షేక్ బేపారి రహంతుల్లా

శశిశ్రీ అనే కలం పేరుతో పేరొందిన షేక్ బేపారి రహంతుల్లా కడపలో ఆకాశవాణి, దూరదర్శన్ ల విలేఖరి. ఆశుకవి, రచయిత, సీనియర్ జర్నలిస్టు, వక్త. సిద్ధవటం గ్రామస్థులు.

జీవిత విశేషాలు మార్చు

ఇతడు 1952, డిసెంబరు 6న కడప జిల్లా, సిద్ధవటం గ్రామంలో సలీమాబీ, రసూల్ దంపతులకు జన్మించాడు[1]. పుట్టపర్తి నారాయణాచార్యుల వద్ద తెలుగు పంచ మహాకావ్యాలు, సంస్కృత కావ్యం భామినీవిలాసం అభ్యసించాడు. వై.సి.వి.రెడ్డి, గజ్జల మల్లారెడ్డి, కేతు విశ్వనాథరెడ్డి మొదలైన వారివద్ద అభ్యుదయ సాహిత్యం అధ్యయనం చేశాడు. బి.ఏ., బి.ఎల్., ఎం.ఏ. చదివాడు. 1975 – 1980 లో మనోరంజని లిఖిత మాసపత్రికను నడిపాడు. 1995 నుంచి సాహిత్యనేత్రం పత్రికను నడిపాడు. దూరదర్శన్, ఆకాశవాణిల విలేకరిగా పనిచేశాడు. యోగి వేమన విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యునిగా పనిచేశాడు. అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్రకార్యవర్గ సభ్యుడిగా ఉన్నాడు.

రచనలు మార్చు

ఇతడు వంద కథలు, రెండు వందల సాహిత్యవ్యాసాలు, 60 పాటలు, 20కి పైగా గ్రంథాలు రచించాడు. 50 సాహిత్యపరమైన ఇంటర్వ్యూలు చేశాడు. ఆంధ్రజ్యోతి, ప్రజాసాహితి, నవ్య, ఆంధ్ర జనత, చుక్కాని, సాహిత్యనేత్రం, కథాంజలి మొదలైన పత్రికలలో ఇతని రచనలు ప్రచురింపబడ్డాయి. ఇతని రచనలు ఆంగ్లం, హిందీ, కన్నడ, ఉర్దూ, మలయాళ భాషలలోకి అనువాదమయ్యాయి.

వచనకావ్యాలు మార్చు

  1. పల్లవి
  2. శబ్దానికి స్వాగతం
  3. జేబులో సూర్యుడు
  4. కాలాంతవేళ

పద్యకావ్యం మార్చు

  1. సీమగీతం

వ్యాస సంపుటాలు మార్చు

  1. చూపు

కథా సంపుటాలు మార్చు

  1. దహేజ్
  2. రాతిలో తేమ
  3. టర్న్స్ ఆఫ్ లైఫ్
  4. రాతిపూలు

చరిత్ర మార్చు

  1. మనకు తెలియని కడప
  2. పుట్టపర్తి నారాయణాచార్య (కేంద్ర సాహిత్య అకాడెమీకి వ్రాసిన మోనోగ్రాఫ్)

కథలు మార్చు

కథానిలయంలో లభిస్తున్న కథల జాబితా:[2]

  1. అలికిడి
  2. ఆత్మబంధువు
  3. ఇజ్జత్
  4. ఒక్క మాట
  5. కంకర్
  6. కన్నీటి ధారలు
  7. కలిమిలేములు
  8. చీకటిపాడిన వెలుతురుపాట
  9. దహేజ్
  10. ధర్మరాజు
  11. నదికెపాల్
  12. రాతిలో తేమ[3]
  13. వలీమా
  14. షేక్ హ్యాండ్
  15. సూపర్ డీలక్స్
  16. స్వార్థం మొదలైనవి.

పురస్కారాలు, సత్కారాలు మార్చు

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారభాషాసంఘం వారిచే రెండు పర్యాయాలు భాషాపురస్కారం
  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చే ఉగాది విశిష్ట సాహిత్య పురస్కారం
  • పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే పట్టాభి రామిరెడ్డి లిటరరీ అవార్డు
  • కొండేపూడి శ్రీనివాసరావు సాహిత్య పురస్కారం.[4]
  • ఉత్తమ ఎలెక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అవార్డు
  • యూనిసెఫ్ అవార్డు
  • ఎం.వి.గుప్తా ఫౌండేషన్ (ఏలూరు) ప్రత్యేక అవార్డు
  • ఉత్తమ సాహిత్య సంపాదకుడు అవార్డు

మరణం మార్చు

ఇతడు 2015, ఏప్రిల్ 1వ తేదీ బుధవారం నాడు కేన్సర్ వ్యాధితో బాధపడుతూ కడప పట్టణంలో మరణించాడు.[5]

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. సి.శివారెడ్డి (2015-04-02). "రహమతుల్లా నుండి శశిశ్రీ వరకు". సాక్షి. Archived from the original on 2016-03-06. Retrieved 2 April 2015.
  2. వెబ్ మాస్టర్. "రచయిత: శశిశ్రీ". కథానిలయం. కథానిలయం. Retrieved 2 April 2015.
  3. శశిశ్రీ. "రాతిలో తేమ". కథాజగత్. కోడీహళ్లి మురళీమోహన్. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 2 April 2015.
  4. పెనుగొండ లక్ష్మీనారాయణ (జనవరి 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284.
  5. "ప్రముఖ కవి శశిశ్రీ కన్నుమూత". ఆంధ్రభూమి. 2015-04-01. Retrieved 1 April 2015.