో తెలంగాణ ప్రభుత్వం జీప్లస్‌ 4 అంతస్తులతో ఈ ఐటీ టవర్‌ను నిర్మించింది.[2]

సిద్దిపేట ఐటీ టవర్
సిద్దిపేట ఐటీ టవర్ భవనం
సాధారణ సమాచారం
రకంఐటీ టవర్
ప్రదేశంసిద్దిపేట, తెలంగాణ
నిర్మాణ ప్రారంభం2023, జూన్ 15
వ్యయం45 కోట్లు
యజమానితెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ
సాంకేతిక విషయములు
నేల వైశాల్యం172,645 sq ft (16,039.2 m2)

శంకుస్థాపన మార్చు

2020, డిసెంబరు 10న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ ఐటీ టవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాడు.[3] అదేరోజున కొన్ని కంపెనీల (జోలాన్‌ టెక్నాలజీ, విసాన్‌ టెక్‌, ఎంబ్రోడ్స్‌ టెక్నాలజీ, సెట్విన్‌) ప్రతినిధులతో ఒప్పందాలపై ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సంతకాలు చేశాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రోడ్లు భవనాల శాఖామంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తదితరులు పాల్గొన్నారు.

నిర్మాణం మార్చు

సిద్దిపేట పట్టణంలో రాజీవ్ రహదారి సమీపంలోని దుద్దెడలో 668 సర్వే నంబర్‌లోని 3 ఎకరాలలోని ఈ ఐటీ టవర్‌ భవనం ఏరియా 1,72,645 చదరపు అడుగులు కాగా, మొదటి అంతస్తు 28,783 ఎచదరపు అడుగులు, రెండవ అంతస్తు 17,750 చదరపు అడుగులు (సీటింగ్‌ కెపాసిటీ 256), మూడో అంతస్తు 17,750 చదరపు అడుగులు (సీటింగ్‌ కెపాసిటీ 206), నాలుగో అంతస్తు 16,680 చదరపు అడుగులు (సీటింగ్‌ కెపాసిటీ 256)గా నిర్మించబడింది.[4]

ప్రారంభం మార్చు

2023, జూన్ 15న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు కలిసి ఈ ఐటీ టవర్‌ను ప్రారంభించి, అందులోని వివిధ కంపెనీల్లో ఎంపికైనవారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[5][6]

కార్యకలాపాలు మార్చు

2023, జూన్ 13న నిర్వహించిన మెగా జాబ్‌మేళాలో ఓఎస్‌ఐ డిజిటల్‌ (244 ఉద్యోగాలు ), ఫిక్సిటీ టెక్నాలజీస్‌ (100), అమిడాయ్‌ ఎడ్యుటెక్‌ (80), జోలాన్‌ టెక్‌ (25), విజన్‌ ఇన్ఫో టెక్‌ (25), థోరాన్‌ టెక్నాలజీస్‌ (25), బీసీడీసీ క్లౌడ్‌ సెంటర్స్‌ (03), ర్యాంక్‌ ఐటీ సర్వీసెస్‌ (25), కామ్‌సీఎక్స్‌ ఐటీ (25), ఎంఎస్‌పీఆర్‌ (25), అమృత సిస్టమ్‌ (25), ఇన్నోసోల్‌ (25) వంటి కంపెనీలు 718 మందిని ఎంపిక చేసుకున్నాయి. జూన్ 15న ఐటీ టవర్‌ ప్రారంభించిన వెంటనే కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయి. జాబ్‌మేళాలో ఉద్యోగాలు పొందినవారికి తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్) సంస్థ ద్వారా శిక్షణ అందిస్తారు. సిద్దిపేట ఐటీ టవర్‌లో భాగస్వామ్యం అయ్యేందుకు వచ్చిన కంపెనీలకు రెండు సంవత్సరాలపాటు నిర్వహణ, అద్దె, విద్యుత్తు, ఇంటర్నెట్‌ ఉచితంగా అందిస్తున్నారు.[7]

మూలాలు మార్చు

  1. Mayabrahma, Roja (2020-12-06). "Telangana: New IT tower to come up in Siddipet". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2020-12-06. Retrieved 2023-06-12.
  2. "IT tower with 1K job potential ready at Telangana's Siddipet". The New Indian Express. 2023-06-11. Archived from the original on 2023-06-12. Retrieved 2023-06-12.
  3. Telugu, TV9 (2020-12-10). "CM KCR Siddipet tour: సిద్ధిపేట పేదల కల నెరవేరబోతోంది.. అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం". TV9 Telugu. Archived from the original on 2023-06-12. Retrieved 2023-06-12.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. telugu, NT News (2023-05-26). "సిద్దిపేట ఐకాన్ ఐటీ ట‌వ‌ర్‌". www.ntnews.com. Archived from the original on 2023-05-26. Retrieved 2023-06-12.
  5. Naidu, Muvva Krishnama. "IT tower in Siddipet | తెలంగాణలో ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలు". Hindustantimes Telugu. Archived from the original on 2023-06-15. Retrieved 2023-06-15.
  6. "Minister KTR - ఐటీ ట‌వ‌ర్ ఏర్పాటుతో 1500మందికి ఉపాధి". Prabha News. 2023-06-15. Archived from the original on 2023-06-15. Retrieved 2023-06-15.
  7. telugu, NT News (2023-06-15). "Minister KTR | సిద్దిపేట‌లో టీ హ‌బ్ ఏర్పాటు చేస్తాం : మంత్రి కేటీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-06-15. Retrieved 2023-06-15.

వెలుపలి లంకెలు మార్చు