సోలో ఒక 2011 లో విడుదలైన సినిమా. నారా రోహిత్ హీరోగా నిషా అగర్వాల్ హీరోయిన్‌గా పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విజయవంతమై, సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.[1] మణి శర్మ సంగీతం అందించాడు.[2] తరువాత దీనిని ఒరియాలో అనుభావ్ మొహంతి, బర్షా ప్రియదర్శినిలతో హాతా ధారి చాలుతగా పేరుతో రీమేక్ చేశారు.

సోలో
(2011 తెలుగు సినిమా)
Solo poster.jpg
దర్శకత్వం పరశురామ్
నిర్మాణం వంశీకృష్ణ శ్రీనివాస్
కథ పరసురాం
చిత్రానువాదం పరశురామ్
తారాగణం నారా రోహిత్
నిషా అగర్వాల్
ప్రకాష్ రాజ్
జయసుధ
ఫిష్ వెంకట్
శ్రీనివాస రెడ్డి
సంగీతం మణిశర్మ
సంభాషణలు పరశురామ్
ఛాయాగ్రహణం దాసరథి శివేంద్ర
కూర్పు మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ ఎస్.వీ.కే. సినిమా
భాష తెలుగు

కథసవరించు

గౌతమ్ ( నారా రోహిత్ ) ఒక అనాథ. కుటుంబ సంబంధాలను, పెద్దల ప్రేమనూ అనుభవించడానికి గాను, ఉమ్మడి కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని కలలు కంటూంటాడు. అతను ఉమ్మడి కుటుంబానికి చెందిన వైష్ణవి ( నిషా అగర్వాల్ ) తో ప్రేమలో పడతాడు. ఆమెను ఆకర్షించడానికి ప్రయత్నిస్తాడు. చివరికి ఆమె అతనితో ప్రేమలో పడుతుంది. వైష్ణవికి ఇంట్లో అందరితో, ముఖ్యంగా ఆమె తండ్రి నాయుడుతో చాలా అనుబంధం ఉంటుంది. ఒక రోజు అతను తన కుమార్తె, గౌతమ్‌ల సంబంధం గురించి తెలుసుకుంటాడు. తన కుమార్తెను మంచి కుటుంబానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చెయ్యాలనుకుంటున్నందున అతను గౌతమ్‌ను ఇష్టపడడు. మరో సంబంధం చూస్తాడు. ఆ తరువాత ఏమి జరుగుతుందనేది మిగిలిన కథ.[3]

నటీనటులుసవరించు

పాటలుసవరించు

క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "ఆల్మోస్ట్ ఆటంబాబు"  ర్ంజిత్ 4:37
2. "మరుమల్లెల వాన"  హేంచంద్ర 4:07
3. "అమ్మమ్మమ్మో"  శ్రీరాం చంద్ర మైనంపాటి, మాళవిక 4:54
4. "నా ప్రేమ కథకు"  హరిచరణ్ 4:06
5. "సింగపూరు"  శ్రావణ భార్గవ 4:30
6. "పుడుతూనే సోలో"  కారుణ్య 3:16
25:30


మూలాలుసవరించు

  1. "Solo". The Times of India. Retrieved 31 May 2020.
  2. Error on call to మూస:cite web: Parameters url and title must be specified
  3. Solo Movie Review. Kothimeer.
"https://te.wikipedia.org/w/index.php?title=సోలో&oldid=3039740" నుండి వెలికితీశారు