సిద్ధార్థ్ లూథ్రా
సిద్ధార్థ్ లూథ్రా (హిందీ: सिद्धार्थ लूथरा; జననం 1966 ఫిబ్రవరి 16) భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో సీనియర్ న్యాయవాది. జూలై 2012లో, ఆయన సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమితుడయ్యాడు.[1] ప్రాథమిక హక్కులు, ఎన్నికల సంస్కరణలు, క్రిమినల్ చట్టం, విధాన సమస్యలకు సంబంధించిన విషయాలలో కేంద్ర, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహించాడు.[2][3] ఆయన మే 2014లో ఈ పదవికి రాజీనామా చేశాడు. ఆయన తండ్రి కె.కె. లూథ్రా, సోదరుడు గీతా లూథ్రా ఇద్దరూ సీనియర్ న్యాయవాదులే.[4][5]
సిద్ధార్థ్ లూథ్రా | |
---|---|
జననం | 1966 ఫిబ్రవరి 16 |
విద్యాసంస్థ | క్యాంపస్ లా సెంటర్, ఫ్యాకల్టీ ఆఫ్ లా, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ (ఎం.ఫిల్.) |
వృత్తి | సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో సీనియర్ న్యాయవాది |
క్రిమినల్ లా, వైట్ కాలర్ నేరాలు, సైబర్ మోసాలలో వాదనలు వినిపించడంలో ఆయనకు గొప్ప నైపుణ్యం ఉంది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో ఆయన 1990లో తన ఎల్.ఎల్.బి డిగ్రీ పూర్తి చేసాడు. ఆ తరువాత ఇంగ్లాండు వెళ్ళి 1991లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి క్రిమినాలజీలో ఎంఫిల్ చేసాడు.[6] 2015లో, ఆయనకు నోయిడాలోని అమిటీ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఆఫ్ లాను ప్రదానం చేసింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై దాఖలు అయిన పరువు నష్టం దావాలో ఆయన మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి దివంగత అరుణ్ జైట్లీ తరపున వాదించాడు.[7]
ఆయన ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యుడు. అలాగే ఇండియన్ క్రిమినల్ జస్టిస్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ కూడా. ఆయన ఢిల్లీ లా టైమ్స్, ఢిల్లీ రిపోర్టెడ్ జడ్జిమెంట్స్ అనే రెండు భారతీయ న్యాయ పత్రికల సలహా బోర్డులో కూడా ఉన్నాడు. ఆయన తన కేసులలో దాదాపు 30 నుండి 40 శాతం వరకు ఉచితసేవ(pro bono)లకు అంకితం చేశాడు.[8]
వ్యాజ్యంతో పాటు, ఆయన దేశవిదేశాలలో వివిద విశ్వవిద్యాలయాలలో న్యాయశాస్త్రం బోధిస్తాడు కూడా. ఆయన యునైటెడ్ కింగ్‌డమ్‌లోని న్యూకాజిల్‌లోని నార్తంబ్రియా విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా,[9] మఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని అమిటీ యూనివర్సిటీలో గౌరవ ప్రొఫెసర్‌గా ఉన్నారు.
విద్యాభ్యాసం
మార్చుసిద్ధార్థ్ లూథ్రా ఢిల్లీలోని ఆర్.కె పురంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఆ తర్వాత 1987లో హిందూ కళాశాల నుండి గణితశాస్త్రంలో బిఎ పూర్తిచేసాడు.[10] ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని లా ఫ్యాకల్టీ ప్రతిష్టాత్మక క్యాంపస్ లా సెంటర్ నుండి 1990లో న్యాయ పట్టా పొందాడు. ఆ తర్వాత క్రిమినాలజీలో ఎంఫిల్ చదివేందుకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్లాడు. ఆయన కేంబ్రిడ్జ్ కామన్వెల్త్ ట్రస్ట్ ఫెలో మెంబర్.[2][3]
కెరీర్
మార్చుదేశంలోని అగ్రశ్రేణి క్రిమినల్ లాయర్లలో ఒకరైన సిద్ధార్థ్ లూథ్రా మూడు దశాబ్దాలుగా న్యాయవాద వృత్తిని కొనసాగిస్తున్నాడు.[11][12] ఆయన 1991లో బార్‌లో చేరాడు. ఆయన సివిల్ లా ప్రాక్టీస్ చేసే భాసిన్ & కోలో పని చేయడం ప్రారంభించాడు. 1993లో, ఆయన తన తండ్రి ఛాంబర్‌లోకి మారాడు, అయితే సివిల్ లానే కొనసాగించాడు. 1996–97లో ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం కూడా బోధించాడు.[13]
ఆయన తండ్రి 1997లో మరణించిన తర్వాత, దివంగత సీనియర్ న్యాయవాది పిఆర్ వకీల్ మార్గదర్శకత్వంలో ఆయన తనను తాను క్రిమినల్ లాయర్‌గా తిరిగి ఆవిష్కరించుకున్నాడు. అతని తండ్రి ప్రాక్టీస్‌ను కొనసాగిస్తున్నాడు.[14]
తెహల్కా కేసు
మార్చు2002లో, ఆపరేషన్ వెస్ట్ ఎండ్ స్టింగ్ ఆపరేషన్ తర్వాత ఏర్పాటైన జస్టిస్ వెంకటస్వామి కమిషన్ ముందు ఆయన తెహెల్కా మ్యాగజైన్ తరపున నిలిచాడు. కమిషన్ విచారణ సందర్భంగా అప్పటి కేంద్ర రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌ను క్రాస్ ఎగ్జామినేషన్ చేసాడు.[15]
సీనియర్ న్యాయవాది
మార్చుఆయన 2004 నుండి 2007 వరకు సీనియర్ ప్యానెల్ న్యాయవాదిగా ఢిల్లీ హైకోర్టులో భారత ప్రభుత్వం తరపున విధులు నిర్వర్తించాడు. ఆ తరువాత 2007లో ఆయన సీనియర్ న్యాయవాదిగా నియమించబడ్డాడు, ఈ పదవి హైకోర్టు న్యాయమూర్తులలో అసాధారణమైన ప్రతిభ ఆధారంగా ప్రదానం చేశారు. ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీస్ చేసే ఆయన 2010లో భారత సుప్రీంకోర్టుకు మారాడు.[16]
జస్టిస్ సౌమిత్ర సేన్ కేసు
మార్చుజస్టిస్ సౌమిత్ర సేన్ కేసులో న్యాయమూర్తుల విచారణ కమిటీకి ఆయనను భారత ప్రభుత్వం 2009లో న్యాయవాదిగా నియమించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4) (ప్రొవిసో (బి) నుండి ఆర్టికల్ 217(1) వరకు చదవండి) ప్రకారం జస్టిస్ సేన్ తప్పుగా ప్రవర్తించినట్లు కమిటీ నిర్ధారించింది.[17]
ఫేస్‌బుక్ కేసు
మార్చు2011 డిసెంబరులో, ఫేస్‌బుక్, గూగుల్, యాహూలతో సహా భారతదేశంలోని 21 సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లకు వ్యతిరేకంగా జర్నలిస్ట్ వినయ్ రాయ్ ప్రారంభించిన క్రిమినల్ విచారణ కోసం ఆయనను ఫేస్‌బుక్ నియమించుకుంది.[18]
అదనపు సొలిసిటర్ జనరల్
మార్చు2012లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆయనను అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ)గా నియమించింది.
తెలుగు రాష్ట్ర్రాలలో
మార్చు- 2016లో, 2015 నోటుకు ఓటు కుంభకోణం కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తరపున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించాడు.[19] 2016 డిసెంబరు 9న, హైదరాబాదులోని తెలంగాణ హైకోర్టు నోటుకు ఓటు కుంభకోణం కేసులో నారా చంద్రబాబునాయుడు పాత్రపై విచారణ జరపాలని తెలంగాణ అవినీతి నిరోధక శాఖను ఆదేశించిన ప్రత్యేక అవినీతి నిరోధక బ్యూరో (ఎసిబి) కోర్టు జారీ చేసిన ఉత్తర్వును కొట్టివేసింది.[20]
- 2023లో, ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరపున అవినీతి నిరోధక శాఖ కోర్టులో 2023 సెప్టెంబరు 10న సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించాడు.[21]
మూలాలు
మార్చు- ↑ "Who Is Luthra : చంద్రబాబు తరపున వాదిస్తున్న సిద్ధార్థ్ లూథ్రా ఎవరు.. బ్యాగ్రౌండ్, ఫీజు కథేంటి..!? | siddharth luthra the lawyer for chandra babu is an experienced lawyer yvr". web.archive.org. 2023-09-10. Archived from the original on 2023-09-10. Retrieved 2023-09-10.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ 2.0 2.1 "Breaking: Senior counsel Sidharth Luthra accepts ASG appointment". Legally India. 6 July 2012. Retrieved 21 May 2013.
- ↑ 3.0 3.1 "The Debrief: ASG Sidharth Luthra on creativity, criminals, success and tea with kindly judges". Legally India. 1 August 2012. Archived from the original on 3 మే 2013. Retrieved 21 May 2013.
- ↑ Nangia, Tarun (January 15, 2020). "Siddharth Luthra and his mother". NewsX. Archived from the original on 15 జనవరి 2020. Retrieved 12 February 2021.
- ↑ Singh, Nandita (October 20, 2018). "The LSR graduate who's a lawyer representing both MJ Akbar and Tarun Tejpal". The Print. Retrieved 11 February 2021.
- ↑ "Criminal law is a great career option for students: Sidharth Luthra". Hindustan Times. 29 May 2015. Retrieved 30 November 2016.
- ↑ "Arun Jaitley files defamation case against Kejriwal, next hearing on January 5". India Today. 21 December 2015. Retrieved 1 December 2016.
- ↑ "How much do Delhi's top advocates charge?". Livemint. 16 September 2015. Retrieved 30 November 2016.
- ↑ "Single Mothers, Absent Fathers and the Best Interests of the Child – Drawing a Fine Balance in the ABC Case: Sidharth Luthra and Viraj Gandhi". Oxford Human Rights Hub Blog. 16 July 2015.
- ↑ "The Debrief: ASG Sidharth Luthra on creativity, criminals, success and tea with kindly judges". Legally India. 1 August 2012. Retrieved 21 May 2013.[permanent dead link]
- ↑ "Criminal law is a great career option for students: Sidharth Luthra". Hindustan Times. 29 May 2015. Retrieved 30 November 2016.
- ↑ "How much do Delhi's top advocates charge?". Livemint. 16 September 2015. Retrieved 30 November 2016.
- ↑ "Get a Glimpse – Courting an exciting career". Livemint. 4 January 2015. Retrieved 30 November 2016.
- ↑ "The Debrief: ASG Sidharth Luthra on creativity, criminals, success and tea with kindly judges". Legally India. 1 August 2012. Archived from the original on 3 మే 2013. Retrieved 21 May 2013.
- ↑ "Tehelka trials". Frontline. 6 July 2002. Retrieved 30 November 2016.
- ↑ "Get a Glimpse – Courting an exciting career". Livemint. 4 January 2015. Retrieved 30 November 2016.
- ↑ "SC panel finds Sen guilty of misbehaviour". The Times of India. 11 November 2010. Retrieved 30 November 2016.
- ↑ "Govt sanctions prosecution of Google, Facebook". News18. 13 January 2012. Retrieved 30 November 2016.
- ↑ "HC breather for Naidu in cash-for-vote case". The Hindu. 3 September 2016. Retrieved 9 December 2016.
- ↑ "Relief to AP CM Chandrababu Naidu in cash-for-vote case". The New Indian Express. 9 December 2016. Retrieved 9 December 2016.
- ↑ "sidharth luthra: పోలీసుల గత 48 గంటల కాల్ డేటా కోర్టుకు సమర్పించాలి: లూథ్రా | sidharth luthra arguments in acb court". web.archive.org. 2023-09-10. Archived from the original on 2023-09-10. Retrieved 2023-09-10.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)