అశ్విని (రుద్ర)
అశ్విని భారతీయ చలనచిత్ర, టివి నటి. తెలుగు, తమిళ, మళయాల సినిమాల్లో, సీరియళ్ళలో నటించిన అశ్వినికి, ఈటీవీలో వచ్చిన అంతరంగాలు, కళంకిత సీరియళ్ళతో మంచి గుర్తింపు వచ్చింది.[1] సింగపూర్ లో సెటిల్ అయిన అశ్విని ప్రస్తుతం అక్కడి సీరియళ్ళలో నటిస్తోంది.
అశ్విని | |
---|---|
![]() | |
జననం | రుద్ర |
జాతీయత | భారతీయురాలు |
ఇతర పేర్లు | ఆర్.వి. అశ్విని |
వృత్తి | నటి, నృత్యకారిణి |
క్రియాశీల సంవత్సరాలు | 1991-ప్రస్తుతం |
జీవిత విషయాలుసవరించు
అశ్విని కేరళలోని హిందూ కుటుంబంలో జన్మించింది. పాఠశాల చివరి సంవత్సరంలో తన స్నేహితురాళ్ళతో కలిసి మలయాళ పత్రిక కోసం మోడలింగ్ చేసింది.
సినిమారంగంసవరించు
1991లో తమిళ దర్శకుడు భారతీరాజా దర్శకత్వం వహించిన పుదు నెల్లు పుదు నాతు సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[2] తరువాత తమిళ, మళయాల చిత్రాలు ఎక్కువగా చేసింది. తెలుగులో 1995లో జయసుధతో ఆంటీ సినిమా, 1997లో చిరంజీవి చెల్లెలిగా హిట్లర్ సినిమా, శ్రీహరితో కలిసి 1999లో పోలీస్, 2000లో గణపతి చిత్రాలలో నటించింది. 1991 నుండి 2000 సంవత్సరం వరకు దాదాపు 25 చిత్రాలలో నటించింది.[3]
మణిచిత్రతాజు (1993), కిజక్కు చీమాయిలే (1993), ధ్రువం (1993), పిడక్కోజి కూవున్న నూట్టాండు (1994), కుడుంబకోదతి (1996) చిత్రాలలోని పాత్రలతో గుర్తింపుపొందింది.[4][2]
నటించిన చిత్రాలుసవరించు
సంవత్సరం | సినిమా పేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1991 | పుదు నెల్లు పుదు నాతు | మరికోజుందు | తమిళం | తొలిచిత్రం |
1991 | పోస్ట్ బాక్స్ నెం. 27 | విజి | మళయాలం | |
1992 | తూరతు సొంతం | ధనలక్ష్మీ | తమిళం | |
1992 | ఆయుష్కాలం | సుజాత | మళయాలం | |
1992 | కౌరవర్ | శ్రీదేవి | మళయాలం | |
1993 | మణిచిత్రతాజు | అల్లి | మళయాలం | |
1993 | కిజక్కు చీమాయిలే | పేచిi | తమిళం | |
1993 | బటర్ ఫ్లైస్ | మాయ దాస్ | మళయాలం | |
1993 | ధ్రువం | మాయ | మళయాలం | |
1993 | పిడక్కోజి కూవున్న నూట్టాండు | వసుంధర | మళయాలం | |
1994 | పవిత్రమ్ | రీటా | మళయాలం | |
1994 | పుదుపట్టి పొన్నుతాయి | రుక్కు | తమిళం | |
1994 | ముతల్ పయాణం | రాధ | తమిళం | |
1995 | ససినాస్ | డింగడి డింగూస్ | మళయాలం | |
1995 | ఆంటీ | కానీ | తెలుగు | |
1996 | మళయాల మాసం చింగం ఓనిను | రేణు | మళయాలం | |
1996 | కుడుంబకోదతి | పౌర్ణమి | మళయాలం | |
1997 | రామన్ అబ్దుల్లా | అయిశా | తమిళం | |
1997 | పేరియా తంబి | మీనా | తమిళం | |
1997 | హిట్లర్ | శారద | తెలుగు | |
1997 | పెళ్ళి చేసుకుందాం | రాధిక | తెలుగు | |
1997 | నజర్ | పింకీ | హిందీ | |
1999 | కల్లాజహర్ | సైరా | తమిళం | |
1999 | పోలీస్ | సుజాత | తెలుగు | |
2000 | ఎన్నవాలే | సీత | తమిళం | |
2000 | గణపతి | తమిళం |
టివిరంగంసవరించు
- తెలుగు
- అమ్మకానికో అమ్మాయి
- అంతర్నేత్రం
- అంతరంగాలు (ఈటీవి)
- కళంకిత (ఈటీవి)
- తొలి రోజులు
- తమిళం
సంవత్సరం | సీరియల్ పేరు | పాత్ర పేరు | ఛానల్ |
---|---|---|---|
1999 | చిన్ని చిన్ని ఆశై | మక్కల్ టీవి | |
2001 | టెక్ ఇట్ ఈజీ వాజ్కై | దుర్గ | సన్ టీవి |
2005–2007 | నిమ్మతి ఉంగల్ ఛాయిస్ | నిర్మల | |
2017 | అతియాయం | నందిని | మీడియా క్రాప్ వసంతం |
మసాలా | |||
2019–ప్రస్తుతం | మగరాసి | గోమతి | సన్ టీవి |
- మళయాలం
సంవత్సరం | సీరియల్ పేరు | పాత్ర పేరు | ఛానల్ |
---|---|---|---|
2005 | కాదమట్టుతు కథనార్ | మైథిలి | ఏసియానెట్ |
మూలాలుసవరించు
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-10-25. Retrieved 2020-06-14.
- ↑ 2.0 2.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-03-02. Retrieved 2020-06-14.
- ↑ చాయ్ పకోడి, సినిమాలు (4 May 2019). "నటి అశ్విని గుర్తు ఉందా... ఇప్పుడు ఎలా ఉందో చూస్తే గుర్తు పట్టలేరు". www.chaipakodi.com. Archived from the original on 14 జూన్ 2020. Retrieved 14 June 2020. Check date values in:
|archive-date=
(help) - ↑ http://entertainment.oneindia.in/celebs/rudra/filmography.html