బాడీగార్డ్ 2012లో విడుదలైన తెలుగు సినిమా. ఇది మలయాళం, హిందీలో నిర్మించబడిన సినిమాకు తెలుగు రూపము.

బాడీగార్డ్
(2012 తెలుగు సినిమా)
Bodyguard poster.jpg
దర్శకత్వం గోపీచంద్ మలినేని
నిర్మాణం బెల్లంకొండ సురేష్
కథ సిద్ధిక్
తారాగణం దగ్గుబాటి వెంకటేష్,
త్రిష,
సలోని
సంగీతం ఎస్.ఎస్. తమన్
సంభాషణలు కోన వెంకట్
ఛాయాగ్రహణం శ్యామ్ కె. నాయుడు
కూర్పు గౌతం రాజు
నిర్మాణ సంస్థ శ్రీ సాయి గణేష్ ప్రోడక్షన్స్
భాష తెలుగు

నటీనటులుసవరించు

విమర్శకుల స్పందనసవరించు

123తెలుగు.కాం వారు తమ సమీక్షలో, "బాడీగార్డ్ కుటుంబ సభ్యులందరితో కలిసి చూడదగ్గ చిత్రం. కొన్ని కామెడీ సన్నివేశాలు నవ్వించగా కొన్ని సెంటిమెంట్ సన్నివేశాలు ఏడిపిస్తాయి. రెండవ భాగంలో కొన్ని సన్నివేశాలు వదిలేస్తే క్లైమాక్స్ ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది" అని వ్యాఖ్యానించారు.[1] వన్ ఇండియా వారు తమ సమీక్షలో, "అసభ్యత, హింస లేకుండా ఉండటం, కామిడీ, సెంటిమెంట్ పండటంతో ఈ చిత్రం ఫ్యామిలీలు నిరభ్యంతరంగా చూసే అవకాశం కలిగిస్తుంది. యూత్ కాస్త దూరమైనా, కుటుంబాలు కదిలివస్తే సినిమా మంచి విజయమే సాధిస్తుంది. ముఖ్యంగా మహిళలకి ఈ చిత్రం బాగా నచ్చే అవకాశం ఉంది" అని వ్యాఖ్యానించారు.[2] తెలుగువాహిని.కాం తమ సమీక్షలో, "సంక్రాంతి సీజన్ కాబట్టి, వెంకటేష్ ఫ్యామిలీ ఫ్యాన్స్ అండగా నిలబడటానికి కావలసినంత సెంటిమెంట్, యాక్షన్ ఉంది కాబట్టి బాడీగార్డ్ డీసెంట్ హిట్ గా నిలుస్తుంది. మిగతా బాషలలో చూసినవాళ్ళకు ఒకే, కొత్తగా చూస్తే కేకే" అని వ్యాఖ్యానించారు.[3]

మూలాలుసవరించు

  1. "సమీక్ష: మంచి మనసున్న బాడీగార్డ్". 123తెలుగు.కాం. Retrieved జనవరి 14, 2012.
  2. "కామిడీ గార్డ్‌ (బాడీగార్డ్ రివ్యూ)". వన్ ఇండియా. Retrieved జనవరి 14, 2012.
  3. "బాడీగార్డ్ మూవి రివ్యూ: మిగతా బాషలలో చూసినవాళ్ళకు ఒకే, కొత్తగా చూస్తే కేకే". తెలుగువాహిని.కాం. Archived from the original on 2013-05-05. Retrieved జనవరి 14, 2012.