తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్

జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో 2019లో విడుదలైన తెలుగు కామెడీ సినిమా

తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్, 2019 నవంబరు 15న విడుదలైన తెలుగు కామెడీ సినిమా. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సందీప్ కిషన్, హన్సికా మోట్వాని, వరలక్ష్మి శరత్‌కుమార్ నటించగా, సాయి కార్తీక్ సంగీతం అందించాడు.[1] ఇది వరలక్ష్మి శరత్‌కుమార్ తొలి తెలుగు సినిమా.[2][3]

తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్
తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ సినిమా పోస్టర్
దర్శకత్వంజి. నాగేశ్వరరెడ్డి
నిర్మాతఅగ్రహారం నాగిరెడ్డి సంజీవ్ రెడ్డి
రూప జగదీష్
తారాగణంసందీప్ కిషన్
హన్సికా మోట్వాని
వరలక్ష్మి శరత్‌కుమార్
ఛాయాగ్రహణంచోటా కె. ప్రసాద్
సంగీతంసాయి కార్తీక్
విడుదల తేదీ
15 నవంబరు 2019
సినిమా నిడివి
128 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా సారాంశం మార్చు

తెనాలి రామకృష్ణ ఒక న్యాయవాది. అతనికి డబ్బుపై ఆశ ఎక్కుగా ఉంటుంది. వారు ఇచ్చేదాన్ని బట్టి కేసులు గెలవడం, ఓడడం వంటివి చేస్తుంటాడు. అతను ఒక క్రిమినల్ కేసు విషయంలో న్యాయం కోసం పోరాడాలని నిర్ణయించుకున్నప్పుడు అనేక సమస్యలు ఎదురవుతాయి. అతను తన జీవితాన్ని శాశ్వతంగా మార్చే ఒక కేసును తీసుకుంటాడు. ఆతరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.

నటవర్గం మార్చు

పాటలు మార్చు

Untitled

ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం సమకూర్చాడు.

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."రామకృష్ణ తెనాలి (రచన: భాస్కరభట్ల రవికుమార్)"భాస్కరభట్ల రవికుమార్సాయి మాధవ్2:43
2."కర్నూల్ కత్తివా (రచన: చిలక రెక్క గణేష్)"చిలక రెక్క గణేష్ధనుంజయ్3:09
3."పీచుమిఠ్ఠాయి పిల్లరో (రచన: భాస్కరభట్ల రవికుమార్)"దత్తు, విష్ణు ప్రియభాస్కరభట్ల రవికుమార్3:16
మొత్తం నిడివి:9:18

స్పందన మార్చు

"రచయితల బృందం కామెడీని అందించడానికి పాత ఉపాయాలను ఉపయోగించింది. వారు వన్-లైనర్లపై ఎక్కువ ఆధారపడ్డారు" అని సిఫీ రాసింది.[4] "తెనాలి రామకృష్ణ బిఎ. బిఎల్ ఒక కోర్టు గదిలో జరిగిన సంఘటన మిళిత సినిమా" అని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక రాసింది.[5] "కొన్నికొన్ని క్షణాలు తప్ప, ఇది మిడ్లింగ్ కథనంతో బోరింగ్ కోర్ట్ రూమ్ డ్రామా సినిమా" అని ది హిందూ పత్రిక రాసింది.[6] "మొత్తంగా, తెనాలి రామకృష్ణ సింగిల్ స్క్రీన్‌ల ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకొని చేసిన కామెడీ సినిమా. మంచి కామెడీ, మలుపులతో మొదటి సగం ఆకట్టుకుంటుంది. కానీ రెండవ సగం కథనం, అగ్ర సన్నివేశాల కారణంగా నిరాశపరచబడింది" అని 123 తెలుగు రాసింది.[7]

మూలాలు మార్చు

  1. Chowdhary, Y Sunita (14 November 2019). "'Tenali Ramakrishna' is director Nageswara Reddy's attempt at total comedy". The Hindu. Retrieved 18 February 2021.
  2. Entertainment Desk. "Varalaxmi Sarathkumar all set for Tollywood debut". The Indian Express. No. 14 January 2019. Retrieved 18 February 2021.
  3. https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/tenali-ramakrishna-ba-bl-sundeep-kishan-hansika-starrer-officially-goes-on-floors/articleshow/67144659.cms
  4. "Tenali Ramakrishna BA BL review: unoriginal and uninspiring". Sify. 15 Nov 2019. Archived from the original on 16 నవంబరు 2019. Retrieved 18 February 2021.
  5. "Tenali Ramakrishna BA. BL movie review". Times of India. 15 Nov 2019. Retrieved 18 February 2021.
  6. "Tenali Ramakrishna BA BL review: Where's the wit and tact ?". The Hindu. 15 Nov 2019. Retrieved 18 February 2021.
  7. "Review : Tenali Ramakrishna BA BL – Just for few laughs". 123Telugu. 15 Nov 2019. Retrieved 18 February 2021.

బయటి లింకులు మార్చు