స్నేహలత మురళి (1964 - 2023 నవంబరు 11) భారతీయ జానపద గాయని, స్వరకర్త. ఆమె తెలంగాణ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. ఆమె తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు ముని మనవరాలు. పెళ్లి పాటలతో తెలుగువారి పూర్వ వైభవాన్ని ఈ తరానికి పరిచయం చేసి ఆమె ప్రసిద్ధిచెందింది.

గిడుగు స్నేహలత
జననం
నాగార్జునసాగర్, నల్గొండ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
మరణం2023 నవంబరు 11
జాతీయతభారతీయురాలు
వృత్తిగాయని, స్వరకర్త.
తల్లిదండ్రులు
బంధువులుగిడుగు వెంకట రామమూర్తి (ముత్తాత)

విద్యాభ్యాసం మార్చు

ఆమె ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ సోషియాలజీ పూర్తిచేసింది.

కెరీర్ మార్చు

ఆకాశవాణి, దూరదర్శన్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక వ్యవహారాలశాఖ ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. వ్యాఖ్యాతగానే కాకుండా ఆమె డబ్బింగ్‌ ఆర్టిస్టుగా అనేక పాత్రలకు గాత్రదానం చేసింది.

అంతేకాకుండా, ఆమె సంగీత దర్శకత్వంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఉషా ఉతుప్‌, ఎస్పీ శైలజ, వాణీ జయరాం, గీతామాధురి, మాళవిక, నిత్య సంతోషిణి, మల్లికార్జున్‌ వంటి ప్రముఖులు ఎందరో పాటలు ఆలపించారు.

2015లో రూపొందిన 7 టు 4 క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాతో ఆమె సినీరంగ ప్రవేశం చేసింది. మిల్క్ మూవీస్ పతాకంపై విజయ్ శేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఆనంద్, రాధిక, లౌక్య, బాలకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు.[1]

గుర్తింపు మార్చు

  • 2009లో, ఆమె విశిష్ట ఉగాది పురస్కారం అందుకుంది.
  • ప్రతిభా రాజీవ్‌ పురస్కారం
  • 2012లో ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రదర్శన

మరణం మార్చు

కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న 59 సంవత్సరాల ఆమె హైదరాబాదులోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ 2023 నవంబరు 11న కన్నుమూసింది.[2] ఆమెకు భర్త మురళీకృష్ణ, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

మూలాలు మార్చు

  1. "సరైన న్యాయం | 7 to 4 Telugu Movie Theatrical Trailer - Sakshi". web.archive.org. 2023-11-12. Archived from the original on 2023-11-12. Retrieved 2023-11-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "జానపద గాయని స్నేహలత కన్నుమూత |". web.archive.org. 2023-11-12. Archived from the original on 2023-11-12. Retrieved 2023-11-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)