హనుమంతు అప్పయ్యదొర

హనుమంతు అప్పయ్యదొర శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజకీయనాయకులు.తొలత టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్‌, చివరగా జై సమైక్యాంధ్ర పార్టీకి సేవలందించారు. రెండు సార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన 1984-89 కాలంలో శ్రీకాకుళం లోక్‌సభకు ఎంపీగా వ్యవహరించారు. అటుపై టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి రెండు సార్లు గెలుపొందారు.[1]

హనుమంతు అప్పయ్యదొర
హనుమంతు అప్పయ్యదొర


భారతదేశ పార్లమెంటు సభ్యులు
పదవీ కాలం
1984 – 1989
ముందు బొడ్డేపల్లి రాజగోపాలరావు
తరువాత కణితి విశ్వనాథం
నియోజకవర్గం శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2004-2009
ముందు కొర్ల రేవతీపతి
తరువాత కొర్ల భారతి
నియోజకవర్గం టెక్కలి శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1935-02-08)1935 ఫిబ్రవరి 8
బెండి, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్
మరణం 2014 సెప్టెంబరు 5(2014-09-05) (వయసు 79)
విశాఖపట్నం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
నివాసం శ్రీకాకుళం జిల్లా
పూర్వ విద్యార్థి ఆంధ్రాయూనివర్సిటీ
మతం హిందూ మతము

జీవిత విశేషాలు

మార్చు

ఈయన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని బెండి గ్రామంలో ఫిబ్రవరి 8, 1935 న నారాయణదొర, సన్యాసమ్మ దంపతులకు జన్మించారు.ఆయన ప్రాథమిక విద్య తలగాం లోనూ, హైస్కూల్ విద్య టెక్కలిలోను, విశాఖపట్నం ఎ.వి.ఎన్‌ కాలేజీలో బి.ఎ. డిగ్రీ తరువాత ఆంధ్రాయూనివర్సిటీలో న్యాయశాస్త్రం పట్టా చదివారు. అనంతరము సోంపేట, టెక్కలిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసారు.

రాజకీయ జీవితం

మార్చు

1961 లో బెండి గ్రామానికి సర్పంచ్గా ఎన్నికయ్యారు. 1981 లో బెండి సమితి ప్రసిడెంట్ అయ్యారు . 1985 లో శ్రీకాకుళం పార్లమెంట్ కు తెలుగుదేశం తరుపున ఎన్నికయ్యారు. 1995 బై ఎన్నికలలో మరియు 2004 సాధారణ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ శాసన సభకు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ కన్సర్వేటివ్ కమిటీ కార్యదర్శిగా చేసారు.[2] ఆయన 1984 లో టిడిపి నుంచి ఎం.పిగా పనిచేసారు. ఆయన శ్రీకాకుళం రాజకీయాలలో తెలుగుదేశం పార్తీలోనూ మరియు కాంగ్రెస్ లోనూ పనిచేసారు. స్వర్గీయ ఎన్టీఆర్ గారికి విధేయునిగా ఉండేవారు. వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ చేరారు కానీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో వచ్చిన విభేదాల వల్ల ఆ పార్టీని వదిలిపెట్టారు.[3]

ఆయన విశాఖ లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సెప్టెంబరు 5 2014 న తుదిశ్వాస విడిచారు.[4]

మూలాలు

మార్చు
  1. "మాజీ ఎంపీ హనుమంతు కన్నుమూత". Archived from the original on 2016-01-03. Retrieved 2015-07-18.
  2. "Appayya Dora Hanumanthu". Archived from the original on 2016-09-11. Retrieved 2015-07-18.
  3. Former MP Appayya Dora no more
  4. ormer MP Appayya Dora no more

ఇతర లింకులు

మార్చు