సిద్దిపేట పట్టణ మండలం

తెలంగాణ, సిద్దిపేట జిల్లా లోని మండలం

సిద్దిపేట పట్టణ మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట జిల్లాకు చెందిన మండలం.[1].ఈ మండలం మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలోని, సిద్ధిపేట శాసనసభ నియోజకవర్గం లలో భాగం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం సిద్ధిపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో 12   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. సిద్దిపేట, ఈ మండలానికి కేంద్రం.

సిద్దిపేట పట్టణ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, సిద్దిపేట పట్టణ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, సిద్దిపేట పట్టణ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, సిద్దిపేట పట్టణ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°06′N 78°51′E / 18.10°N 78.85°E / 18.10; 78.85
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సిద్దిపేట
మండలం సిద్దిపేట (పట్టణ)
ప్రభుత్వం
 - సర్పంచి
వైశాల్యము
 - మొత్తం 140 km² (54.1 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 1,40,075
 - పురుషుల సంఖ్య 69,500
 - స్త్రీల సంఖ్య 70,575
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

మెదక్ జిల్లా నుండి మార్పు

మార్చు

లోగడ సిద్ధిపేట పట్టణ మండలం మెదక్ జిల్లా, సిద్ధిపేట రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా, సిద్ధిపేట మండలాన్ని కొత్తగా ఏర్పడిన సిద్ధిపేట జిల్లా, సిద్ధిపేట రెవెన్యూ డివిజను పరిధిలోకి ఈ మండలాన్ని12 (1+11) గ్రామాలుతో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1] 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 140 చ.కి.మీ. కాగా, జనాభా 140,075. జనాభాలో పురుషులు 69,500 కాగా, స్త్రీల సంఖ్య 70,575. మండలంలో 31,985 గృహాలున్నాయి.[3]

మండలంలోని పట్టణాలు

మార్చు
  • సిద్ధిపేట (ఎమ్) ఇది క్లాస్ 2 హోదా మున్సిపాలిటీ.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. తడకపల్లి
  2. ఎన్సాన్‌పల్లి
  3. బూరుగుపల్లి
  4. మిట్టపల్లి
  5. పొన్నాల
  6. నాచర్‌పల్లి
  7. బక్రి చెప్యాల
  8. ఇమాంబాద్
  9. సిద్దిపేట
  10. నర్సాపూర్
  11. మందపల్లి
  12. వెల్కటూరు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Siddipet.pdf
  2. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. "Alphabetical List of Towns and their Population" (PDF). www.censusindia.gov.in. Archived from the original (PDF) on 2011-05-20. Retrieved 2013-03-04.

వెలుపలి లంకెలు

మార్చు