సుందరకాండ (2008 సినిమా)

సుందరకాండ బాపు దర్శకత్వం వహించిన 2008 నాటి చిత్రం. అల్లరి నరేష్, చార్మీ కౌర్ ప్రధాన పాత్రల్లో నటించారు.[1] కథ ముళ్ళపూడి రమణ, సంగీతం విద్యాసాగర్ అందించారు. ఈ చిత్రం హాలీవుడ్ చిత్రం వాట్ ఎ గర్ల్ వాంట్స్ (2003) కు రీమేక్. ఈ సినిమా 2008 ఫిబ్రవరి 8న విడుదలైనది. చైత్ర సినిమా సర్క్యూట్ పతాకంపై కె. అపర్ణ లు నిర్మించిన ఈ సినిమాకు బాపు దర్శకత్వం వహించాడు. [2]

సుందరకాండ
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం బాపు
నిర్మాణం కె. అపర్ణ
కథ ముళ్ళపూడి వెంకటరమణ
తారాగణం అల్లరి నరేష్, చార్మీ కౌర్, రంగనాథ్, కోట శ్రీనివాసరావు, సంగీత, రాళ్ళపల్లి, కొండవలస లక్ష్మణరావు
నిర్మాణ సంస్థ చైత్ర సినిమా సర్క్యూట్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథ మార్చు

పింకీ ( చార్మి ) సీత ( ప్రేమ) కుమార్తె. ఆమె తన భర్తకు దూరంగా ఉంటుంది. పింకీ పట్టుబట్టడంతో, సీత గతాన్ని వెల్లడిస్తుంది. ఆమె ఒక గిరిజన గ్రామానికి అధ్యయనానికి వెళ్ళినపుడు జమీందార్ సురేంద్ర వర్మ ( రంగనాథ్ ) కుమారుడు రాజా రవివర్మ (సునీల్ శర్మ) ను కలుస్తుంది. వారు ప్రేమలో పడతారు. అక్కడికక్కడే పెళ్ళి చేసుకుంటారు. తన కొడుకు పెళ్ళి సురేంద్ర వర్మకు ఎంతటి షాక్ ఇచ్చిందంటే, అతడి కాళ్ళు పడీపోతాయి. కుటుంబ గౌరవాన్ని కాపాడటానికి రవివర్మ తల్లి భారతి ( సంగీత ) సీతను ప్యాలెస్ వదిలి వెళ్ళమని వేడుకుంటుంది. సీత వెళ్ళిన తరువాత, సురేంద్ర వర్మ బావ భూషణం (వైజాగ్ ప్రసాద్), సీత ప్యాలెస్ నుండి బంగారు ఆభరణాలను దొంగిలించి తీసుకుపోయిందని నానాయాగీ చేస్తాడు. తన భర్త దృష్టిలో కూడా చాలా అపఖ్యాతి పాలైన ఆమె, దూరంగా ఉండిపోయింది.

ఇప్పుడు, పింకీ తన తల్లిదండ్రులను తిరిగి కలపడానికి చేసిన ప్రయత్నాల చుట్టూ కథ తిరుగుతుంది. ఆమె తన తండ్రి కుటుంబంతో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తుంది. మంత్రి పదవికి అభ్యర్థిని ఎంపిక చేయడానికి పార్టీ ఉన్నతాధికారులు పంపినట్లు ఆమె నటిస్తుంది. నరేష్ ( అల్లరి నరేష్ ) అనే జర్నలిస్ట్ సహాయంతో ఆమె ఈ రాజకీయ పోరాటంలో పాల్గొంటుంది. ఆమె తండ్రి ప్రత్యర్థి కోట ( కోట శ్రీనివాసరావు ) కూడా ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థే. అతని సహచరులు కామెడీని, రాజకీయ వ్యంగ్యాన్ని అందిస్తారు. కుటుంబాన్ని తిరిగి కలపడంలో, విలన్లను బహిర్గతం చేయడంలో ఆమె విజయవంతమవుతుంది. గిరిజన ఇడియమ్‌ను గుర్తుచేసే సాహిత్యంతో సంగీతం ఒక ట్రీట్.  

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: బాపు
  • స్టూడియో: చైత్ర సినిమా సర్క్యూట్
  • నిర్మాత: కె. అపర్ణ;
  • స్వరకర్త: విద్యాసాగర్
  • సమర్పించినవారు: పెట్రోఫాబ్ ఇంటర్నేషనల్ FZC (యుఎఇ);
  • సహ నిర్మాత: తుమ్మల భానుప్రకాష్ రెడ్డి

పాటలు మార్చు

నం పాట గాయనీ గాయకులు నిడివి
1 "ఆకు వక్కా" ఎస్పీ శైలజ, అల్కా యాగ్నిక్, సుజాత 4.24
2 "ఒకటో ఏటా రెండో ఏట" చిత్ర 2:43
3 "ఎలూ ఎలూ వుయాలా" సాధన సర్గం 3:38
4 "కలగంటిని అమ్మ" చిత్ర 3:43
5 "హాంఫట్టే దేవుడండి" ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 3:30

మూలాలు మార్చు

  1. "Sundarakanda (2008) | Sundarakanda Movie | Sundarakanda Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2020-08-19.
  2. "Sundarakanda (2008)". Indiancine.ma. Retrieved 2021-05-26.

బాహ్య లంకెలు మార్చు