హిట్లర్ (సినిమా)

1997 సినిమా

హిట్లర్ 1997 లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఎడిటర్ మోహన్ సమర్పించగా ఎం. ఎల్. మూవీ ఆర్ట్స్ పతాకంపై ఎం. వి. లక్ష్మి నిర్మించిన ఈ చిత్రంలో చిరంజీవి, రంభ ప్రధాన పాత్రలు పోషించారు. నటుడు, రచయిత ఎల్. బి. శ్రీరామ్ ఈ చిత్రానికి సంభాషణలు అందించాడు. ఈ చిత్రం 42 కేంద్రాల్లో శతదినోత్సవం పూర్తి చేసుకుంది. 1996 లో మలయాళం లో ఇదే పేరుతో వచ్చిన విజయవంతమైన చిత్రం తెలుగు చిత్రానికి మూలం. మలయాళంలో మమ్ముట్టి, శోభన జంటగా నటించారు.[1]

‌హిట్లర్
Chiruhitler.jpg
దర్శకత్వంముత్యాల సుబ్బయ్య
కథా రచయితఎల్. బి. శ్రీరామ్ (మాటలు)
నిర్మాతఎం. వి. లక్ష్మి
తారాగణంచిరంజీవి,
రంభ,
అచ్యుత్
సంగీతంరాజ్ - కోటి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1997 జనవరి 4 (1997-01-04)
భాషతెలుగు

తారాగణంసవరించు

 • హిట్లర్ మాధవరావు గా చిరంజీవి
 • బుజ్జి గా రంభ
 • బాలచంద్ర అలియాస్ బాలు గా రాజేంద్ర ప్రసాద్
 • మాధవ తండ్రి గా దాసరి నారాయణరావు
 • రుద్రరాజు గా రామిరెడ్డి
 • చిన్నా గా ప్రకాష్ రాజ్
 • ఆదిశేషు గా రాజా కృష్ణమూర్తి
 • రుద్రరాజు సోదరుడిగా పొన్నంబళం
 • కాంతారావు గా సుధాకర్
 • జబార్ గా బాబు మోహన్
 • మాధవరావు చెల్లెలు గా అశ్విని
 • మాధవరావు చెల్లెలు గా మోహిని
 • మాధవరావు చెల్లెలు గా మీనాకుమారి
 • మాధవరావు చెల్లెలు గా గాయత్రి
 • అప్పలకొండ గా బ్రహ్మానందం
 • గంగమ్మ గా కల్పనా రాయ్
 • వై. విజయ

పరిచయంసవరించు

 • మమ్ముట్టి ఇదే పేరుతో నటించిన మలయాళ చిత్రం ఈ చిత్రానికి మూలం.

పాటలుసవరించు

కోటి స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి. లహరి మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదల అయ్యాయి.

హిట్లర్
కోటి స్వరపరచిన film
విడుదల1997
సంగీత ప్రక్రియSoundtrack
నిడివి30:34
భాషతెలుగు
రికార్డింగ్ లేబుల్లహరి మ్యూజిక్
నిర్మాతకోటి
కోటి యొక్క ఆల్బమ్‌ల కాలక్రమణిక
ముద్దుల మొగుడు
(1997)
హిట్లర్
(1997)
చిలక్కొట్టుడు
(1997)
సంఖ్య. పాటసాహిత్యంగాయకులు నిడివి
1. "నడక కలిసిన నవరాత్రి"  వేటూరి సుందర్రామ్మూర్తిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర 4:27
2. "కూసింది కన్నె కోయిల"  భువన చంద్రమనో, సుజాత, రేణుక, సంగీత 5:10
3. "కన్నీళ్ళకే కన్నీరొచ్చే"  సిరివెన్నెల సీతారామ శాస్త్రిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, అనుపమ, రేణుక 5:06
4. "మిస మిస మెరుపుల మెహబూబా"  చంద్రబోస్ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర 4:50
5. "ఓ కాలమా ఇది నీ జాలమా"  సిరివెన్నెల సీతారామ శాస్త్రికె. జె. ఏసుదాసు 4:40
6. "ప్రేమా జోహార్"  సిరివెన్నెల సీతారామ శాస్త్రిమనో, మురళి 6:06
మొత్తం నిడివి:
30:34

[2]

విశేషాలుసవరించు

 • అంతొద్దు - ఇది చాలు అన్న డైలాగు ఈ చిత్రం లోనిదే

మూలాలుసవరించు

 1. షణ్ముఖ (5 November 2017). సితార లో పాటల పల్లకి శీర్షిక హిట్లర్ అబిబీ... అరబిక్ దీదీ. ఈనాడు. |access-date= requires |url= (help)
 2. "Hitler (1997) Songs". telugulyrics.org. Archived from the original on 2017-10-26. Retrieved 2017-10-16.