అందం

(సౌందర్యము నుండి దారిమార్పు చెందింది)

ఏదైనా ప్రాణి, జీవి, లేదా వస్తువు యొక్క మనసుకింపైన సౌందర్యాన్ని 'అందము' (Beauty) అంటారు. శరీర అవయవ అందాన్ని మనసుతో చూస్తాము కావున ఒకే వస్తువు లేదా మనిషి యొక్క www.shorterlife.xyz అందము ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనిపిస్తూ ఉంటుంది. ఈ విశ్వములో ఎన్నెన్నో జీవులు, ఎన్నో వస్తువులు దేని అందము దానికే గొప్ప,, ప్రత్యేకము. పుష్పాల అందం అందరినీ ఆనందపరుస్తుంది.

అందమైన 12 జాతుల పుష్పాలు.

ప్రతి మనిషి, ఆడ, మగ, అందరూ అందముగా ఉండాలని అనుకుంటారు, ఉండాలని ప్రయత్నమూ చేస్తారు. అందమంటే శారీరక సౌందర్యమే కాదు, మానసికంగా పరిపక్వమూ, ఉల్లాసము కూడా ఉండాలి, అప్పుడే పరిపూర్ణమైన అందమని చెప్పబడుతుంది. www.rockmoney.org

భాషా విశేషాలు

మార్చు

అందము అనే పదానికి తెలుగు భాషలో వివిధ ప్రయోగాలున్నాయి. అందము అనగా n. Beauty. సౌందర్యము అని అర్ధం.[1] Manner. నాలుగందాల or అన్ని అందాల in every way. Carr. 1248. అందపడు andapaḍu. [Tel.] v. to become beautiful, handsome, అందపరుచు to cause to be beautiful, to adorn. అందకత్తె n. అనగా A beautiful, a lovely girl. సౌందర్యవతి. అందగాడు n. అనగా A handsome fellow. సౌందర్యవంతుడు.

అందహీనము [ andahīnamu ] andahīnamu. n. adj. అనగా Ugly, deformed. వికారమైన అని అర్ధం.

ప్రకృతి అందాలు

మార్చు
 
భూమి మీద కొన్ని అందమైన వృక్ష జాతులు
 
భూమి మీద కొన్ని అందమైన జంతు జాతులు

ప్రకృతిలో ఎన్నో అందాలు ఉన్నాయి. ఆకుపచ్చని చెట్లు, రంగురంగుల పువ్వులు, వైవిధ్యమైన జీవులు, కొండలు, లోయలు ఇలా వివిధ ప్రదేశాల్ని చాలా మనోహరంగా కనిపిస్తాయి.

అందాన్ని పెంచుకోగల మార్గాలు

మార్చు

లోపలకు తీసుకొనేవి

మార్చు

బయట (external) రాసుకొనేవి

మార్చు
  • అలసిన కల్లకు : నిద్రపోతున్నట్టు, జీవంలేనట్టు కనిపిస్తున్న కళ్ళకోసం ఇంట్లోనే ఈ చిట్కా పాటించవచ్చు.. కళ్ళకు మేకప్ వేసుకునే మిందే చల్లని దోసకాయ గుజ్జులో ముంచిన దూదిని మూసిన కనురెప్పల మీద ఉంచుకోవాలి.
  • పొదడిబారిన చర్మానికి : ఒక్కొక్క టేబుల్ స్పూను చొప్పున టమోటా, దోస రసాలు, కొన్ని నిమ్మ చుక్కలు, ఒక టేబుల్ స్పూను కిస్మిస్ లు ఇవన్ని బాగా కలపాలి.. ఈ మిశ్రమాన్ని మొహానికి రాసుకుని 20 నిముషాలు అనంతరము గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
  • జిడ్డు చర్మానికి : పావు టేబుల్ స్పూను నిమ్మరసంలో 2 టేబు స్పూనులు తురిమిన కమలా తొక్కలు, కొంచం పాలు కలిపి ఒక రోజంతా ఫ్రిజ్ లో ఉంచాలి. ఇది మంచి క్లెన్సర్ గా పనిచేస్తుంది, దీనిని బాడీలోషన్ గా వాడవచ్చు.
  • చక్కని స్కిన్ టోన్ కోసం : ఒకటిన్నర టేబుల్ స్పూను పెరుగు, ఒక టేబుల్ స్పూను సన్నగా తరిగిన కమలాపండు తిక్కలు, ఒక టేబుల్ స్పూను ఓట్ మీల్, నూనె ఇవన్నీ కలిపిన మిశ్రమంతో శరీరానికి మ్రుదువుగా మర్దన చేయాలి. చర్మం మీది మ్రుత కణాలు, బ్లాక్ హెడ్స్ తొలగి పోతాయి. దీనిని రోజువారీ స్క్రబ్ గా కూడా వాడవచ్చు

పాటించ వలసిన జాగ్రత్తలు

మార్చు
  • వేలకు నిద్ర పోవాలి
  • వేలకు ఆహారము తీసుకోవాలి
  • రోజూ వ్యాయామము చేయాలి
  • చిన్న చిన్న విషయాలకు టెన్సన్ పడకూడదు.
  • ఎక్కువ స్టెస్, స్ట్రైన్ కి గురుకాకూడదు.
  • ప్రతి రోజు మృదువైన సబ్బుతో స్నానము చేయాలి.
  • పదే పదే చేతులతో ముఖాన్ని తాకకూడదు
  • శుభ్రమైన దిండు (తలగడ ) ని వాడాలి.
  • బాగా కాగిన నీటితో కాకుండా గోరువెచ్చని నీటిని స్నానానికి ఉపయోగించవలెను
  • చర్మానికి హానికలిగించే కఠినమైన ఉత్పత్తులను వాడకుండా మృదువైన చర్మ సౌందర్య ఉత్త్పత్తులను వాడాలి.
  • ముఖంపై వచ్చిన మొటిమలను గిల్లకూడదు, ఆలా చేసినచో ఇంకా ఎక్కువగా వ్యాపించును
  • చర్మం ఎండాకి గురి కాకుండా  టోపీ, చలువ కళ్ళద్దాలు, నూలు వస్త్రాలను ధరించాలి
  • రోజు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ముఖంపై ఉన్న మేకప్ ని తీసి నిద్రించాలి[2]
  • మీ అందాన్ని ఇంకొకరి అందముతో పోల్చుకోకూడదు. ఎప్పుడూ పాజిటివ్ గానే ఆలోచించండి.

ఆహార నియమాలు

మార్చు

మనము తినే ఆహారాన్ని బట్టి మనకు వ్యాధులు వస్తాయి, ఏదైనా వ్యాధితో బాధపడుతున్నవారు ఎంత అందముగా ఉన్నా పీలగా కనిపిస్తారు, కాంతిహీనముగా ఉంటారు, ఆహారము సరైందికాకుంటే ఎన్ని లోషన్లు, పోషన్లు ఉపయోగించినా ఆశించిన ఫలితాలు కలగవు. అందువలన మంచి ఆహార నియమాలను పాటించడము వలన జబ్బులనుండి దూరముగా ఉండవచ్చును. ఈ క్రింది ఏ ఆహార పదార్దములు ఎలా ఉపయోగపడతాయో చూద్దాము :-

  • క్యారట్లు (carat root) :ఒకే ఒక్క పచ్చి క్యారట్ తింటే రోజంతటికి సరిపడే విటమిన్లు శరీరానికి దొరుకుతాయి. అది కళ్ళు, శరీరభాహ్యకణజాలాన్ని, అవయవాలను, ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. విటమిన్ ఎ ఎక్కువగా లబ్యమవుతుంది.
  • ఆకు కూరలు : విటమిన్లు చాలా కీలకమైనవి శరీర ఆక్రుతిని, ఆరోగ్యాన్ని కాపాడేందుకు, ఇవి ఎక్కువగా ఆకుకూరలలో ఉంటాయి. శరీర అందానికి విటమిన్ 'సి', విటమిన్ 'ఇ' ముఖ్యమైనవి. విటమిన్ సి- నిమ్మ, నారింజ జాతి కాయలు, పండ్లలో పుష్కలముగా ఉంటుంది.
  • రోజుకో యాపిల్ : యాపిల్ లో పెక్టిన్, సి-విటమిన్, కాల్సియమ్, ఫాష్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు లభిస్తాయి. శరీరం లోని విషపదార్దములను, కొలెస్త్రాల్ స్థాయిని యాపిల్ తగ్గిస్తుంది. ఊపిరితిత్తులు సక్రమముగా పనిచేసెందుకు ఇది సహకరిస్తుంది. అందుకే యాపిల్ ను రోజువారి ఆహారములో చేర్చండి.
  • నీరు : నీరు మన శరీరానికి ఎంతో అవసరము. సమాజములో దాదాపు 80% మంది డిహైడ్రేషన్ కి లోనవుతుంటారు. దీనివలన శరీరము ముడతలు పడి కాంతిహీవముగా తయారవుతుంది. బుగ్గలు చొట్టలు పడి ముఖము అందవికారముగా తయారవుతుంది.మనశరీర బరువులో 70% పాలుపంచుకున్న నీరు అందానికి ఆరోగ్యానికి ఎంతో అవసరము. కావున ప్రతిరోజూ కనీసము 2లీటర్లు నీటిని త్రాగాలి.
  • ఉల్లి-వెల్లుల్లి : ఈ రెందూ శరీర రక్తప్రశరణవ్యవస్థకి మేలుచేస్తాయి. తినే ఆహారపదార్దములలోని 'టాక్సిన్' లను తొలగించడములోను, వ్యాధినిరోధకవ్యవస్థను క్రమబద్దీకరించడములోను ఉపయోగపడతాయి. ఉబ్బసము తగ్గించడానికి కూడా పనికొస్తాయి.
  • పెరుగు : దీనిలో సహజ సజీవ 'అసిడోఫిల్లస్' లాక్టోబాసిల్లస్ బాక్టీరియ, యోగర్ట్- పుల్లటిపెరుగు లోనే లభిస్తాయి. ఇవి గుండెకు కావలసిన స్పందనను, ఉత్సాహాన్ని అందిస్తాయి.పెరుగును క్రమపద్ధతిలో వాడితే కడుపులో గాస్ ను, త్రేన్పులు మలబద్దకము, అజీర్ణము వంటి రుగ్మతలు అన్నీ మాయమువుతాయి.
  • ఫైబరు : కేలరీలు ఏమాత్రము లేకున్నా, జీర్ణము కానివైనా పీచుపదార్దము ఒంటికి చేసే మేలు ఎక్కువ.ప్రధానముగా ఇవి అతిగాతినడము అరికడతాయి. వయసు మీరిన చిహ్నాన్ని, గుండెపోటును అరికడతాయి.ఈస్ట్రోజన్ స్థాయిని క్రమపరుస్తాయి.తాజాపండ్లు, పొట్టుగల పదార్దములు, తాజారొట్టె, ఆకుకూరలు, కాయకూరలు పీచు గలవి. ఇప్పటి వరకూ మీరు వీటిని అశ్రద్ధ చేసినట్లయితే వెంటనే వాడడము ప్రారంభించండి. మలనపదార్దములను బయటకు పంపించడములో పీచుదినుసులదే కీలకపాత్ర.
  • శాకాహారము / మాంసాహారము : శాకాహారమే శరీరానికి మంచిది.కూరగాయలు, ఆకుకూరలే 'అద్భుతాహారము' కీరదోస, దొండ, ఉడకపెట్టిన క్యాబేజి, తాజాఆకుకూరలు, వంటికి మంచిది, కేశాలు, చర్మము, కళ్ళు వంటి శరీరభాగాలన్నీ ఆరోగ్యముతో తొణికిస్తుంటాయి. పాలు అందరికీ మంచిదే. కొన్ని ఎమైనో యాసిడ్సు శాకాహారములో ఉండవు కావున గుడ్లు, చేపలు, చికెన్ తినడం మంచిది. గుడ్లలో ప్రోటీన్లు, కాల్సియం, ఐరన్, జింకు, బి-కాప్లెక్ష్ విటమిన్లు ఉంటాయి. చికెన్లో క్రొవ్వు తక్కువగా ఉంటుంది కావున వాడవచ్చు .చేపలలో ఒమెగా ఫాటియాసిడ్సు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలుచేస్తాయి.ఇవి తప్ప మిగతా మాంసాహారాన్ని అనగా మటన్, బీప్, పోర్క్, వగైరా వాడవద్దు.

శరీర కాంతి పెంచే బామ్మ చెప్పిన చిట్కాలు

మార్చు
  • నిమ్మరసము, మజ్జిగ సమభాగాలు కలిపి పూయుట వలన ఎండకు నల్లబడిన ముఖము స్వచ్ఛముగా నుండును.
  • ఆవ నూనెలో శనగపిండి, పసుపు కలిపి రాసిన చర్మము కాంతివంతమగును.
  • వెన్న, పసుపు కలిపి రాత్రిపూట నిద్రపోవునప్పుడు ముఖమునకు రాసుకొనిన ముఖము కాంతివంతముగాను ఉండును.
  • నాలుగు లేదా ఐదు బాదం పప్పును రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే పప్పులపై ఉన్న పొట్టు తీసి వాటిని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ పేస్ట్‌కు కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాయాలి. బాగా ఆరాక నీటితో కడగాలి. ఇలా తరచూ చేస్తే ముఖ సౌందర్యం పెరుగుతుంది.
  • ఆలుగడ్డలను పొట్టు తీసి వాటిని జ్యూస్‌లా పట్టి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు పోతాయి.[3]
  • ముఖము పై ముడతలున్న రెండు చెంచాల గ్లిజరిన్ లో 1/2 చెంచా గులాబీ జలము, కొన్ని నిమ్మరసపు చుక్కలు కలిపి రాత్రి ముఖముపై రాయవలెని. ఉదయము లేవగానే చన్నీటితో ముఖము కడుగుకొనవలెను. చర్మపు రంగు నిగ్గుతేలి ముడతలు తగ్గిపోవును.
  • చర్మానికి కుంకుమ పువు సొగసు : కుంకుమ పూవు అత్యంత ఖరీదే అయినా ప్రపంచ స్థాయిలో సౌందర్య సాధనగా ప్రసిద్ధిపొందినది. కుంకుమపూవుతో తయారయిన పేస్టుని ముఖము చేతులపైన రాసుకుంటే చర్మానికి మృదుత్వాన్ని, బంగారు మెరుపుని తెస్తుంది.అందుకే గర్భిణిగా ఉన్నవారు కుంకుమ పూవు పాలలో వేసుకొని తాగితే మంచి ఛాయతో మెరిసిపోయే బిడ్డపుడుతుందని నమ్ముతారు.
  • పసుపు, వేపల లేపనము : ఎన్నోవేల సంవత్సరాల నుంచి భారతీయులు చర్మ సంరక్షణకు పసుపు, వేపలను ఎంతగానో నమ్ముతున్నారు.పలురకాల చర్మ సమస్యలకు విరుగుడుగా పనిచేయడమే కాకుండా చర్మానికి చల్లదనాన్ని, హాయినీ ఇస్తుంది. ఒక చెంచా పసుపు పొడి, కొంచము కుంకుమ పొడి, ఒక చెంచా వేపచూర్ణము పచ్చి పాలలో వేసి కలిపి మిశ్రమాన్ని తయారుచేసి ముఖము, ఇతర చర్మభాగాల మీద రాస్తే మచ్చలు దద్దుర్లు వంటివి పోతాయి.
  • గంధము పేస్టు : కొంతమంది చర్మము బాగా సున్నితముగా ఉంటుంది, ఏమాత్రము ఎండలోకి వెళ్లినా కందుతుంది, దురద, పొడిబారడం, పొరలుగా రావడం, బిరుసెక్కిపోవడం, వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటపుడు గంధము పేస్టు ఆయిల్ చర్మాన్ని చల్లబరుస్తుంది, యాంటిసెప్టిక్ గా పనిచేస్తుంది, చర్మాన్ని తేమగా ఉంచేందుకు దోహదం చేస్తుంది. ప్రతి రోజూ దీనిని వాడుతూ ఉంటే చర్మము మీది నూనెగ్రంధులు ఉత్తేజితమై తేమగా ఉండేందుకు తోడ్పడుతూ చర్మానికి హానిచేసే బాక్టీరియాను తొలగిస్తాయి.
  • ముడతలు పడకుండా నిమ్మకవచం : కోసిన యాపిల్ ముక్క బూడిద రంగులోనికి మారకుండా ఉండాలంటే నిమ్మరసాన్ని కోసిన యాపిల్ భాగములో నిమ్మరసానీ రాస్తుంటాము, ఆక్షిడేషన్ కారణముగా యాపిల్ అలా మారకుండా ఊంటుంది. వాతావరణ కాలుష్యానికి గురైన చర్మము పాడవకుండా ఆపే శక్తి నిమ్మరసము లోని విటమిను 'సి' కి ఉంది. ప్రతి సౌందర్య సాధనానికి రెండు నిమ్మ చుక్కలు కలిపితే చర్మము ముడతలు పడకుండా ఉంటుంది.
  • జుట్టుకి గొప్ప కండిషనర్ పెరుగు : పెరుగు జుట్టుని పొడిబారనీయకుండా చేస్తుంది. షాంఫూతో తలంటుకున్న తరువాత ఐదునిముషాలు పెరుగుతో తలకు మసాజ్ చేసుకుంటే పొడిబారిన, పాదైన జుట్టూకి చక్కని కండిషనర్ గా పనిచేస్తుంది. జుట్టుకి మృదుత్వాన్ని ఇచ్చి తేమగా ఉంచే శక్తి పెరుగుకి ఉంది.[4]
  • ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకొని ముఖానికి మసాజ్ చేసి, పది నిమిషాల తర్వాత వెచ్చని నీటితో కడుగుకొనవలెను. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం మృదువుగా అందంగా ఉంటుంది.

మూలాలు

మార్చు
  1. "బ్రౌన్ నిఘంటువు ప్రకారం అందము పదప్రయోగాలు". Archived from the original on 2016-01-25. Retrieved 2011-01-18.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-12-23. Retrieved 2019-12-23.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-12-24. Retrieved 2019-12-24.
  4. https://telugu.boldsky.com/beauty/hair-care/2016/7-things-you-need-know-before-using-yogurt-on-your-hair/articlecontent-pf72595-014732.html[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=అందం&oldid=3899316" నుండి వెలికితీశారు