సురభి జమునా రాయలు

జమునా రాయలు (1960 జనవరి 22 - 2020 ఆగస్టు 12) రంగస్థల నటి. సురభి నాటక సమాజం ప్రదర్శించిన అనేక నాటకాల్లోను, ఇతర నాటక సమాజాల నాటకాల్లోనూ నటించింది.[1] టీవీ, సినిమాల్లో కూడా నటించింది.

సురభి అవేటి జమునా రాయలు
జననంజమున
1960 జనవరి 22
తెనాలి, గుంటూరు జిల్లా
మరణం2020 ఆగస్టు 12(2020-08-12) (వయసు 60)
హైదరాబాదు
వృత్తిసురభి నాటక సమాజం
ప్రసిద్ధిరంగస్థల కళాకారిణి
మతంహిందు
భార్య / భర్తసురభి అవేటి కృష్ణదేవరాయలు
పిల్లలుఇద్దరు కుమార్తెలు
తండ్రివనారస కొండలరావు
తల్లివసుధమ్మ

జననం మార్చు

జమునా రాయలు 1960 జనవరి 22న వనారస కొండలరావు, వసుంధరాదేవి దంపతులకు గుంటూరు జిల్లా, తెనాలిలో జన్మించింది. మేనమామ సురభి రాయలునే వివాహం చేసుకుంది. పెళ్ళి తరువాత ఈమె పేరు జమునా రాయలుగా మారింది.

రంగస్థల ప్రస్థానం మార్చు

8 ఏళ్ళ వయసులో హరికథలు, బుర్రకథలు చెప్పడం ప్రారంభించింది. తొలిసారిగా చింతామణి నాటకంలో శ్రీకృష్ణుడు పాత్ర పోషించింది. షణ్ముఖి ఆంజనేయ రాజుతో సత్యభామగా, పీసపాటి నరసింహమూర్తితో రాధగా, వేమూరి రామయ్యతో సుధేష్ణగా నటించడంతోపాటు బాలనాగమ్మ, గుణసుందరి, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణీ మాలినీదేవి, చంద్రమతి, ద్రౌపది, సక్కుబాయి, మహాకవి కాళిదాసులో కథానాయిక, చత్రపతి శివాజీలో జిజియా బాయి, పాన పిశాచంలో కథానాయిక మొదలైన పాత్రలు పోషించింది. వరవిక్రయం, శ్రీకృష్ణ రాయబారం, సత్య హరిశ్చంద్ర, పంచమధర్మం వంటి నాటకాలలో నటించింది. మాతృశ్రీ తరికొండ వెంగమాంబ, శశిరేఖా పరిణయం అంటి నాటకాలకు దర్శకత్వం చేసింది.[2] ప్రథమ స్వతంత్ర మహాసంగ్రామం నాటకంలో ఝాన్సీ లక్ష్మీబాయిగా, శ్రీ మాధవ వర్మ నాటకంలో గుండమ్మగా నటించి నంది అవార్డు, ఉత్తమ నటి అవార్డులు అందుకుంది.

స్వాతి చినుకులు, సుందరకాండ సీరియళ్ళలో, మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలో కూడా నటించింది.

బహుమతులు - పురస్కారాలు మార్చు

  1. ఉత్తమ దర్శకత్వం - శశిరేఖా పరిణయం (నాటకం) - నంది అవార్డు
  2. పైడి లక్ష్మయ్య అవార్డు - తెలుగు విశ్వవిద్యాలయం
  3. సత్యసాయి బాబా నుండి ‘నవరత్నమాల’ను బహుకరణ
  4. బెస్ట్ ఎక్స్ లెన్సీ అవార్డు
  5. అక్కినేని ప్రథమ గోల్డ్ మెడల్
  6. జి.వి.ఆర్. జీవిత పురస్కారం
  7. నట శిరోమణి, నటనా విదూషీమణి, గానకోకిల బిరుదులు
  8. రాధాకుమారి స్మారక పురస్కారం (సుమధుర కళానికేతన్, విజయవాడ, 27 జూలై 2019)[3][4]
  9. నాటకకళా పురస్కారం (యువ కళావాహిని, రవీంద్రభారతి, హైదరాబాదు, 19 అక్టోబరు 2019)[5]

మరణం మార్చు

జమునారాయలు కరోనా వ్యాధితో 2020, ఆగస్టు 12న హైదరాబాదులోని గాంధీ ఆస్పత్రిలో మరణించింది.[6]

మూలాలు మార్చు

  1. జమునా రాయలు, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబర్ 2011, పుట. 42.
  2. The Hindu, Features (Friday Review) (6 August 2010). "A celebration of culture" (in Indian English). A. Ramalinga Sastry. Archived from the original on 13 August 2020. Retrieved 13 August 2020.
  3. ఆంధ్రజ్యోతి, కృష్ణా జిల్లా (28 July 2019). "ఆద్యంతం హాస్యపు జల్లులే." Archived from the original on 22 January 2020. Retrieved 22 January 2020.
  4. The New Indian Express, Vijayawada (26 July 2019). "Sumadhura comedy drama festival to begin today". www.newindianexpress.com. Archived from the original on 13 August 2020. Retrieved 13 August 2020.
  5. ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ (19 October 2019). "హైదరాబాద్‌లో నేటి కార్యక్రమాలు". www.andhrajyothy.com. Archived from the original on 13 August 2020. Retrieved 13 August 2020.
  6. ఈనాడు, తాజా వార్తలు (13 August 2020). "రంగస్థల నటి జమునా రాయలు కన్నుమూత". www.eenadu.net. Archived from the original on 13 August 2020. Retrieved 13 August 2020.