స్రవంతి

క్రాంతి కుమార్ దర్శకత్వంలో 1986లో విడుదలైన తెలుగు చలనచిత్రం

స్రవంతి 1986, జనవరి 16న విడుదలైన తెలుగు చలనచిత్రం. ముద్దు ఆర్ట్ మూవీస్ పతాకంపై కె. కేశవరావు, జయకృష్ణ నిర్మాణ సారథ్యంలో క్రాంతి కుమార్[2] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్, సుహాసిని, శరత్ బాబు ప్రధాన పాత్రల్లో నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[3] 1986 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో ఉత్తమ తెలుగు సినిమా పురస్కారాన్ని అందుకుంది. రేవతి, సురేష్ ముఖ్యపాత్రలతో ఈ చిత్రం రేవతి పేరుతో తమిళంలో రిమేక్ చేయబడింది.

స్రవంతి
TeluguFilm Sravanthi.JPG
స్రవంతి సినిమా పోస్టర్
దర్శకత్వంక్రాంతి కుమార్[1]
నిర్మాతకె. కేశవరావు
జయకృష్ణ
తారాగణంమోహన్,
సుహాసిని,
శరత్ బాబు
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
ముద్దు ఆర్ట్ మూవీస్
విడుదల తేదీ
1986 జనవరి 16 (1986-01-16)
సినిమా నిడివి
111 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యంసవరించు

స్రవంతికి క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తితో వివాహం జరుగుతుంది, అతను కొద్దిరోజుల తరువాత చనిపోతాడు. తన జీవితం చేసిన గాయం నుండి ఏదో ఒకవిధంగా బయటపడటానికి ప్రయత్నిస్తుంది. భార్యను కోల్పోయి ఒక చిన్న కుమార్తె వున్న మరొక వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. కానీ ఆమె రెండవ భర్త ఆమె పట్ల చూపించే ప్రేమ, ఆప్యాయతలకు అసహనంగా మారుతుంది. చివరికి, ఆమె తన కుమార్తెను, తన మొదటి భర్త తల్లిదండ్రులను పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తుంది.

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[4] వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాశాడు.

  1. మౌనం ఆలాపన (గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల)
  2. నవ్వుతూ వెళ్ళిపో పువ్వులా (గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)

పురస్కారాలుసవరించు

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

మూలాలుసవరించు

  1. Kranthi Kumar - IMDb
  2. Sravanthi (1986)
  3. "Sravanthi (1986)". Indiancine.ma. Retrieved 2020-08-26.
  4. "Sravanthi 1986 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-26.[permanent dead link]
  5. "33rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 21 సెప్టెంబర్ 2013. Retrieved 26 August 2020. Check date values in: |archive-date= (help)

ఇతర లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=స్రవంతి&oldid=3352841" నుండి వెలికితీశారు