ప్రధాన మెనూను తెరువు

పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణా రాష్ట్ర తొలి వ్యవసాయ శాఖామంత్రి. తెలంగాణా రాష్ట్ర సమితికి చెందిన రాజకీయ నాయకుడు.

పోచారం శ్రీనివాసరెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సభాధిపతి
పదవీ కాలము
2018 - ప్రస్తుతం
నియోజకవర్గము బాన్సువాడ

వ్యక్తిగత వివరాలు

జననం (1949-02-10) 1949 ఫిబ్రవరి 10
బాన్స్‌వాడ,నిజామాబాదు జిల్లా
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
సంతానము ముగ్గురు కుమారులు
నివాసము బాన్స్‌వాడ,నిజామాబాదు జిల్లా
మతం హిందూ
జూన్ 3, 2014నాటికి మూలం [1][2]

నిజామాబాద్ జిల్లా, బాన్సువాడ ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో, తెలుగు దేశం పార్టీ హయాంలో పంచాయతీరాజ్, గృహనిర్మాణం, గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. తొలుత భారత జాతీయ కాంగ్రేసు పార్టీలో ఉన్న శ్రీనివాసరెడ్డి, 1984లో తెలుగు దేశం పార్టీలో చేరాడు[1] తెలుగు దేశం ప్రభుత్వంలో ఈయన రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేశాడు[2] 27 ఏళ్ల పాటు తెలుగుదేశంలో ఉన్న ఈయన తెలంగాణపై అప్పటి తెలుగు దేశం పార్టీ నాయకత్వం యొక్క ధోరణి నచ్చక పార్టీకి రాజీనామా చేసి తెలంగాణా రాష్ట్ర సమితిలో చేరారు. 1949 ఫిబ్రవరి 10న జన్మించిన శ్రీనివాసరెడ్డికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు క్యాబినెట్‌లో వ్యవసాయం, ఉద్యానవనాలు, పట్టుపరిశ్రమ, పశు సంవర్ధకం, మత్య్స, పాడిపరిశ్రమాభివృద్ధి, విత్తనాభివృద్ధి శాఖలు దక్కాయి.

అతను తెలంగాణలో వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం స్థితిగతులపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘానికి అధ్యక్షునిగా వ్యవహరించాడు.

వ్యక్తిగత జీవితంసవరించు

ఈయనకు భార్య, ముగ్గురు కుమారులు.

మూలాలుసవరించు