వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించిన చిత్రం ఈగ. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులు. ఎం. ఎం. కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 6, 2012 న విడుదలై భారీ విజయాన్ని సాధించింది.

ఈగ
(2012 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.ఎస్. రాజమౌళి
నిర్మాణం సాయి కొర్రపాటి
కథ ఎస్.ఎస్.రాజమౌళి
తారాగణం సుదీప్
నాని
సమంత
తాగుబోతు రమేశ్
సంగీతం ఎం.ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్, వారాహి చలన చిత్రం, మకుట గ్రాఫిక్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథ మార్చు

బిందు (సమంత) వాళ్ళ ఎదురింటిలో నివసిస్తూ ఉంటాడు నాని (నాని), అంతేకాకుండా రెండు సంవత్సరాల నుంచి నాని బిందుని ప్రేమిస్తూ ఉంటాడు. బిందు సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ 511 అనే ఎన్జీవో సంస్థని నడుపుతూ అందులో తను కూడా ఒక సోషల్ వర్కర్ గా పనిచేస్తూ ఉంటుంది. బిందు కూడా నానిని ప్రేమిస్తుంది కానీ చెప్పకుండా తనే తెలుసుకోవాలని తన చుట్టూ తిప్పుకుంటూ ఉంటుంది. ఇంతలో బిందు నడిపే ఎన్జీవో సంస్థకి సహాయం చేసే గొప్ప ధనికుని పాత్రలో పరిచయమైన సుదీప్ (సుదీప్) బిందుని ఇష్టపడతాడు.

సుదీప్ చాలా క్రూరమైన స్వభావం కలవాడు, తన అవసరానికి ఇతరులను చంపడానికి కూడా వెనుకాడడు. నాని బిందుని ప్రేమిస్తున్నాడని సుదీప్ కి తెలియగానే నానిని అతి కిరాతకంగా చంపేస్తాడు. చనిపోయిన నానినే మళ్ళీ ఈగగా పుడతాడు. అలా జన్మించిన ఈగ తనే నాని అని బిందుకి ఎలా తెలియజేసింది, తనను చంపిన సుదీప్ మీద ఎలా పగ తీర్చుకుందనేదే మిగిలిన చిత్రం.

తారాగణం మార్చు

 • నానిగా నాని
 • బిందుగా సమంత
 • సుదీప్ గా సుదీప్
 • కళగా హంసా నందిని
 • బిందు వదినగా దేవదర్శిని
 • సుదీప్ స్నేహితుడిగా ఆదిత్య
 • మాంత్రికుడు తంత్రగా అభిరాం

నిర్మాణం మార్చు

అభివృద్ధి మార్చు

దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను 10 కోట్ల రూపాయల బడ్జెట్ లోపు తీయాలనుకున్నాడు. మకుట అనే గ్రాఫిక్స్ సంస్థను సంప్రదించి యానిమేషన్ ద్వారా ఈగను రూపొందించమన్నాడు. కానీ వారిచ్చిన అవుట్ పుట్ చూశాక అది చాలా కృత్రిమంగా అనిపించింది. ఒక దశలో ఇక సినిమా తీయలేమని ఆపేద్దామని అనుకున్నాడు. కానీ అప్పటికే గ్రాఫిక్స్ పనిమీద 8 కోట్ల రూపాయలు ఖర్చు కావడంతో ఎలాగైనా ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు.

ఈగను సహజసిద్ధంగా రూపొందించాలని నిర్ణయించుకుని ప్రత్యేకమైన లెన్సుల ద్వారా నిజమైన ఈగలను వీడియో తీశారు. బ్రతికున్న వాటిని ఫోటోలు తీయడం కష్టమైన పని కాబట్టి వాటిని ఫ్రిజ్ లో ఉంచి అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఫోటోలు తీసేవారు. ఆ ఫోటోల సాయంతో నిజమైన ఈగ యానిమేషన్ లో ప్రాణం పోసుకుంది. ఈగ మొహమంతా కళ్ళా ఉంటాయి కాబట్టి దానిలో భావోద్వేగాలు పలికించడం కష్టం. ఈగ బాడీ లాంగ్వేజి నాని లాగా ఉండాలి కాబట్టి ముందుగా నాని కళ్ళకు గంతలు కట్టి కొన్ని శరీరంతో కొన్ని భావాలు పలికించమన్నారు. వాటి ఆధారంగా ఈగ భావాలను సహజంగా రూపొందించారు.[1]

పురస్కారాలు మార్చు

 1. నంది పురస్కారం - 2012 నంది పురస్కారాలు[2][3][4][5]
సంవత్సరం అవార్డు విభాగము లబ్ధిదారుడు ఫలితం
2012 నంది పురస్కారాలు[6] ఉత్తమ చిత్రం సాయి కొర్రపాటి గెలుపు
2012 నంది పురస్కారాలు ఉత్తమ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి గెలుపు
2012 నంది పురస్కారాలు ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత ఎస్.ఎస్.రాజమౌళి గెలుపు
2012 నంది పురస్కారాలు ఉత్తమ విలన్ సుదీప్ గెలుపు
2012 నంది పురస్కారాలు ఉత్తమ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గెలుపు
2012 నంది పురస్కారాలు ఉత్తమ ఛాయాగ్రహణం సెంథిల్ కుమార్ గెలుపు
2012 నంది పురస్కారాలు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ పీట్ డ్రేపర్ (మకుట విఎఫ్ఎక్స్) గెలుపు

సైమా అవార్డులు మార్చు

2012 సైమా అవార్డులు

 1. ఉత్తమ చిత్రం
 2. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ (కె.కె. సెంథిల్ కుమార్)
 3. సైమా ఉత్తమ ప్రతినాయకుడు (సుదీప్)

మూలాలు మార్చు

 1. "ఈగలను ఫ్రిడ్జ్‌లో పెట్టి... ఫొటోలు తీసి". www.eenadu.net. Retrieved 2020-06-26.
 2. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 30 June 2020.
 3. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.
 4. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.
 5. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.
 6. వెబ్ మాస్టర్. "Nandi Awards 2012, 2013 : Winners List". Gulte.com. Retrieved 19 January 2018.