సిద్ధాపూర్ జలాశయం

సిద్ధాపూర్ జలాశయం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, వర్ని మండలం, సిద్ధాపూర్ గ్రామ సమీపంలో నిర్మించబడుతున్న జలాశయం. సిద్ధాపూర్ సమీపంలోని మూడు చెరువుల ఉన్నతీకరణతోపాటు కెనాల్స్‌ ద్వారా 10వేల ఎకరాలకు సాగునీటి సరఫరా ఏర్పాటుకు 119.41 కోట్ల రూపాయలతో ఈ జలాశయం నిర్మాణం జరుగుతోంది.[1]

సిద్ధాపూర్ జలాశయం
సిద్ధాపూర్ జలాశయం శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు
ప్రదేశంసిద్ధాపూర్, వర్ని మండలం, నిజామాబాద్ జిల్లా
స్థితినిర్మాణంలో ఉంది
యజమానితెలంగాణ ప్రభుత్వం
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంబ్యారేజి
జలాశయం
సృష్టించేదిసిద్ధాపూర్ జలాశయం
మొత్తం సామర్థ్యం409.56 ఎంసీఎఫ్‌టీ
విద్యుత్ కేంద్రం
నిర్వాహకులుతెలంగాణ రాష్ట్రం
Typeజలాశయం

ప్రారంభం మార్చు

పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2018లో ఈ జలాశయం నిర్మాణానికి కార్యాచరణ రూపొందించగా, పరిపాలన అనుమతులతోపాటు 119.41 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి. 2022, ఫిబ్రవరి 16న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఐటి-పురపాలక శాఖామంత్రి కెటీఆర్, రోడ్లు-భవనాల శాఖామంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ జలాశయం పనులకు శంకుస్థాపన చేశారు.[2][3] ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాదు జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[4]

సామర్థ్యం మార్చు

409.56 ఎంసీఎఫ్‌టీ సామర్థ్యంతో ఈ సిద్ధాపూర్‌ జలాశయం నిర్మించనున్నారు.

రూపకల్పన మార్చు

అటవీ ప్రాంతంలో కేవలం 614 ఎకరాల ఆయకట్టు కలిగిన చద్మల్‌, పైడిమల్‌, నామ్‌కల్‌ చెరువులను ఒకేచోట కలిపి జలాశయంగా మార్చబోతున్నారు. వర్షాధారంగా వచ్చే నీటిని నిల్వ చేయడంతోపాటు వర్షాభావ పరిస్థితులు తలెత్తిన సమయంలో ప్యాకేజీ-22 ద్వారా సిద్ధాపూర్‌ జలాశయంను కలుపుతున్నారు. దీనికి దాదాపు 3.6 కిలో మీటర్ల పొడవులో ఆనకట్ట నిర్మించబడుతోంది. ఈ జలాశయం ద్వారా నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోని గిరిజన తండాలకు సాగునీరు సమకూరుతుంది. మంజూరైన మొత్తం నిధులలో జలాశయం పనుల కోసం రూ.72.52 కోట్లు, గ్రావిటీ ద్వారా కెనాల్స్‌ నిర్మాణం చేపట్టేందుకు రూ.46.89 కోట్లను ఉపయోగించనున్నారు.

ఇతర వివరాలు మార్చు

ఈ జలాశయం ద్వారా సాగునీరు అందించబడే గ్రామాల వివరాలు:

క్ర.సం మండలం గ్రామాలు ఎకరాలు
1 వర్ని మండలం శ్యామ్‌రావు తండా, కోకల్‌దాస్‌ తండా, చెల్క తండా, చింతల్‌పేట తండా, గుంటూర్‌ క్యాంప్‌, పైడిమల్‌ తండా 1900
2 బాన్సువాడ మండలం సంగ్రామ్‌నాయక్‌ తండా, అవాజ్‌పల్లి, కిమ్యానాయక్‌ తండా, పులిగుండు తండా, సోమాలినాయక్‌ తండా, గోపాల్‌ తండా 4,400
3 నస్రుల్లాబాద్‌ మండలం హాజీపూర్‌, సంగం 1000
4 గాంధారి మండలం గౌరారం, సక్రామ్‌ తండా, సర్వాపూర్‌, అలుగు తండా, కంచరాయ్‌ తండా, హేమ్లా నాయక్‌ తండా, మొండిసడక్‌ తండా, గండివేట్‌ తండా 2,700

మూలాలు మార్చు

  1. telugu, NT News (2022-02-11). "ట్రైబల్ రిజర్వాయర్‌". www.ntnews.com. Archived from the original on 2022-02-16. Retrieved 2022-02-16.
  2. telugu, NT News (2022-02-16). "సిద్దపూర్ రిజర్వాయర్‌ పనులకు శంకుస్థాపన చేసిన స్పీకర్, మంత్రులు". www.ntnews.com. Archived from the original on 2022-02-16. Retrieved 2022-02-16.
  3. "KTR: 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే: కేటీఆర్‌". EENADU. 2022-02-16. Archived from the original on 2022-02-16. Retrieved 2022-02-16.
  4. "సిద్ధాపూర్‌ రిజర్వాయర్‌కు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన". Sakshi. 2022-02-16. Archived from the original on 2022-02-16. Retrieved 2022-02-16.