సిద్ధిక్ (దర్శకుడు)

సిద్ధిక్ ఇస్మాయిల్ (1960 ఆగస్టు 1 - 2023 ఆగస్టు 8) భారతీయ చలనచిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్, నటుడు, నిర్మాత. ఆయన ప్రధానంగా మలయాళ సినిమా రంగానికి చెందినవాడు.[1][2] ఆయన 1989లో మలయాళ చిత్రం రామ్‌జీ రావు స్పీకింగ్‌తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. స్క్రీన్‌రైటర్‌గా, అతను 1986లో మలయాళ చిత్రం పప్పన్ ప్రియప్పెట్టా పప్పన్‌తో అరంగేట్రం చేశాడు. 2020లో వచ్చిన బిగ్ బ్రదర్ చిత్రానికి ఆయనే కథ అందించడంతో పాటు, దర్శకత్వం వహించాడు. పైగా నిర్మాణ బాధ్యతతోపాటు ఈ చిత్రంలో ఆయన నటించాడు.[3]

సిద్ధిక్ ఇస్మాయిల్
జననం1960 ఆగస్టు 01
కొచ్చి, కేరళ, భారతదేశం
మరణం2023 ఆగస్టు 8(2023-08-08) (వయసు 63)
కొచ్చి, కేరళ, భారతదేశం
మరణ కారణంగుండెపోటు
జాతీయతభారతీయుడు
వృత్తి
  • చిత్ర దర్శకుడు
  • స్క్రీన్ రైటర్
  • నటుడు
  • సినిమా నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1984 – ప్రస్తుతం
జీవిత భాగస్వామి
సజిత
(m. 1984)
పిల్లలు3

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

ఆయన ఇస్మాయిల్ హాజీ, జైనాబా దంపతులకు 1960 ఆగస్టు 1న కొచ్చిలో జన్మించాడు. ఆయన కలమస్సేరిలోని సెయింట్ పాల్స్ కళాశాల పూర్వ విద్యార్థి.

కెరీర్

మార్చు

మలయాళ సినిమా ప్రముఖ దర్శకుడు ఫాజిల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆయన కెరీర్ ప్రారంభించాడు. సిద్దిక్, లాల్ ద్వయం కొచ్చిన్ కళాభవన్ ట్రూప్‌లో ప్రదర్శన ఇవ్వడం చూసిన ఫాజిల్‌కు కనిపించింది.[4] సిద్దిఖ్ తర్వాత లాల్‌తో కలిసి అనేక చిత్రాలను రూపొందించాడు. సిద్ధిక్-లాల్‌గా గుర్తింపు పొందారు.[5] వీరిద్దరూ ఆ తరువాత విడిపోయారు. సిద్దిక్ తన దర్శకత్వ కెరీర్ ని కొనసాగించగా, లాల్ నటన, నిర్మాణం వైపు మళ్లాడు. సిద్ధిక్ సినిమాలన్నీ కామెడీ జోనర్‌లో ఉంటాయి. తమిళంలో సిద్ధిక్ చేసిన సినిమాలు ఎక్కువగా అతని మలయాళ చిత్రాలకు రీమేక్‌లు.

మలయాళంలో అతని చిత్రం బాడీగార్డ్‌ను సిద్ధిక్ స్వయంగా తమిళంలోకి కావలన్‌గా రీమేక్ చేసాడు. ఈ చిత్రాన్ని హిందీలోకి బాడీగార్డ్‌గా రీమేక్‌ చేశాడు.[6] దీని తెలుగురూపమే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన బాడీగార్డ్ (2012). వెంకటేష్, త్రిష జంటగా నటించిన ఈ చిత్రానికి గాను సలోనికి ఉత్తమ సహాయనటిగా సైమా అవార్డు దక్కింది.

సిద్ధిక్, జెన్సో జోస్‌తో కలిసి ఏర్పాటుచేసిన సంయుక్త సంస్థ ఎస్ టాకీస్‌లో చిత్రాలను నిర్మిస్తున్నాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

ఆయన 1984 మే 6న సజితను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు సుమయ, సారా, సుకూన్ ఉన్నారు.[7]

అవార్డులు

మార్చు

కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు:

  • పాపులర్ అప్పీల్, సౌందర్య విలువ కలిగిన ఉత్తమ చిత్రం (1991)[8]

జీ సినీ అవార్డులు:

  • ఉత్తమ తొలి దర్శకుడిగా జీ సినీ అవార్డు (2012)[9]

63 ఏళ్ల సిద్ధిఖీ ఇస్మాయిల్‌ గుండెపోటు కారణంగా కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ 2023 ఆగస్టు 8న తుదిశ్వాస విడిచాడు. ఆయనకు భార్య సజిత, ముగ్గురు పిల్లలు ఉన్నారు.[10]

మూలాలు

మార్చు
  1. "Best Siddique movies list (as director) @ MoviesList.IN". Archived from the original on 5 ఆగస్టు 2018. Retrieved 16 September 2016.
  2. George, Vijay (9 January 2020). "Director Siddique on working with Mohanlal in 'Big Brother', and balancing content and budget in cinema". thehindu.com.
  3. "Big Brother Movie Review: A thriller that tests your patience". The Times of India.
  4. "Cochin Kalabhavan".
  5. George, Vijay (9 January 2020). "Director Siddique on working with Mohanlal in 'Big Brother', and balancing content and budget in cinema". thehindu.com.
  6. "Vijay's Kaavalan in December". Sify. 17 September 2010. Archived from the original on 1 November 2010. Retrieved 14 February 2014.
  7. Sebastian, Shevlin. "Siddique never loses his cool". The New Indian Express. Archived from the original on 31 డిసెంబరు 2013. Retrieved 14 February 2014.
  8. Godfather
  9. Bodyguard
  10. "Siddique: చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడి మృతి | director siddique passed away". web.archive.org. 2023-08-08. Archived from the original on 2023-08-08. Retrieved 2023-08-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)